అన్వేషించండి

Arthritis Pain Relief Fruits : చలికాలంలో కీళ్లనొప్పులు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ ఫ్రూట్స్ తినండి

Arthritis Pain Relief Tips : ఆర్థరైటిస్ సమస్య ఇబ్బంది పెడుతుందా? అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం అందించే పండ్ల లిస్ట్​ ఇక్కడ ఉంది. 

Treatment for Arthritis with Fruits : ఆర్థరైటిస్​కు పూర్తిగా చికిత్స లేదు. మనం తీసుకునే జాగ్రత్తల వల్లనే దానిని నుంచి ఉపశమనం కలుగుతుంది. కీళ్లవాపు వల్ల అనేది ఆర్థరైటిస్ ప్రధాన లక్షణం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, వేర్ అండ్ టియర్ లేదా జన్యుపరమైన కారణాల వల్ల ఇది వస్తుంది. అయితే ఈ సమస్య చలికాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో, చల్లని వాతావరణం వల్ల రక్తప్రసరణ తగ్గుతుంది. తద్వార కీళ్లలో దృఢత్వం తగ్గి.. నొప్పి పెరుగుతుంది. తద్వార కీళ్ల నొప్పులు తీవ్రమవుతాయి. ఈ సమయంలో కాస్త వెచ్చదనం, సున్నితమైన వ్యాయామాలు కాస్త ఉపశమనం ఇస్తాయి. అయితే మనం తీసుకునే ఫుడ్ కూడా దీనిపై ప్రభావం చూపిస్తుంది. సమతుల్యమైన ఆహారంతో పాటు.. కొన్ని పండ్లను మీ డైట్​లో కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అవేంటంటే.. 

సిట్రస్ ఫ్రూట్స్

చలికాలంలో విరివిగా లభించే నారింజ, నిమ్మ జాతికి చెందిన సిట్రస్​ ఫ్రూట్స్ ఆర్థరైటిస్ సమస్యను దూరం చేస్తాయి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ సంశ్లేషణకు కీలకమైనది. ఇది కీళ్లలోని మృదులాస్థి, బంధన కణజాలల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తుంది. వీటిని రెగ్యూలర్​గా తీసుకుంటే కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

బొప్పాయి

బొప్పాయి పండులో పాపైన్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్లనొప్పులు, వాటికి సంబంధించిన వాపును తగ్గించడంలో సహాయం చేస్తాయి. దీనిలోని విటమిన్​ ఎ, విటమిన్ సి కూడా కీళ్లనొప్పులు ఉన్నవారికి మంచి చేస్తాయి. ఇవి కణజాల మరమ్మత్తును ప్రోత్సాహించి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వార కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

పైనాపిల్

పైనాపిల్ పండులో బ్రోమెలైన్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఎంజైమ్​లు ఉంటాయి. ఆర్థరైటిస్​తో సంబంధం ఉన్న కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. పైనాపిల్ విటమిన్ సి, మాంగనీస్​లతో నిండి ఉండి.. ఇవి మొత్తం ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. 

అరటిపండ్లు

ఆర్థరైటిస్ ఉన్నవాళ్ల అరటిపండ్లు చాలా మంచివి. విలువైన పోషకాలతో నిండిన ఈ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తుంది. ఇవి కండరాల దృఢత్వాన్ని మెరుగుపరచి, తిమ్మిరిని నిరోధిస్తాయి. కాబట్టి ఆర్థరైటిస్​తో ఇబ్బంది పడుతున్నవారు ఉపశమనం కోసం అరటిపండ్లు తినొచ్చు.

పుచ్చకాయ

పుచ్చకాయ అనేది హైడేటింగ్, రిఫ్రెష్ ఫ్రూట్. దీనిలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. టమాటాల్లో కూడా లైకోపీన్ ఉంటుంది. పుచ్చకాయ కూడా ఇదే సమ్మేళనంతో నిండి ఉంటుంది. ఇది కీళ్ల ఆరోగ్యానికి తగినంత హైడ్రేషన్​ను అందిస్తుంది. తద్వార నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

ఇవే కాకుండా అవకాడో, బెర్రీలు, చెర్రీ వంటి పండ్లు కూడా కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి ఆర్థరైటిస్​తో ఇబ్బంది పడేవారు డాక్టర్​ను సంప్రదించి ఈ ఆహారాలను తమ డైట్​లో చేర్చుకోవచ్చు. 

Also Read : కర్పూరంతో జుట్టుకి ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఇలా ఉపయోగించండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Embed widget