అన్వేషించండి

Hole in the Baby Heart : పిల్లలకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉంటుందా? ఆ లక్షణాలు అస్సలు లైట్ తీసుకోకండి

Congenital Heart Defect In Children : మీకు తెలుసా? చాలామంది పిల్లలకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడుతుందట. అందుకే కొన్ని లక్షణాలు విస్మరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు నిపుణులు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పుట్టుకతో వచ్చే గుండె రంధ్రాలు ASD, VSD రకాలుగా ఉన్నాయి.
  • చిన్న రంధ్రాలు తమంతట తాముగా మూసుకుపోతాయి, పెద్దవాటికి చికిత్స అవసరం.
  • త్వరగా అలసిపోవడం, బరువు పెరగకపోవడం వంటివి లక్షణాలుగా గుర్తించాలి.
  • గర్భధారణ సమయంలో సమస్యలు, కుటుంబ చరిత్ర కారణాలు కావచ్చు.

Congenital Heart Defect : కొంతమంది చిన్న పిల్లలకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం (Hole in the Heart) ఉండొచ్చు. దీనిని వైద్య భాషలో Congenital Heart Defect అంటారు. సాధారణంగా గుండె గదులను విడదీసే గోడలో చిన్న రంధ్రం ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా రెండు రకాలుగా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. అవే ఏఎస్డీ, వీఎస్డీ. 

గుండెలో రంధ్రాలు రెండు రకాలు.. 

ASD-Atrial Septal Defect అంటే గుండె పై భాగంలోని గదుల మధ్య రంధ్రం. ఇది ఒకరకం. VSD-Ventricular Septal Defect అంటే గుండె కింది గదుల మధ్య రంధ్రం ఇది మరొక రకం. అయితే కొందరు పిల్లల్లో ఈ రంధ్రం చాలా చిన్నగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ దానికదే స్వయంగా మూసుకుపోతుంది. కానీ పెద్ద రంధ్రం ఉంటే చికిత్స లేదా సర్జరీ చేయించాల్సి వస్తుంది. 

గుండెలో రంధ్రం ఉంటే కనిపించే లక్షణాలు

పిల్లల్లో గుండెలో రంధ్రం ఉంటే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించాలి. పాలు తాగేటప్పుడు పిల్లలు త్వరగా అలసిపోతున్నారేమో చెక్ చేసుకోవాలి. అలాగే బరువు సరిగా పెరగకపోవడం, వేగంగా శ్వాస తీసుకోవడం, తరచూ జలుబు, దగ్గు రావడం, పెదవులు లేదా గోళ్లు నీలంగా మారడం, ఆడుకుంటే త్వరగా నీరసం రావడం వంటి లక్షణాలను పేరెంట్స్ విస్మరించకూడదు. 

అసలు గుండెల్లో రంధ్రం ఎందుకు వస్తుంది?

గర్భంలో శిశువు గుండె అభివృద్ధి చెందే సమయంలో కొన్ని మార్పులు సరిగా జరగకపోతే ఈ సమస్య రావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ, తల్లి ఆరోగ్య సమస్యలు, గర్భధారణ సమయంలో వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్లు కూడా పిల్లల గుండెల్లో రంధ్రానికి కారణం కావచ్చు.

చికిత్స ఎలా చేస్తారు?

డాక్టర్లు 2D ఎకో వంటి పరీక్షల ద్వారా హార్ట్​లోని హోల్ గుర్తిస్తారు. చిన్న రంధ్రాలకు మందులు, నిరంతర పర్యవేక్షణతో కేర్ తీసుకుంటారు. పెద్ద రంధ్రాలైతే సర్జరీ లేదా ప్రత్యేక ప్రక్రియ చేసి దానిని బ్లాక్ చేస్తారు. అయితే సమయానికి గుర్తిస్తే చాలా మంది పిల్లలు పూర్తిగా ఆరోగ్యంగా పెరుగుతారు. పిల్లల్లో పై లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

ఇలాంటి హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget