Eye Problems in Children : పిల్లల్లో వచ్చే కంటి సమస్యలు ఇవే.. వయసుల వారీగా ఇలా గుర్తించండి
Eye Problems : పిల్లల కంటి సంరక్షణ చాలా ముఖ్యం. పుట్టుకతో వచ్చే సమస్యల నుంచి వయసు పెరిగే కొద్ది పిల్లల్లో వచ్చే దృష్టి లోపాలు ఏంటో.. వాటిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Common Eye Problems in Kids : ఈ కాలంలో స్క్రీన్స్ ఎక్కువగా వాడడం వల్ల, ఇతర కారణాల వల్ల చాలామందికి అంధత్వం వచ్చేస్తుంది. అయితే మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా చేసిన వివిధ అధ్యయనాల ప్రకారం.. అంధత్వాన్ని ప్రారంభంలోనే గుర్తిస్తే చికిత్సతో దాదాపు 80 శాతం సమస్యను నివారించవచ్చట. అయితే పిల్లల్లో వయసుల వారీగా వచ్చే ప్రధాన కంటి ఆరోగ్య సమస్యలు ఏంటో.. వాటి లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలోనే గుర్తిస్తే.. పూర్తిగా నివారించడంలో హెల్ప్ అవుతుందని దిశా ఐ హాస్పిటల్లో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ అనన్య గంగూలీ చెప్తున్నారు.
పుట్టికతో వచ్చే సమస్యలు, లక్షణాలు
ఏడాది వయస్సున్న శిశువుల్లో.. కంటిని తీవ్రంగా ప్రభావితం చేసే కొన్ని సమస్యలు ఉంటాయి. కొందరిలో పుట్టుకతో నాసోలాక్రిమల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ (CNLDO) సమస్య వస్తుంది. అంటే పిల్లల్లో నాసోలాక్రిమల్ నాళం మూసుకుపోయి ఉంటుంది. పిల్లలు ఏడుస్తున్నప్పుడు అధికంగా నీరు కారడానికి కారణమవుతుంది. పుట్టుకతో వచ్చే సమస్యల్లో గ్లకోమా కూడా ఒకటి. ఈ సమస్య ఉంటే పిల్లలు సాధారణంగా ఉండే పగటి వెలుతురుకు కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతారు. కంటిపై ఒత్తిడి పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది బుల్-ఐ రూపాన్ని (బుఫ్తాల్మోస్) కలిగి ఉంటుంది.
పుట్టుకతో వచ్చే కంటి సమస్యల్లో శుక్లం, నిస్టాగ్మస్ కూడా మరోటి. సాధారణంగా పిల్లల కళ్లు దాదాపు 3 నెలల వయస్సు తర్వాత వస్తువులను ట్రాక్ చేయగలగాలి. అలా చేయడంలో వైఫల్యం, కళ్లల్లో తెల్లటి ప్రతిబింబం లేదా కళ్లు ఊరికే తెరవడం, మూయడం వంటి లక్షణాలు దీనిలో కనిపిస్తాయి. ఈ లక్షణం పుట్టుకతో వచ్చే శుక్లాన్ని సూచిస్తుంది. వీటితో పాటు కొందరికి వారసత్వ రెటినల్ డిస్ట్రోఫీలు వస్తాయి. వీటిని ముందుగానే గుర్తిస్తే కొన్ని అధునాతన విజువల్ ఎయిడ్స్ ద్వారా నిర్వహించవచ్చు. ROP లేదా అకాల బర్త్ రెటినోపతీ.. పిల్లలలో ఎక్కువగా కనిపించే మరొక కంటి సమస్య. 1.5 కిలోల కంటే తక్కువ బరువున్న వారిలో అసాధారణ రక్త నాళాలు పెరిగితే ఈ సమస్య వస్తుంది.
2 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు వచ్చే కంటి సమస్యలు
ప్రీ స్కూల్ సమయంలో అంటే 2 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు వచ్చే కంటి సమస్యలు ఏంటో.. వాటి లక్షణాలు ఏంటో చూసేద్దాం.
- రిఫ్రాక్టివ్ లోపాలు : ఈ కంటి సమస్య హైపియోపియా, మయోపియా లేదా ఆస్టిగ్మాటిజమ్‌ను హైలైట్ చేస్తుంది. వీటిని సాధారణంగా స్కూల్ విజువల్ టెస్ట్ ప్రోగ్రామ్స్ ద్వారా గుర్తించవచ్చు.
- స్ట్రాబిస్మస్ లోపం : ఇది క్రాస్డ్ కళ్లు లేదా లోపలికి (ఎసోట్రోపియా) లేదా బయటికి (ఎక్సోట్రోపియా) వస్తున్న కళ్లను సూచిస్తుంది.
- అంబ్లియోపియా లేదా లేజీ ఐస్ : ఇది చాలా సాధారణమైన కంటి సమస్య. ఇది ఏదొక కంటిలో దృష్టి లోపాన్ని సూచిస్తుంది. కళ్లద్దాలు పెట్టుకున్న సమస్య తగ్గకపోవచ్చు.
- కార్టికల్ విజువల్ ఇంపెయిర్‌మెంట్ (CVI): ఇది మెదడు నుంచి వచ్చే తీవ్రమైన రుగ్మతగా చెప్పొచ్చు. ఇది పిల్లలు, పెద్దలను కూడా ప్రభావితం చేస్తుంది. సెరెబ్రల్ విజువల్ ఇంపెయిర్మెంట్ని ఇది సూచిస్తుంది.
6 నుంచి 10 ఏళ్ల పిల్లల్లో వచ్చే కంటి సమస్యలు
6 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు.. కొన్ని సాధారణ కంటి సంబంధిత వ్యాధులు వస్తాయి. ఆస్థెనోపియా, వెర్నల్ కెరాటోకాన్జంక్టివిటిస్, డిజిటల్ ఐ స్ట్రెయిన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఆస్థెనోపియా సమస్య ఉంటే పిల్లల్లో తలనొప్పి, అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. రిఫ్రాక్టివ్ లోపం లేదా కన్వర్జెన్స్ లోపం వల్ల ఇది జరగవచ్చు. ఆప్టిక్ డిస్క్ ఎడెమా వంటి తీవ్రమైన పరిస్థితుల వల్ల కూడా తలనొప్పి రావచ్చు.
వెర్నల్ కెరాటోకాన్జంక్టివిటిస్ ఈ వయసు వారికి రావడం చాలా సాధారణం. దీనివల్లదృష్టి అస్పష్టంగా ఉంటుంది. కళ్లల్లో నీరు కారడం, తీవ్రమైన దురదకు ఇది కారణమవుతుంది. డిజిటల్ ఐ స్ట్రెయిన్ కూడా ఈ వయసులో ఎక్కువగా వస్తుంది. ఇటీవల పాఠశాల పిల్లలలో స్క్రీన్ సమయం పెరగడం వల్ల వస్తోన్న సమస్య ఇది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స విధానాలు
ఏయే వయసులో ఏయే కంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయో ముందుగా గుర్తిస్తే వాటిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పుట్టుకతో వచ్చే నాసోలాక్రిమల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ సమస్యలను గుర్తిస్తే చికిత్సతో తగ్గించవచ్చు. రిఫ్రాక్టివ్ లోపాలు, అంబ్లియోపియాను కరెక్టివ్ గ్లాసెస్, ప్యాచింగ్ థెరపీతో తగ్గించవచ్చు. శుక్లం, స్ట్రాబిస్మస్‌ను శస్త్రచికిత్సలతో దూరం చేసుకోవచ్చు. సీజనల్ అలెర్జీ లేదా VKC, కంటి ఇన్ఫెక్షన్లకు స్టెరాయిడ్ లేదా యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్‌తో పాటు కొన్ని యాంటీఅలెర్జిక్ మందులు ఉపయోగించవచ్చు.






















