News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

HIV Vaccine: గుడ్ న్యూస్- హెచ్ఐవీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్- వచ్చే ఏడాదికి ఫలితాలు

త్వరలోనే హెచ్ఐవీ వ్యాధికి కూడా వ్యాక్సిన్ రాబోతుందని పరిశోధకులు గట్టిగా చెబుతున్నారు. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి.

FOLLOW US: 
Share:

HIV Vaccine: హెచ్ఐవీ.. ఇదొక భూతం లాంటిది. ఈ వ్యాధిని నివారించేందుకు ఎటువంటి మందులు, టీకా లేవు. ఇది వస్తే రోగి జీవితం నాశనం అయినట్టే. రోజురోజుకీ  ఆరోగ్యం క్షీణించి మరణించడమే. కానీ ఇక మీదట హెచ్ఐవీ వల్ల ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదని పరిశోధకులు కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నారు. హెచ్ఐవీ వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి అమెరికా, సౌత్ ఆఫ్రికాలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. మొదటి దశలో వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి ప్రతిస్పందనని ప్రేరేపించే విధమైన నోవల్ వ్యాక్సిన్ ని అందించనున్నారు. దీని పేరు VIR-1388. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లో భాగమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డీసీజెస్(NIAID) ఈ వ్యాక్సిన్ కి అయ్యే ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. హెచ్ఐవీకి సంబంధించి అధ్యయనాలు చేసేందుకు నిధులను అందిస్తోంది.

ALso Read: ఇంట్లోనే ఇలా సింపుల్ గా మినరల్ వాటర్ తయారు చేసేసుకోండి!

VIR-1388 అనేది హెచ్ఐవీని గుర్తించి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ ని నిరోధించి రోగనిరోధక శక్తిని సూచించే T కణాలను ఉత్పత్తి చేసేందుకు సహకరిస్తుంది. VIR-1388 సైటోమెగలోవైరస్(CMV) వెక్టర్ ని ఉపయోగిస్తుంది. CMV శతాబ్దాలుగా ప్రపంచ జనాభాలో చాలా వరకు ఉంది. CMVతో జీవిస్తున్న చాలా మంది వ్యక్తులు ఎటువంటి లక్షణాలను అనుభవించరు, కానీ వాళ్ళు  వైరస్‌తో జీవిస్తున్నారని తెలియదు. NIAID 2004 నుంచి ఈ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం నిధులు సమకూరుస్తూ వస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కో లోని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, బయోటెక్నాలజీతో ఈ ట్రయల్‌కు నిధులు సమకూరుస్తోంది. ఈ ట్రయల్‌ని Vir స్పాన్సర్ చేసింది. ఈ క్లినికల్ ట్రయల్స్ యునైటెడ్ స్టేట్స్ లోని ఆరు సైట్స్ లో, సౌత్ ఆఫ్రికాలోని నాలుగు ప్రదేశాలలో జరుగుతోంది.

ఈ అధ్యయనంలో 95 మంది హెచ్ఐవీ నెగటివ్ పార్టిసిపెంట్లు నమోదు చేసుకున్నారు. ట్రయల్స్ ఫలితాలు 2024 చివర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదటి టీకా ఇచ్చిన తర్వాత మూడు సంవత్సరాల వరకు అధ్యయనం కొనసాగుతోంది. ఇదే జరిగితే ఎయిడ్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా ఎంతోమందిని రక్షించుకోవచ్చు. గతంలో కూడ హెచ్ఐవీ నిర్మూలన కోసం కృషి చేస్తున్న ఒక ప్రొఫెసర్ త్వరలోనే ఎయిడ్స్ కి అంతం రాబోతుందని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఎయిడ్స్ రోగులు కోలుకున్నట్టు నివేదికలు వస్తూనే ఉన్నాయి. ఐదుగురు హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులు పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ప్రకటించారు. 

Also Read: పండ్లు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Published at : 22 Sep 2023 01:08 PM (IST) Tags: HIV Vaccine AIDS HIV HIV Vaccine Clinical Trails

ఇవి కూడా చూడండి

World Aids Day: HIV కి వ్యాక్సిన్‌ ఎందుకు కనుక్కోలేకపోయారు? సైంటిస్ట్‌లకు ఎదురవుతున్న సవాళ్లేంటి?

World Aids Day: HIV కి వ్యాక్సిన్‌ ఎందుకు కనుక్కోలేకపోయారు? సైంటిస్ట్‌లకు ఎదురవుతున్న సవాళ్లేంటి?

Screen Effect on Children : మీ పిల్లలు టీవీ, ఫోన్లకు అలవాటు పడిపోతున్నారా? అది చాలా ప్రమాదం, ఇలా చేస్తే మేలు

Screen Effect on Children : మీ పిల్లలు టీవీ, ఫోన్లకు అలవాటు పడిపోతున్నారా? అది చాలా ప్రమాదం, ఇలా చేస్తే మేలు

World AIDS Day 2023 : పులిరాజా ఇప్పుడు సురక్షితమేనా? ఎయిడ్స్‌‌ను ఎలా గుర్తించాలి? నివారణ మార్గాలేమిటీ?

World AIDS Day 2023 : పులిరాజా ఇప్పుడు సురక్షితమేనా? ఎయిడ్స్‌‌ను ఎలా గుర్తించాలి? నివారణ మార్గాలేమిటీ?

Food Combinations: కలిపి వండకూడని కూరగాయల జాబితా ఇదిగో

Food Combinations: కలిపి వండకూడని కూరగాయల జాబితా ఇదిగో

Cabbage: క్యాబేజీతో ఇలా ఊతప్పం చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది

Cabbage: క్యాబేజీతో ఇలా ఊతప్పం చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్