అన్వేషించండి

ఇలా కూడా చేస్తారా భయ్యా? పరిగెట్టలేదని ఉద్యోగం నుంచి పీకేశారు, ఇలా రివేంజ్ తీర్చుకున్నాడు!

ఇదేదో పోలీస్ లేదా ఆర్మీ రిక్రూట్మెంట్ కాదు. ఒక సాధారణ ఉద్యోగంలో కొనసాగడానికి ఓ కంపెనీ తమ సిబ్బందికి పెడుతోన్న పరీక్ష. కానీ, చివరికి భారీ మూల్యమే చెల్లించుకుంది.

రోజుల్లో ఉద్యోగాలు.. గాల్లో దీపంలా మారాయి. కరోనా తర్వాత పరిస్థితి దయనీయంగా మారింది. అంతేకాదు.. సోషల్ మీడియా ప్రభావం, చాట్‌జీపీటీ, ఇతరాత్ర టెక్నాలజీల వల్ల చాలామంది ఉపాధి కోల్పోతున్నారు. ఐటీ రంగంలో జాబ్స్ మరింత దయనీయంగా మారాయి. అలాగే కొన్ని కంపెనీలు ఉద్యోగుల చిన్న చిన్న తప్పులను కూడా పెద్దవిగా చూపిస్తూ జాబ్ నుంచి పీకేస్తున్నాయి. అయితే, చైనాలోని ఓ సంస్థ ఉద్యోగులు పరిగెట్టలేకపోయారనే చిన్న కారణంతో సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. అదేంటీ, పరిగెట్టకపోయినా ఉద్యోగం నుంచి తీసేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారా? ఔనండి, వాళ్లు అదే చేశారు. దానికి కారణం కూడా చెప్పారు. 

చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని సుజౌ సిటీలో నివసిస్తున్న మిస్టర్ లియు అనే వ్యక్తి ఓ మెకానికల్ పరిశ్రమలో ఉద్యోగం సంపాదించాడు. ఈ సందర్భంగా ఆ సంస్థ యాజమాన్యం అతడికి వివిధ విభాగాల్లో పరీక్షలు పెట్టింది. ఎలక్ట్రికల్, గ్యాస్ కట్టింగ్ పరీక్షల్లో అతడు ఉత్తీర్ణత సాధించాడు. దీంతో అతడు ఆ పరిశ్రమంలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఎంతో సంతోషంగా కొన్నాళ్లు ఉద్యోగంలో చేశారు. మెయింటెనెన్స్ విభాగంలో పనిచేయడం ప్రారంభించాడు. అయితే, కంపెనీలో ఉద్యోగంలో పర్మినెంట్ కావాలంటే ఇంకో పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే విషయం అతడికి తెలీదు. అదే, పరుగు పందెం. 

ఔనండి రన్నింగ్ రేసే. ఉద్యోగి 30 నిమిషాల్లో 3 మైళ్లు ఆగకుండా పరిగెడితేనే సంస్థలో కొనసాగుతారు. లేకపోతే, పీకేస్తారు. ఈ విషయం విన్న తర్వాత లియుకు నోటి నుంచి మాట రాలేదు. ‘‘నేను పోలీస్, సైన్యం లేదా విపత్తుల నివారణ విభాగంలో పనిచేయడం లేదు కదా? ఎందుకు ఈ రన్నింగ్ రేస్’’ అని తన పై అధికారులను ప్రశ్నించాడు. ఇందుకు అతడు సమాధానంగా.. ‘‘నువ్వు ఫిట్‌గా ఉన్నావో లేదో మాకు ఎలా తెలుస్తుంది? నీ ఆరోగ్యం కంపెనీ ఉత్పత్తిపై ప్రభావం చూపకూడదంటే.. నువ్వెంత ఫిట్‌గా ఉన్నావు? పని చేయగలవా లేదా అని తెలుసుకోవాలి’’ అని అన్నారు. దీంతో లియు షాకయ్యాడు. 

మిట్టమధ్యాహ్నం.. ఎండలో పరుగు

సరిగ్గా మిట్టమధ్యాహ్నం సమయంలో 40 డిగ్రీల సెల్సియస్ ఎండలో అతడికి రన్నింగ్ టెస్ట్ నిర్వహించారు. 5 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే లియు ఫిట్‌గానే ఉన్నా.. అలా పరిగెట్టే అలవాటు లేదు. దీంతో నిర్ణీత సమయంలో ఆ పరుగును పూర్తి చేయలేకపోయాడు. దీంతో యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఆగ్రహానికి గురైన లియు కోర్టును ఆశ్రయించాడు. తనని ఉద్యోగం నుంచి అకారణంగా తొలగించారంటూ కంపెనీపై దావా వేశాడు. ఉద్యోగంలో చేరడానికి ముందు  తనకు వైద్య పరీక్షలు చేశారని, దానికి కూడా తన సొంత డబ్బులే చెల్లించానని వెల్లడించాడు. అయినా సరే వారు తనని పరిగెట్టించారని వాపోయాడు.

అస్వస్థతకు గురైన లియు

తీవ్రమైన ఎండలో పరిగెట్టడం వల్ల లియు అస్వస్థతకు గురయ్యాడు. సుమారు 800 మీటర్లు పరిగెట్టిన తర్వాత వడదెబ్బకు గురయ్యాడు. అయినా సరే అతడు అదే రోజు యథావిధిగా పనికి వెళ్లాడు. అయితే, తర్వాతి రోజు యాజమాన్యం షాకింగ్ విషయాన్ని చెప్పింది. రన్నింగ్‌లో ఫెయిల్ అయినందుకు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు తప్పకుండా 5 కిలోమీటర్ల పరుగును 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. లేకపోతే వారికి ‘కష్టపడి పనిచేసే స్ఫూర్తి’ లేదని కంపెనీ భావిస్తుంది. అయితే, ఈ విషయాన్ని లియుకు ఇంటర్వ్యూలో చెప్పకపోవడమే కంపెనీ చేసిన తప్పు. అది ముందే తెలిసి ఉంటే లియు తగిన నిర్ణయం తీసుకొనేవాడు. కానీ, ఉద్యోగంలో చేరిన తర్వాత పరిగెట్టించి ఇబ్బంది పెట్టడమే అతడికి నచ్చలేదు. అందుకే అతడు కోర్టుకెక్కాడు. ఈ కేసును విచారించిన సుజౌ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్ట్.. లియుకు సానుకూలంగా తీర్పు ఇచ్చింది. అతనికి పరిహారంగా 7,000 యువాన్లు (రూ.సుమారు 80 వేలు) చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.

Also Read: ఇవన్నీ చిన్న సమస్యలే అనుకుంటాం - కానీ, అవి ప్రాణాంతక క్యాన్సర్ లక్షణాలని మీకు తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget