News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Chicken Omelette: ప్రొటీన్లు నిండుగా చికెన్ ఆమ్లెట్, చేయడం చాలా సులువు

ఎప్పుడు ఒకేలాంటి ఆమ్లెట్ తిని బోరు కొట్టిందా? అయితే ఇది ప్రయత్నించండి.

FOLLOW US: 
Share:

ప్రొటీన్లు ఉండే ఆహారం తినడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలు, శారీరకంగా కష్టపడేవారికి ప్రొటీన్లు ముఖ్యం. గుడ్డు ప్రొటీన్లకు నిలయం, అలాగే చికెన్లో కూడా ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ కలిపి ఆమ్లెట్ వేస్తే రుచి మామూలుగా ఉండదు. దీన్ని చేయడం కూడా చాలా సులువు. 

కావాల్సిన పదార్ధాలు
బోన్ లెస్ చికెన్ - 100 గ్రాములు
గుడ్డు - రెండు
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
నూనె - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర స్పూను
పసుపు - పావు స్పూను
గరం మసాలా - పావు స్పూను

తయారీ ఇలా...
1. బోన్‌లెస్ చికెన్‌ను ఆమ్లెట్ కోసం ఎంచుకోవాలి. చికెన్‌ను ముందే ఉడకబెట్టుకోవాలి. 
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, చికెన్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు మొదలగునవి వేసి వేయించాలి. 
3. అవన్నీ బాగాక ఆ మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. 
4. ఆ గిన్నెలో రెండు గుడ్లు కొట్టి వేయాలి. బాగా కలపాలి. 
5. ఆ గుడ్ల మిశ్రమంలో చికెన్ ముక్కల మిశ్రమాన్ని వేసి గిలక్కొట్టాలి. 
6. పెనం వేడెక్కాక నూనె వేసి గుడ్ల మిశ్రమంలో ఆమ్లెట్‌లా వేసుకోవాలి. రెండు వైపులా కాల్చుకోవాలి. 
7. ఆమ్లెట్ల చుట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. 

ప్రోటీన్ లోపం రాదు...
ఇలా చికెన్ ఆమ్లెట్ వారానికి రెండు సార్లు వేసుకుని తింటే మంచిది. దీని వల్ల ప్రోటీన్ లోపం తలెత్తదు. మనదేశంలో 73 శాతం మందిలో ప్రొటీన్ లోపం ఉందని సర్వేలు తేల్చాయి. శరీరం ఎదగడానికి ప్రొటీన్ చాలా అవసరం. అందుకే పిల్లలకు పెట్టమని చెబుతారు వైద్యులు. ఎంత ప్రొటీన్ తీసుకోవాలో కూడా చాలా మంది ప్రజలకు తెలియదు. మీ శరీరబరువు ఎన్ని కిలోలు ఉంటే అన్ని గ్రాముల ప్రొటీన్ అవసరం పడుతుంది. లేకుంటే ప్రొటీన్ లోపం తలెత్తుతుంది.  దీని వల్ల అనేక ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వీటిలో ప్రొటీన్లు అధికం...
చేపలు, సముద్రపు ఆహారం, చికెన్ (స్కిన్ లెస్), తక్కువ కొవ్వు ఉండే పాలు, పెరుగు, చీజ్, గుడ్లు, బీన్స్ వంటి వాటిలో ప్రొటీన్లు అధికం. వీటిలో కనీసం రెండు రోజూ తినేందుకు ప్రయత్నించాలి. 

Also read: అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు ఏం తింటారు? వారికి ఉప్పు, పంచదార కూడా పంపించరా?

Also read: తలనొప్పి, మైగ్రైన్‌తో బాధపడుతున్నారా? ఈ యోగాసనాలు తగ్గిస్తాయి

Published at : 20 Jun 2022 09:16 PM (IST) Tags: Telugu vantalu Chicken Recipe in Telugu Chicken Omelette Recipe in Telugu Chicken Egg Omelette

ఇవి కూడా చూడండి

Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది

Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది

Stomach Cancer: కడుపులో ఇలా అనిపిస్తోందా? క్యాన్సర్ కావచ్చు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Stomach Cancer: కడుపులో ఇలా అనిపిస్తోందా? క్యాన్సర్ కావచ్చు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Nuvvula Chikki Recipe : పిల్లలకు చలికాలంలో నువ్వల చిక్కీ పెడితే ఎంతో మంచిది

Nuvvula Chikki Recipe :  పిల్లలకు చలికాలంలో నువ్వల చిక్కీ పెడితే ఎంతో మంచిది

Christmas Gift Ideas : క్రిస్మస్ స్పెషల్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం బడ్జెట్​ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే

Christmas Gift Ideas : క్రిస్మస్ స్పెషల్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం బడ్జెట్​ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే