IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Carrot Laddoo: పోషకాలు నిండుగా క్యారెట్ లడ్డూ, తింటే ఎంత ఆరోగ్యమో

ఆరోగ్యకరమైన కూరగాయల్లో క్యారెట్ ముందుంటుంది. దీంతో స్వీట్ చేసుకుంటే ఆ టేస్టే వేరు.

FOLLOW US: 

క్యారెట్ సుగుణాలు ఇన్నీ అన్నీ కావు. దీన్ని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మరెన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు. చర్మ ఆరోగ్యానికి ఇది మరీ మంచిది. క్యారెట్లో ఉండే కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే బీటా కెరాటిన్ విటమిన్ ఎ గా మారి ఆరోగ్యానికి రక్షగా నిలుస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తనాళాలకు చాలా మేలు చేస్తుంది.రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. దీనివల్ల  గుండె సంబంధ వ్యాధులు, హైబీపీ వంటివి కూడా రావు. వీటిని రోజూ తినేవారిలో మలబద్ధకం సమస్య రాదు. మహిళలు, పిల్లలు కచ్చితంగా వీటిని రోజూ తినాలి. ఎందుకంటే వీరిలోనే రక్త హీనత సమస్య అధికంగా వస్తుంది. క్యారెట్ ఆ సమస్యకు చెక్ పెడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది ముందుంటుంది. దీన్నిండా విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ వండుకుని తినే కన్నా పచ్చిగా తింటనే బోలెడన్ని లాభాలు. 

క్యారెట్ తో రకరకాల వంటలు చేసుకోవచ్చు. వేపుడు, సాంబారు, కూరలు, స్వీట్లు ఇలా ఎన్నో టీస్టీ వంటకాలు వీటితో సిద్ధమవుతాయి. క్యారెట్ తో చేసే లడ్డూ కూడా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఓసారి ప్రయత్నించి చూడండి. చేయడం చాలా సులువు. 

కావాల్సిన పదార్థాలు
క్యారెట్ తురుము - అరకిలో
పచ్చి కొబ్బరి తురుము - వందగ్రాములు
పంచదార - పావుకిలో (తగ్గించుకోవచ్చు కూడా)
నెయ్యి - రెండు స్పూనులు
వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్ - గుప్పెడు (అన్నింటి తరుగు)
యాలకుల పొడి - అర టీస్పూను

తయారీ ఇలా
1. ముందుగా క్యారట్లు శుభ్రంగా కడుక్కుని తురుములా చేసుకోవాలి. 
2. కళాయిలో నెయ్యి వేసి క్యారెట్ తురుమును వేయించాలి. పచ్చివాసన పోయే వరకు వేయించాలి. 
3. తరువాత కొబ్బరి తురుమును కూడా చేర్చాలి. రెండు నిమిషాలు వేయించాక గరిటెతో బాగా కలిపి మూత పెట్టేయాలి. 4. ఓ అయిదు నిమిషాల తరువాత మూత తీసి పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి. 
5. నీరంతా దిగి మిశ్రమం కాస్త దగ్గరగా గట్టిగా అయ్యేదాకా బాగా కలపాలి. 
6. జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్ లు, యాలకుల పొడి కూడా  వేసి బాగా కలపాలి. 
7. మిశ్రమం లడ్డూల చుట్టేందుకు వీలుగా గట్టిగా అయ్యాక స్టవ్ కట్టేయాలి. 
8. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టి చిన్న బాక్సులో వేసి మూత పెట్టి ఫ్రిజ్ లో పెడితే వారం రోజుల పాటూ తాజాగా ఉంటాయి. 

పిల్లలకు ఇవి మంచి స్వీట్ అని చెప్పవచ్చు. శక్తి కూడా అందుతుంది. పైగా ఆరోగ్యం కూడా. 

Also read: మెన్‌స్ట్రువల్ కప్ చూసి భయపడకండి, దాన్ని వాడడం చాలా సులువు

Also read: బెడ్ షీట్లు మార్చడానికి అంత బద్ధకమా? సర్వేలో షాకింగ్ నిజాలు

Also read: వినూత్నంగా ఆవులకూ ఫేస్ మాస్క్‌లూ, వాటి నుంచి వచ్చే విషవాయువును అడ్డుకోవడానికే ఇదంతా

Published at : 01 May 2022 04:51 PM (IST) Tags: Carrot laddoo Carrot Laddoo Recipe In telugu Carrot laddoo Telugu vantalu Carrot Recipes in Telugu

సంబంధిత కథనాలు

Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి

Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి

Umbrella: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే

Umbrella: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే

Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి

Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి

Wall Sit: గోడ కుర్చీ శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష, రోజుకు అయిదు నిమిషాలు వేస్తే ఎన్ని ప్రయోజనాలో

Wall Sit: గోడ కుర్చీ శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష, రోజుకు అయిదు నిమిషాలు వేస్తే ఎన్ని ప్రయోజనాలో

Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి

Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి

టాప్ స్టోరీస్

Stock Market News: శుక్రవారం డబ్బుల వర్షం! రూ.5.5 లక్షల కోట్లు ఆర్జించిన ఇన్వెస్టర్లు, సెన్సెక్స్‌ 1163+

Stock Market News: శుక్రవారం డబ్బుల వర్షం! రూ.5.5 లక్షల కోట్లు ఆర్జించిన ఇన్వెస్టర్లు, సెన్సెక్స్‌ 1163+

CM KCR Tour : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ గురి, నేటి నుంచి వరుస పర్యటనలు

CM KCR Tour : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ గురి, నేటి నుంచి వరుస పర్యటనలు

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!