(Source: ECI/ABP News/ABP Majha)
Green Tea: గ్రీన్ టీ పిల్లలు కూడా తాగొచ్చా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
గ్రీన్ టీ ఎంతో ఆరోగ్యకరం.మరి పిల్లలకు కూడా గ్రీన్ టీ అలవాటు చేయొచ్చా.
ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన పెద్దలందరూ గ్రీన్ టీ బాట పడుతున్నారు. పెద్దలు గ్రీన్ టీ తాగుతుంటే మేమూ తాగుతామనే పిల్లలు కూడా ఉంటారు. దాని రుచి వారికి నచ్చకపోయినా తల్లిదండ్రులు తాగడం చూసి ఆసక్తి చూపిస్తారు కొంతమంది పిల్లలు. గ్రీన్ టీ కేవలం పెద్దలకేనా? పిల్లలకి కూడా తాగించవచ్చా?
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పెద్దలకు ఎంతో మేలు చేసే పానీయం ఇది. ఈ గ్రీన్ టీ ఆ మేలు పిల్లలకు కూడా చేస్తుందా అంటే కచ్చితంగా చేస్తుందనే చెప్పాలి. గ్రీన్ టీలో ఉన్న సుగుణాలు పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. కానీ చిన్న సమస్య ఉంది.ఆ సమస్య గురించి చెప్పాలంటే గ్రీన్ టీపై జరిగిన పరిశోధన ఏం చెబుతోందో తెలుసుకోవాలి.
పరిశోధన ప్రకారం...
గ్రీన్ టీ పూర్తిగా ఆకుల సమ్మేళనంతో తయారైనప్పటికీ కొద్దిమొత్తంలో కెఫీన్ ఉంటుంది. పిల్లలకు కెఫీన్ ఇవ్వడం అంత మంచిది కాదు. అందుకే కాఫీ, టీలు కూడా పిల్లలకు వద్దనే సిఫారసు చేస్తారు వైద్యులు. వారికి ఉత్తమం ఎంపిక పాలు మాత్రమే. కాఫీ, టీలలో ఉన్నంత కెఫీన్ గ్రీన్ టీలో ఉండదు కానీ, ఎంతో కొంత మాత్రం ఉంటుంది. పిల్లలకు గ్రీన్ టీ ఇవ్వకూడదనే నియమం లేదు. కానీ మొదటిసారి తాగించాక ఏమైనా రియాక్షన్ వస్తే మాత్రం వెంటనే ఆపేయాలి. పిల్లల శరీరానికి కెఫీన్ పడుతుందని చెప్పలేం. కొన్ని సమస్యలున్న పిల్లలకు మాత్రం టీ,కాఫీ, గ్రీన్ టీ ఇవ్వకూడదు. నిద్రపట్టక ఇబ్బంది పడే పిల్లలకు గ్రీన్ టీ ఇశవ్వకూడదు. కెఫీన్ నిద్రను దగ్గరకు రానివ్వదు.
ఎలాంటి సమస్యలు లేని పిల్లలకు, మొదటిసారి గ్రీన్ టీ తాగినా కూడా ఎలాంటి రియాక్షన్ కనిపించని పిల్లలకు మాత్రం రోజుకో కప్పు గ్రీన్ టీ తాగించవచ్చు. కాస్త చేదుగా ఉండే గ్రీన్ టీ పిల్లలు తాగలేకపోతే నిమ్మరసం, తేనెలాంటివి కలిపి ఇవ్వచ్చు. దీనివల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.జలుబు, దగ్గు వచ్చినప్పుడు గ్రీన్ టీ ఇస్తే మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు అలాంటి అలెర్జీలను త్వరగా తగ్గిస్తాయి. చాక్లెట్లు, తీపి పదార్థాలు అధికంగా తినే పిల్లలకు గ్రీన్ టీ ఇస్తే మేలు. ఎందుకంటే వారి దంతల్లో కావిటీలు వచ్చే అవకాశం ఎక్కువ. గ్రీన్ టీ దంతాల్లోని బ్యాక్టిరియాను చంపి క్యావిటీలనుంచి కాపాడుతుంది.
జీర్ణశక్తికి...
అజీర్తి సమస్యలతో బాధపడే పిల్లలకు రోజుకో కప్పు గ్రీన్ టీ తాగిస్తే చాలా మంది. వారిలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. మీ పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే మాత్రం గ్రీన్ టీ తాగించే ముందు వైద్యుడిని సంప్రదించిన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
Also read: ఏ వయసు పిల్లలు ఎంతసేపు స్క్రీన్ చూడొచ్చు? అతిగా స్క్రీన్ చూడడం వల్ల వచ్చే ప్రమాదమేంటి?