Bowel ancer: మీ కడుపులో నిత్యం ఇదే సమస్య? జాగ్రత్త, అది పేగు క్యాన్సర్‌కు సంకేతం!
మీ కడుపులో ఈ సమస్యలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. అది పేగు క్యాన్సర్ కావచ్చు.
![Bowel ancer: మీ కడుపులో నిత్యం ఇదే సమస్య? జాగ్రత్త, అది పేగు క్యాన్సర్‌కు సంకేతం! bowel cancer symptoms, what happen to Dame Deborah James Bowel ancer: మీ కడుపులో నిత్యం ఇదే సమస్య? జాగ్రత్త, అది పేగు క్యాన్సర్‌కు సంకేతం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/29/76f7d186a3cacd08ff3e6e581b6fbeaa_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యూకేకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్, సామాజికవేత్త డేమ్ డెబోరా జేమ్స్.. 40 ఏళ్ల వయస్సులోనే కన్నుమూశారు. చిన్న వయస్సులోనే ఆమె మరణించడానికి కారణం.. ‘పేగు క్యాన్సర్’. దీన్నే ‘Bowel Cancer’ అని అంటారు. ఇది ఎవరికైనా సరే రావచ్చు. అయితే, ఆమె బతికున్న రోజుల్లో తనకు ఉన్న సమస్య గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి చాలా ప్రయత్నించారు. తనకు వచ్చిన కష్టం ఇతరులకు రాకూడదనే మంచి మనసుతో గట్టి ప్రచారమే చేశారు. అందుకే ఆమెను అంత ‘బోవెల్‌బేబ్’ అని పిలుస్తారు.
2016లో ఆమె ప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. చికిత్స కోసం ఆమె చేయని ప్రయత్నాలు లేవు. ఆమెలా క్యాన్సర్‌తో బాధపడుతున్నవారికి సైతం ఆమె అండగా నిలిచింది. వివిధ ట్రీట్మెంట్‌లతో క్యాన్సర్‌ను జయించేందుకు చివరి వరకు పోరాడింది. కానీ, క్యాన్సర్‌దే పైచేయి అయ్యింది. బుధవారం ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని ‘బోవెల్‌బేబ్’కు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ప్రకటించింది.
ప్రేగు క్యాన్సర్‌కు ముందు కనిపించే ప్రధాన లక్షణాలివే:
⦿ ఎలాంటి కారణం లేకుండా మూత్రం నుంచి నిరంతరంగా రక్తం కారడం.
⦿ సాధారణం కంటే ఎక్కువసార్లు మలవిసర్జన చేయడం.
⦿ నిత్యం దిగువ కడుపులో నొప్పి, ఉబ్బరం లేదా అసౌకర్యం.
⦿ మీకు ఆకలి లేకపోయినా, అకస్మాత్తుగా బరువు తగ్గినా సరే సందేహించాలి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
⦿ అయితే, మలంలో రక్తం కనిపిస్తే కంగారు పడొద్దు. ఫైల్స్ లేదా, మీరు తిన్న ఆహారం వల్ల కూడా రక్తం కారవచ్చు.
Also Read: వింత వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ, ఇది వారసత్వంగా వస్తుందట!
ఏం చేయాలి?: పై లక్షణాలు మీలో కనిపించినట్లయితే తప్పకుండా డాక్టర్‌ను కలవండి. పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నవారిలో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడినవారే. ముందుగా గుర్తించకపోతే.. వయస్సుతోపాటే క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుంది. మూడు వారాలు లేదా అంత కంటే ఎక్కువ రోజులు మీలో పై లక్షణాలు కనిపిస్తే.. తప్పకుండా ‘పేగు క్యాన్సర్’గా సందేహించాలి. అప్రమత్తంగా లేకపోతే.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
View this post on Instagram
Also read: మిగిలిపోయిన అన్నంతో ఇలా దోశెలు, టేస్టు అదిరిపోతుంది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)