(Source: Poll of Polls)
Bombay Blood Group: అత్యంత అరుదైనది బాంబే బ్లడ్ గ్రూప్, దానికి ఓ నగరం పేరు ఎలా వచ్చింది?
రక్త వర్గాల్లో అత్యంత అరుదైనది బాంబే బ్లడ్ గ్రూప్. ఇది ఎంత అరుదైనదేమో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
పుట్టిన ప్రతి మనిషికి ఓ బ్లడ్ గ్రూపు కచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ బ్లడ్ గ్రూపేంటో తెలుసుకోవాలి. ఎవరికైనా అవసరం అయినప్పుడు దానం చేయడానికి, లేదా మీకు అవసరమైనప్పుడు ఇతరులు మీకు దానం చేసేందుకు బ్లడ్ గ్రూపు తెలియాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ప్రపంచంలో పుట్టినవారిలో ఎక్కువమంది ప్రజలు బ్లడ్ గ్రూపులు ఏ, బి, ఓ... లలో పాజిటివ్ లేదా నెగిటివ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇవి సాధారణ గ్రూపులు. AB నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కాస్త అరుదైనది. అన్నింటికన్నా అరుదైన రక్తవర్గం అయితే ‘బాంబే బ్లడ్ గ్రూప్’ అనే చెప్పుకోవాలి. ఇదెంత అరుదైనదంటే మన దేశంలో 179 మంది మాత్రమే ఈ బ్లడ్ గ్రూపును కలిగి ఉన్నారు. అలాగే ప్రపంచంలో పదిలక్షల మందిలో నలుగురికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూపు ఉంది. అంటే ఇదెంత అరుదైనదో అర్థమై ఉంటుంది.
బాంబే పేరు ఎందుకు?
మనదేశంలో ఈ బ్లడ్ గ్రూపును కలిగి ఉన్న వ్యక్తులు 179 మంది ఉన్నారని చెప్పుకున్నాం కదా, వారిలో చాలా మంది ముంబైలోనే నివసిస్తున్నారు. అప్పట్లో బాంబేలో నివసిస్తున్న వారిలోనే ఈ బ్లడ్ గ్రూపు కనుగొన్నారు. 1952లో బాంబేలోని ఓ కుటుంబంలో ఈ బ్లడ్ గ్రూపు కనిపెట్టారు. అప్పట్నించి బాంబే బ్లడ్ గ్రూపు అని పిలవడం మొదలుపెట్టారు. ఈ బ్లడ్ గ్రూపు వారు బాంబేకి చెందిన వారేనని, అక్కడ్నించి మిగతా ప్రాంతాలకు ఉద్యోగ రీత్యా వెళ్లిపోయారని భావిస్తారు. ఈ బ్లడ్‌ను అవసరమైతే ఇతర దేశాలకు దిగుమతి, ఎగుమతి కూడా చేస్తారు. ఓసారి మయన్మార్ కు చెందిన మహిళా రోగికి గుండె సర్జరీ చేసినప్పుడు బాంబే బ్లడ్ గ్రూపు అవసరం పడింది. ఒక దాత ఇండియాలో రక్తాన్ని దానం చేస్తే మయన్మార్ ఎగుమతి చేశారు ఆ రక్తాన్ని. అది కూడా కొరియర్ ద్వారా పంపించారు.
ఈ రక్తం ఉన్న వారి కోసం ఒక సంస్థ ఉంది. BombayBloodGroup.Org వెబ్ సైట్లో ఈ ఈ రక్తవర్గాన్ని కలిగి ఉన్నవారు తమ వివారాలను నమోదు చేసుకోవాలి. దీని వల్ల వారికి అవసరం అయినప్పుడు అందులోని దాత ద్వారా రక్తాన్ని పొందవచ్చు, అలాగే దానం కూడా చేయవచ్చు. ఈ రక్తాన్ని సేకరించాక ఏడాది పాటూ సురక్షితంగా నిల్వ ఉంచుతారు.
ఏంటి అంత ప్రత్యేకత?
మామూలు బ్లడ్ గ్రూపులలోని ఎర్ర రక్త కణాల్లో షుగర్ మాలిక్యుల్స్ ఉంటాయి. అవే బ్లడ్ గ్రూపును నిర్ధయిస్తాయి. ఈ మాలిక్యుల్స్ ‘కేపిటల్ హెచ్ యాంటిజన్’ ఏర్పడుతుంది. అలాగే యాంటిజెన్ ఎ, బిలు కూడా ఏర్పడతాయి. వీటన్నింటి ద్వారా బ్లడ్ గ్రూపు ఖరారవుతుంది. కానీ బాంబే బ్లడ్ గ్రూపులో షుగర్ మాలిక్యుల్స్ ఉండవు. కేపిటల్ హెచ్ యాంటిజెన్ కూడా ఉండదు. అయినా వారి రక్తంలోని ప్లాస్మాలో మాత్రం యాంటీబాడీలు ఎ, బి,హెచ్ ఉంటాయి. అందుకే ఈ రక్తంలో మిగతా రక్త వర్గాలతో పోలిస్తే చాలా అరుదైనది, భిన్నమైనది.
Also read: డయాబెటిస్ ఉన్న వారు మద్యం తాగొచ్చా? తాగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Also read: బాతు నూనె గురించి తెలుసా? దీనితో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.Al