Heart Attack Warning Signs : హార్ట్ ఎటాక్ వచ్చే నెలముందు నుంచే మహిళల్లో ఆ లక్షణాలు కనిపిస్తాయట.. అవి ఇవే
Heart Attack in Woman : గుండెపోటు వచ్చే నెల ముందు నుంచే మహిళల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని తాజా అధ్యయన తెలిపింది. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..
Warning Signals of Heart Attack : హార్ట్ ఎటాక్ అనేది సైలంట్ కిల్లర్‌గా చెప్తారు. కానీ గుండెపోటు వచ్చే ముందు శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయట. పైగా ఈ లక్షణాలు మగవారిలో, ఆడవారిలో భిన్నంగా ఉంటాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలోనే చేసిన అధ్యయనంలోని కొన్ని ఫలితాలను మరింత ఇంట్రెస్టింగ్గా మారాయి. గుండెపోటు వచ్చే నెల ముందు నుంచే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు తెలిపారు. ఇంతకీ ముందుగా కనిపించే ఆ లక్షణాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
హార్ట్ ఎటాక్ వచ్చిన మహిళలపై ఈ అధ్యయనం చేయగా.. దానిలో దాదాపు 80 శాతం మంది.. నెల ముందు నుంచి ఏదొక సమస్యతో ఇబ్బంది పడినట్లు తేలింది. హార్ట్ ఎటాక్ సమయంలో వచ్చే ఛాతినొప్పి కాకుండా.. మరిన్ని లక్షణాలు వాళ్లు అనుభవించినట్లు గుర్తించారు. ఆ లక్షణాలు ఏంటంటే..
- ఛాతీలో నొప్పి..
గుండె దగ్గర పట్టేసినట్టు.. ఛాతిలో నొప్పిగా ఉంటుంది. చేయి లాగడం, మెడ, దవడ, వెన్ను దగ్గర నొప్పి రావడం, కడుపు నొప్పి, బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.
- ఫటిగో..
ఎలాంటి సమస్య లేకుండా ఫటిగో రావడం.. అది ఎక్కువ రోజులు ఉండడం లేదా సడెన్‌గా ఫటిగో సమస్యలు వస్తుంటాయట. త్వరగా అలిసిపోయి.. తలనొప్పి, మైగ్రేన్, డిప్రెషన్‌తో సతమతమవుతుంటారట. స్ట్రెస్ ఎక్కువ కావడం.. ముఖం ఏడ్చినట్లుగా మారడం, చేతి నొప్పి దీనిలో భాగమే. ఈ ఫటిగో లక్షణాలు మహిళల్లో హార్ట్ఎటాక్కి హెచ్చరికేనని తేల్చారు.
- నిద్రలో ఇబ్బందులు
నిద్రపోవడంలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందట. రాత్రుళ్లు లేట్‌గా పడుకుని.. ఉదయాన్నే తర్వగా నిద్రలేవడం కూడా దీనిలో భాగమే. ఇన్సోమియా, సరైన విశ్రాంతి లేకపోవడం, రాత్రుళ్లు మధ్యలో లేవడం వంటివి హార్ట్ ఎటాక్‌కి వార్నింగ్ సైన్‌గా చెప్పారు.
- యాంగ్జైటీ
చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో యాంగ్జైటీ కూడా ఒకటి. ఒంటరిగా ఫీల్ అవ్వడం, ఎవరితోనూ బాధలు పంచుకోకపోవడం, చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవ్వడం ఇవన్నీ యాంగ్జైటీ లక్షణాలే. అయితే ఈ యాంగ్జైటీ కూడా గుండెపోటు లక్షణాల్లో ఒకటే అంటున్నారు.
- వర్టిగో..
నీరసంగా ఉండడం.. కళ్లు తిరిగి పడిపోవడం వంటివి.. వంటి వర్టిగో లక్షణాలు. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కూడా ఈ సమస్య మహిళల్లో వస్తుందట.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..
వయసు పెరిగిన వాళ్లలో బ్రీతింగ్ సమస్యలు వస్తుంటాయి. అయితే హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కూడా మహిళల్లో బ్రీతింగ్ సమస్యలు వస్తాయట. గాలి సరిగ్గా అందక పోవడం.. ఛాతిలో నొప్పి ఉంటుందట.
- జీర్ణ సమస్యలు
మరికొందరు మహిళల్లో జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయట. పీరియడ్ సమయంలో కడుపు ఉబ్బరంగా మారడం, నొప్పి వంటి ఇబ్బందులు ఉంటాయట. మరికొందరికి కళ్లు తిరగడం, వాంతులు వంటివి హార్ట్ ఎటాక్ సమయంలో కలుగుతాయట.
- చలి చెమట్లు
మహిళల్లో వచ్చే చలి చెమట్లు కూడా గుండె పోటు లక్షణాల్లో భాగమేనట. చర్మం బిగుతుగా మారడం కూడా దీనిలోని లక్షణమే అంటున్నారు.
- దవడల్లో నొప్పి..
దవడల్లో నొప్పిగా ఉంటుందట. సాధారణంగా పంటినొప్పి సమయంలో దవడ నొప్పి ఉంటుంది. కానీ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు దవడల్లో నొప్పి, మెడ, భుజం, వీపు, కడుపు, ఛాతీ వంటి భాగాల్లో మహిళలకు నొప్పి లేదా అసౌకర్యంగా ఉంటుందట.
- ఛాతీలో నొప్పి..
హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఛాతీలో నొప్పి అనేది మగవారికి, ఆడవారికి కూడా ఉంటుంది. అయితే మహిళలకు గుండె పిండేస్తున్నట్టు, గుండె ప్రెజర్ తీసుకుంటున్నట్లు, మంటగా ఉన్నట్లు తెలుస్తుందట.
ఈ లక్షణాల్లో ఏదో ఒకటి హార్ట్ఎటాక్కి ప్రధాన కారణం కావొచ్చు. అందుకే ఈ లక్షణాలు కనిపించినప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయవద్దంటున్నారు నిపుణులు. వీలైనంత త్వరగా వైద్య సేవలు తీసుకుంటే గుండె సమస్యలను, హార్ట్ ఎటాక్స్ని దూరం చేసుకోవచ్చు అంటున్నారు.
Also Read : గుండె జబ్బులు రాకుండా, హార్ట్‌ను హెల్తీగా ఉంచే సింపుల్ టిప్స్ ఇవే