News
News
వీడియోలు ఆటలు
X

Rosy Cheeks: యాపిల్ పండులాంటి ఎర్రటి బుగ్గలు కావాలా? అయితే ఇలా చేయండి

అమ్మాయిల అందం గురించి వర్ణించాలంటే దొండపండు లాంటి పెదవులు, యాపిల్ పండు లాంటి బుగ్గలు అని పొగిడేస్తారు. మీకు కూడా రోజీ బుగ్గలు కావాలని అనిపిస్తుందా?

FOLLOW US: 
Share:

సిగ్గులు మొగ్గలు వేసేది బుగ్గల్లోనే. బుగ్గలు ఎర్రగా ఉంటే చూడటానికి మొహం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. మీ బుగ్గలు గులాబీ రంగులో ఉన్నాయంటే రక్తనాళాలు విస్తరించినట్లు అర్థం. రక్తం చర్మం ఉపరితలం దగ్గరగా ప్రవహిస్తున్నట్టు సూచిస్తుంది. వ్యాయామం, ఉత్సాహంగా ఉన్నప్పుడు లేదా చల్లని వాతావరణానికి గురి కావడం వంటి కారణాల వల్ల సంభవిస్తుంది. రోజీ బుగ్గలు తాజా యవ్వన రూపానికి సంకేతం. ఎర్రటి యాపిల్ పండులా బుగ్గలు కనిపిస్తూ ఉంటే మీ అందం మరింత రెట్టింపు అవుతుంది. ఇవి ఆరోగ్యం, శక్తి, యవ్వనానికి సంకేతం. బుగ్గలు ఎర్రగా కనిపించడం కోసం చాలా మంది మేకప్ వేసుకుంటారు. కానీ సహజంగానే రోజీ బుగ్గలు పొందాలంటే ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేసి చూడండి.

వ్యాయామం: రెగ్యులర్ వ్యాయామం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందాన్ని కూడా ఇస్తుంది. శరీర ఆకృతిని మార్చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. శరీర పనితీరు మెరుగుపడుతుంది. ఇది సహజమైన బ్లష్ ని ఇస్తుంది.

మసాజ్: చేతి వేళ్ళతో బుగ్గలను సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బుగ్గలు ఎర్రగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి. ఎక్స్ ఫోలియేషన్ చేయడం వల్ల మృత కణాలు తొలగిపోతాయి.

ఫేషియల్ మాస్క్: రోజ్ వాటర్, తేనె, పెరుగు వంటి సహజ పదార్థాలతో తయారు చేసిన ఫేషియల్ మాస్క్ అప్లై చేయడం వల్ల చర్మానికి కావాల్సిన పోషణ అందుతుంది. ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మొత్తం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మొటిమలు, చర్మం మీద దద్దుర్లు వంటి చర్మ సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి.

హైడ్రేషన్: ఎంత బాగా నీళ్ళు తాగితే అంత అందంగా కనిపిస్తారు. డీహైడ్రేట్ అయితే చర్మం నిర్జీవంగా పేలవంగా కనిపిస్తుంది. పొడి బారిన చర్మం చికాకు కలిగిస్తుంది. అందుకే పుష్కలంగా నీరు తాగాలి. హైడ్రేట్ గా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.

స్ట్రీమింగ్: గోరు వెచ్చని నీటితో ముఖానికి ఆవిరి పట్టించడం వల్ల చర్మం మీద రంధ్రాలు తెరుచుకుంటాయి. రక్త ప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మీకు రోజీ బుగ్గలను ఇస్తుంది.

సన్ స్క్రీన్: సూర్యుడి హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడం వల్ల చర్మం దెబ్బతినకుండా నిరోధించవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచేందుకు దోహదపడుతుంది.

నిద్ర: తగినంత నిద్ర ఎప్పుడూ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కంటి నిండా నిద్రపోవడం వల్ల మొహం ప్రకాశవంతంగా ఉంటుంది. లేదంటే నిస్తేజంగా కనిపిస్తారు నిద్ర వల్ల వచ్చే అలసట మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఒక్కొక్కరి చర్మం ఒక్కో విధంగా ఉంటుంది. ప్రతిదీ అందరికీ సెట్ అవుతుందని చెప్పలేం. అందుకే హోమ్ ప్యాక్ వేసుకునే ముందు సరైన పదార్థాలను వారి స్కిన్ కి తగిన వాటిని ఎంచుకోవాలి. అప్పుడే చర్మం ఆరోగ్యకరమైన మెరుపుని సంతరించుకుంటుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: చక్కెర తినాలనే కోరికలకు ఇలా చెక్ చెప్పండి

Published at : 26 Apr 2023 06:00 AM (IST) Tags: Beauty tips Beauty Care Rosy Cheeks Rosy Cheeks Home Remedies

సంబంధిత కథనాలు

Pimples: మామిడి పండ్లు తినగానే మొటిమలు ఎందుకు వస్తాయో తెలుసా?

Pimples: మామిడి పండ్లు తినగానే మొటిమలు ఎందుకు వస్తాయో తెలుసా?

Lipstick: ఇంట్లోనే సులభంగా లిప్ స్టిక్ తయారు చేసుకోండిలా!

Lipstick: ఇంట్లోనే సులభంగా లిప్ స్టిక్ తయారు చేసుకోండిలా!

Hair Fall: జుట్టు రాలే సమస్యకి బై బై చెప్పాలంటే ఈ పవర్ ఫుల్ స్మూతీ తాగేయండి

Hair Fall: జుట్టు రాలే సమస్యకి బై బై చెప్పాలంటే ఈ పవర్ ఫుల్ స్మూతీ తాగేయండి

Hair Fall: ఒబేసిటీ వల్ల జుట్టు రాలిపోతుందా? దీన్ని అధిగమించడం ఎలా?

Hair Fall: ఒబేసిటీ వల్ల జుట్టు రాలిపోతుందా? దీన్ని అధిగమించడం ఎలా?

చర్మం ఎప్పుడూ జిడ్డుగా ఉంటోందా? కారణం ఇదే - ఈ జాగ్రత్తలు పాటించండి

చర్మం ఎప్పుడూ జిడ్డుగా ఉంటోందా? కారణం ఇదే - ఈ జాగ్రత్తలు పాటించండి

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్, కవచ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్

Odisha Train Accident:  ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్, కవచ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్