అన్వేషించండి

Banana on Empty Stomach : ఉదయాన్నే అరటిపండు తింటే మంచిదేనా? లాభాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఇవే

Morning Banana : మార్నింగ్ అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిదేనా? ఎలా తీసుకుంటే మంచిది? ఎవరు దీనిని తినకపోవడం మంచిది? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

Banana in the Morning : అరటిపండు ఆరోగ్యానికి మంచిదే. కానీ దానిని ఉదయాన్నే తినొచ్చా? లేదా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే కొందరు తినేస్తారు. కొందరు తినరు. మరికొందరు తినకూడదు అంటారు. మరి వీటిలో ఏది నిజం. ఉదయాన్నే అరటిపండు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎవరు దూరంగా ఉంటే మంచిది? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో చూసేద్దాం. 

ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏమి తినాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. అయితే సమయం కుదరక, టైమ్ అయిపోతుందని ఏది దొరికితే అది తినేస్తారు. అలాంటి వాటిలో బనానా కూడా ఒకటి. ఎందుకంటే దీనిని ఈజీగా తీసుకోవచ్చు. పైగా వెంటనే కడుపు నిండిన ఫీల్ వస్తుంది. మరి దీనివల్ల శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయంటే.. 

ఎనర్జీ కోసం.. 

అరటిపండులో సహజమైన చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రక్టోజ్) ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని ఉదయం తింటే శరీరానికి వెంటనే ఎనర్జీ లభిస్తుంది. రోజంతా యాక్టివ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. 

జీర్ణక్రియకై..

అరటిపండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది కొంతవరకు ఉపశమనాన్ని ఇస్తుంది. 

పొటాషియం

అరటిపండులో పొటాషియం ఎక్కువ. ఇది హార్ట్ హెల్త్‌కు మంచిదే కానీ.. ఖాళీ కడుపుతో తింటే కొందరిలో పొటాషియం లెవెల్స్ ఒక్కసారిగా పెరిగి అలసట, అసౌకర్యంగా అనిపించొచ్చు. బీపీ ఎక్కువగా ఉండేవారు కూడా తీసుకోకపోవడమే బెటర్.

గ్యాస్, ఎసిడిటీ సమస్యలు

సెన్సిటివిటీ ఉన్నవారు ఉదయాన్నే అరటిపండు తింటే గ్యాస్, ఉబ్బరం లేదా ఎసిడిటీ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

బరువు తగ్గాలనుకుంటే..

బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే అరటిపండు తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి అంతగా మంచిది కాదు. మధుమేహులు కూడా ఉదయాన్నే తినకపోవడమే మంచిదని చెప్తున్నారు నిపుణులు.

ఎలా తీసుకుంటే మంచిది?

రాత్రి ఫాస్టింగ్ తర్వాత మార్నింగ్ శరీరానికి కావాల్సిన పోషకాలు అందించాలి. అరటిపండు మంచిదే అయినా దానిని ఖాళీ కడుపుతో కాకుండా బ్రేక్​ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు. లేదా పాలు, ఓట్స్, నట్స్ లేదా పల్లీలతో కలిపి తింటే శరీరానికి బ్యాలెన్స్‌డ్ పోషకాలు అందుతాయి. 

కాబట్టి మీరు మీ డైట్​లో అరటిని చేర్చుకోవాలనుకుంటే.. ఏదైనా భోజనం తర్వాత తీసుకోవచ్చు. పైగా ఎక్కువ మోతాదులో తీసుకోకుండా రెగ్యులర్​గా తీసుకుంటే మీరు కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget