News
News
X

Triphala Powder: త్రిఫల చూర్ణం మోతాదుకు మించి తీసుకుంటున్నారా? అయితే, ఈ సమస్యలు తప్పవు

సర్వ రోగ నివారిణిగా పేరుగాంచిన త్రిఫల చూర్ణం వల్ల అనార్థాలు కూడా ఉన్నాయి.

FOLLOW US: 

పూర్వం ఆయుర్వేదం అంటే చాలా గొప్ప ప్రసిద్ధి గాంచింది. ఏ చిన్న జబ్బు వచ్చినా ఆయుర్వేద మందులు వేసుకుని తగ్గించకునే వాళ్ళు. అందులోనూ అన్ని రోగాలకు ఒకటే మందుగా త్రిఫల చూర్ణం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. శరీరంలోని ఎటువంటి రోగాన్నైనా నయం చెయ్యగల గొప్ప ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. అందుకే దీన్ని సర్వరోగ నివారిణి అంటారు. కానీ ఇంగ్లీషు మందులు వచ్చిన తర్వాత ఆయుర్వేదం ప్రత్యామ్నాయంగా మారింది. ఎవరో కొద్ది మంది మాత్రం ఆయుర్వేద విధానాలను పాటిస్తూ ఉంటున్నారు. అందులోనూ త్రిఫల చూర్ణం చాలా గొప్పదిగా భావిస్తారు.

త్రిఫల అంటే మూడు పండ్లతో తయారు చేసిన మూలికా పొడి ఇది. అమలాకి, బిభిటాకి, హరితకి అనే మూడు పండ్ల తయారు చేస్తారు. ఈ మూడింటికి ఎటువంటి వ్యాధిని అయినా నయం చేసే గుణం ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. విరోచనాలు తగ్గించేందుకు, అధిక రక్తపోటుని నయం చేస్తుంది. రక్తాన్ని శుద్ది చెయ్యడంలో కీలక పాత్ర వహిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, జీఉత్తు పెరిగేందుకు దోహదపడుతుంది. కళ్ళకి, గుండెకి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఇప్పటికీ చాలా మంది పెద్ద వాళ్ళు త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న దీని వల్ల ప్రమాదం కూడా ఉందండోయ్. ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యం అమితంగా తీసుకుంటే విషం అనేది దీనికి కూడా వర్తిస్తుంది. మోతాదుకి మించి ఈ చూర్ణాన్ని తీసుకోవడం వల్ల వచ్చే అనేక సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉన్నాయి.

అనార్థాలు ఇవే:

రక్తపోటు సాధారణం కంటే తగ్గిస్తుంది: త్రిఫల చూర్ణంలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. కానీ దీన్ని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటు సాధారణ స్థాయి కంటే తగ్గిస్తుంది. తక్కువ రక్తపోటు స్థాయిలు ఆరోగ్యానికి హానికం.

జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది: ఈ చూర్ణం అదిక మొత్తంలో తీసుకోవడం వల్ల అతిసారం, కడుపు నొప్పి, గ్యాస్ ఫామ్ వంటి అనేక సమస్యలు వస్తాయి. జీర్ణ క్రియకి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే ఈ చూర్ణాన్ని తీసుకోవడం మానెయ్యడం మంచిది.

గర్భిణులకు మంచిది కాదు: త్రిఫల చూర్ణంలో హర్తకి అనే పదార్థం ఉంటుంది. గర్భధారణ సమయంలో దీని తీసుకోవడం వల్ల కడుపులోని బిడ్డ, తల్లిపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే గర్భధారణ సమయంలో ఈ చూర్ణం తీసుకోవడం సురక్షితం కాదు.

మందులు పనిచెయ్యకుండా చేస్తుంది: ఇతర జబ్బులకి సంబంధించి మందులు వాడేటప్పుడు ఈ చూర్ణం శరీరంలోని ఎంజైమ్ లను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మందులు పనితీరు మందగిస్తుంది. అటువంటి సమయంలో దీన్ని తీసుకోకపోవడమే ఉత్తమం.  

Also Read: పిల్లలకి జలుబు చేసిందని నెబులైజర్ పెడుతున్నారా? అయితే జర జాగ్రత్త

Also read: అరటి పండ్లను రోజుకు ఎన్ని తింటే ఆరోగ్యమో తెలుసా?

Published at : 24 Aug 2022 05:16 PM (IST) Tags: Ayurveda ayurveda medicine Triphala powder Triphala Churnam Side Effects Triphala Powder Benefits

సంబంధిత కథనాలు

Thunderstorm: ఉరుములు, మెరుపుల టైంలో స్నానం చేయకూడదట, ఎందుకో తెలుసా?

Thunderstorm: ఉరుములు, మెరుపుల టైంలో స్నానం చేయకూడదట, ఎందుకో తెలుసా?

Sneezing: తుమ్మి తుమ్మి అలిసిపోయారా? ఇలా చేశారంటే చిటికెలో తుమ్ములు ఆగిపోతాయ్

Sneezing: తుమ్మి తుమ్మి అలిసిపోయారా? ఇలా చేశారంటే చిటికెలో తుమ్ములు ఆగిపోతాయ్

Diabetes: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే

Diabetes: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే

Covidfitbit: ఈ స్మార్ట్ వాచ్ చాలా స్పెషల్ - కోవిడ్ ను కూడా గుర్తించగలదు!

Covidfitbit: ఈ స్మార్ట్ వాచ్ చాలా స్పెషల్ - కోవిడ్ ను కూడా గుర్తించగలదు!

Viagra: వయాగ్రా అందుకే కాదు - ఈ భయానక వ్యాధిని సైతం నయం చేస్తుందట!

Viagra: వయాగ్రా అందుకే కాదు - ఈ భయానక వ్యాధిని సైతం నయం చేస్తుందట!

టాప్ స్టోరీస్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు