అన్వేషించండి

Thyroid Diet : థైరాయిడ్ ఉన్నవారు తినకూడని ఫుడ్స్ లిస్ట్.. వీటిని తింటే మందులు కూడా పనిచేయవట

Thyroid Diet Telugu : డైట్​లో కొన్ని మార్పులు చేయకపోతే థైరాయిడ్ కంట్రోల్ అవ్వదని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? నిపుణులు ఇచ్చే సూచనలు ఏంటో తెలుసుకుందాం. 

Thyroid Diet Foods to Avoid : థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారు వైద్యులు సూచించే మందులు రెగ్యులర్​గా వేసుకోవాలి. అంతేకాకుండా వాటితో పాటు కొన్ని ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. డైట్​లో ఈ మార్పులు చేయకుంటే మీరు మందులు వాడినా పెద్ద ఫలితం ఉండదని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి? వాటిని తీసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సోయా 


Thyroid Diet : థైరాయిడ్ ఉన్నవారు తినకూడని ఫుడ్స్ లిస్ట్.. వీటిని తింటే మందులు కూడా పనిచేయవట

థైరాయిడ్ ఉన్నవారు సోయా ప్రొడెక్ట్స్ తినకూడదట. ఎందుకంటే సోయాలో ఐసోఫ్లేవోన్​లు ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్​ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ ప్రకారం.. "అధిక సోయా లెవోథైరాక్సిన్ (థైరాయిడ్ హార్మోన్ భర్తీ) ప్రభావాన్ని అడ్డుకుంటుందని" తెలిపింది. మీరు థైరాయిడ్ మందులు తీసుకుంటుంటే వీటిని పూర్తి అవాయిడ్ చేయాలి అంటున్నారు నిపుణులు. 

బ్రకోలి 


Thyroid Diet : థైరాయిడ్ ఉన్నవారు తినకూడని ఫుడ్స్ లిస్ట్.. వీటిని తింటే మందులు కూడా పనిచేయవట

క్రూసిఫెరస్ జాతికి చెందిన క్యాబేజి, కాలీఫ్లవర్, బ్రకోలీ, కాలే వంటివాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా పచ్చివి అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలో అయోడిన్ తీసుకోవడం నిరోధించే గైట్రోజెన్​లు ఉంటాయి. అయోడిన్ లోపం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఉడికించి తీసుకుంటే గైట్రోజెనిక్ ప్రభావం తగ్గుతుందట. 

గ్లూటెన్


Thyroid Diet : థైరాయిడ్ ఉన్నవారు తినకూడని ఫుడ్స్ లిస్ట్.. వీటిని తింటే మందులు కూడా పనిచేయవట

గ్లూటెన్​కు చెందిన గోధుమ, బార్లీ వంటివాటికి దూరంగా ఉండాలని చెప్తున్నారు. జర్నల్ ఆఫ్ థైరాయిడ్ రీసెర్చ్​లోని ఓ అధ్యయనం ప్రకారం.. "గ్లూటెన్ లేని ఆహారాలు కొంతమందిలో ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ రోగులలో మంచి ఫలితాలు ఇచ్చినట్లు" తేలింది. కాబట్టి గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్ తీసుకుంటే మంచిది. 

ప్రాసెస్డ్ ఫుడ్స్


Thyroid Diet : థైరాయిడ్ ఉన్నవారు తినకూడని ఫుడ్స్ లిస్ట్.. వీటిని తింటే మందులు కూడా పనిచేయవట

ప్రాసెస్ చేసిన ఫుడ్స్​లో సోడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హైపోథైరాయిడిజంతో ఇబ్బంది పడేవారు వీటికి కచ్చితంగా దూరంగా ఉండాలి. లేదంటే బీపీ సమస్య పెరుగుతుంది. ఎక్కువ సాల్ట్ పరిస్థితిని ఇంకా విషమం చేస్తుంది. అందుకే చాలామంది ఎండోక్రినాలజిస్ట్​లు సోడియం తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తారు. 

స్వీట్స్


Thyroid Diet : థైరాయిడ్ ఉన్నవారు తినకూడని ఫుడ్స్ లిస్ట్.. వీటిని తింటే మందులు కూడా పనిచేయవట

థైరాయిడ్​ మెటబాలీజంను తగ్గించేస్తుంది. కాబట్టి స్వీట్​ను ప్రాసెస్ చేయడం చాలా కష్టమవుతుంది. దీనివల్ల ఈజీగా బరువు పెరిగిపోతారు. కాబట్టి వీలైనంత వరకు షుగర్స్ అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు. 

ఫ్యాటీ ఫుడ్స్ 


Thyroid Diet : థైరాయిడ్ ఉన్నవారు తినకూడని ఫుడ్స్ లిస్ట్.. వీటిని తింటే మందులు కూడా పనిచేయవట

థైరాయిడ్ మందులు ప్రభావాన్ని ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించేస్తాయి. శరీర సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను మరింత పెంచుతాయి. ఇప్పటికే హైపోథైరాయిడిజంతో ఉంటే కొలెస్ట్రాల్ స్థాయిలు మరింత ప్రమాదకరంగా మారతాయి. 

కెఫిన్ 


Thyroid Diet : థైరాయిడ్ ఉన్నవారు తినకూడని ఫుడ్స్ లిస్ట్.. వీటిని తింటే మందులు కూడా పనిచేయవట

కెఫిన్ కూడా థైరాయిడ్ మెడికేషన్​ని అబ్జార్వ్ కానివ్వకుండా అడ్డుకుంటుంది. అందుకే వైద్యులు మెడిసన్స్ వేసుకున్న 30 నుంచి 60 నిమిషాల వరకు కెఫిన్ తీసుకోవద్దని చెప్తారు. 

ఇవే కాకుండా టోఫు, పల్లీలు కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలని చెప్తున్నారు. వైద్యుల సూచనలు కచ్చితంగా ఫాలో అవుతూ.. ఫుడ్​లో ఈ మార్పులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget