అన్వేషించండి

Arunachalam Trip : అరుణాచలం బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచి తక్కువ ఖర్చులో వెళ్లాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్, పూర్తి డిటైల్స్ ఇవే

Arunachalam on Budget : పరమ శివుని పరిపూర్ణమైన అనుగ్రహమున్న అరుణాచలం క్షేత్రానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే వైజాగ్, హైదరాబాద్ నుంచి ఎలా బడ్జెట్​లో వెళ్లాలో ఇప్పుడు చూసేద్దాం. 

Arunachalam (Tiruvannamalai) Budget Friendly Trip : శివుని అనుగ్రహం పొందాలనుకునేవారు కచ్చితంగా అరుణాచలం క్షేత్రానికి వెళ్లాలనుకుంటారు. అరుణాచలం ప్రవేశాన్ని కచ్చితంగా నిర్వార్తించాల్సిన పనుల్లో ఒకటిగా భావిస్తారు. అయితే మీరు కూడా వారిలో ఒకరా? అయితే మీరు వైజాగ్ నుంచి అరుణాచలం బడ్జెట్​లో ఎలా వెళ్లొచ్చో.. హైదరాబాద్​ నుంచి అయితే తక్కువ ఖర్చుతో ఎలా వెళ్లొచ్చో.. బడ్జెట్ ఫ్రెండ్లీ అరుణాచలం ట్రిప్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

అరుణాచలం అన్నా.. తిరువన్నమలై అన్నా ఒకటే. ఈ విషయంలో చాలామంది కన్​ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి అరుణాచలం వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. 

వైజాగ్ నుంచి అరుణాచలం వెళ్తే.. (Vizag to Arunachalam)

వైజాగ్ నుంచి కట్​పాడి జంక్షన్​ (Katpadi Junction)కు ట్రైన్ టికెట్ రూ. 500 ఉంటుంది. స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ జర్నీకి 16 గంటలు సమయం పడుతుంది. ఈ రైల్వే స్టేషన్​ నుంచి ముందుకు వెళ్తే బస్​ స్టాప్ ఉంటుంది. అక్కడ మీరు వెళ్లూరు న్యూ బస్​ స్టాండ్​కి వెళ్లాలి. ఆ బస్ టికెట్ ధర రూ. 10 నుంచి రూ. 20 మధ్యలో ఉంటుంది. వేళ్లూరు నుంచి అరుణాచలంకి బస్ టికెట్ తీసుకోవాలి. దీని ధర రూ.70 నుంచి రూ.150 ఉంటుంది. మీరు తీసుకునే బస్​ని బట్టి ఈ ధర మారుతుంది. జర్నీ టైమ్ రెండున్నర గంటలు ఉంటుంది. అరుణాచలం బస్​ స్టాప్​ నుంచి నేరుగా నడిచి వెళ్తే టెంపుల్ వస్తుంది. నడవలేను అనుకునేవాళ్లు ఆటోకి వెళ్లొచ్చు. దీని ధర రూ.30 నుంచి రూ.100 ఉంటుంది. 

హైదరాబాద్ టూ అరుణాచలం (Hyderabad to Arunachalam)

హైదరాబాద్ నుంచి తిరువన్నమలై.. ప్రతి శుక్రవారం స్పెషల్ ట్రైన్ ఉంటుంది. వీకెండ్​లో అరుణాచలం ప్లాన్ చేసుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. స్లీపర్ క్లాస్ టికెట్ రూ.450. రిటర్న్ అవ్వాలనుకుంటే ఆదివారం ట్రైన్ ఉంటుంది.

స్టేయింగ్ అండ్ ఫుడ్

అరుణాచలంలో స్టేయింగ్​కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ వాటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ స్టే చేయాలనుకునేది కాస్త ఆలోచించుకోవాలి. సోలో ట్రావెల్ చేసేవారికి లేదా గ్రూప్​గా ట్రావెల్ చేసేవారికి.. తక్కువలో స్టే చేయాలనుకుంటే.. రాజగోపురం నుంచి.. మూడు వందల మీటర్లు ముందుకు వస్తే అరుణాచలం సేవామదం ఉంటుంది. దీని ధర రూ. 100. వీళ్లు మీకు ఓ లాకర్ ఇస్తారు. అక్కడ ఫ్రెష్ అయిపోవచ్చు కూడా. అరుణాచలంలో మంచి ఫుడ్ దొరుకుతుంది. ఫుడ్ ధర రూ. 100 నుంచి రూ.160 ఉంటుంది. అచ్చమైన తెలుగు భోజనాన్ని తినవచ్చు. 

దర్శనం & గిరి ప్రదిక్షణ

స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదిక్షణ చేయవచ్చు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 9.30 వరకు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అనంతరం గిరిప్రదిక్షణ చేయవచ్చు. దీనికి నడిచే సామర్థ్యం బట్టి సమయం పడుతుంది. కొందరికి 4 నుంచి 6 గంటలు సమయం పడుతుంది. మరికొందరు 3 గంటల్లో కూడా కంప్లీట్ చేస్తారు. కాబట్టి మీ వాకింగ్ సామర్థ్యాన్ని, టైమ్​ని దృష్టిలో ఉంచుకుని గిరి ప్రదిక్షణ చేయవచ్చు. నడవలేను అనుకునేవారు ఆటోకి వెళ్లొచ్చు. వాళ్లు 9 టెంపుల్స్​ దగ్గరకి మిమ్మల్ని తీసుకువెళ్తారు. 

మీరు హైదరాబాద్ నుంచి వెళ్లినా.. వైజాగ్ నుంచి అరుణాచలం వెళ్లినా.. ఎలా వెళ్లారో అలాగే రిటర్న్ అయిపోవచ్చు. బస్, ఆటో, రైల్ ఇలా మీరు వెళ్లిన రూట్​లోనే రిటర్న్ అయిపోవచ్చు. మరి మీరు కూడా అరుణాచలం క్షేత్రాన్ని సందర్శించాలనుకుంటే.. ఈ బడ్జెట్​ని, టైమ్​ని సెట్ చేసుకుని వెళ్లిపోండి. 

Also Read : హైదరాబాద్ టూ ఈషా ఫౌండేషన్​ రౌండ్ ట్రిప్ డిటైల్స్.. బడ్జెట్ కేవలం రూ.3,500 మాత్రమే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Viral News: రైతుల ఐడియా అదుర్స్.. చలి తట్టుకోవడానికి ఆలుగడ్డ పంటలకు మద్యం పిచికారీ
రైతుల ఐడియా అదుర్స్.. చలి తట్టుకోవడానికి ఆలుగడ్డ పంటలకు మద్యం పిచికారీ
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Embed widget