అన్వేషించండి

Loneliness: ఒంటరితనంతో బాధ పడుతున్నారా? ఇలా బయటపడండి!

Loneliness: మీతో మీరు స్నేహం చేయానంత వరకు మీ విలువ మీకు తెలియదు. ఒక్క సారి స్నేహం చూసి చూడండి.. గొప్ప మిత్రుడిని పొందుతారు.

మన  చుట్టూ ఎవరైనా ఉంటేనే మనకీ కూడా మంచిగా అనిపిస్తుంది. ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటే ఏదో కోల్పోయామనే ఫీలింగ్ లోనే వెళ్తాం. కనీసం పదిమంది మనుషులుంటేనే మనం సంతోషంగా ఉంటాం. లేదంటే ఒంటరిగా కూర్చొని బాధపడతాం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఒంటరిగా ఉండటానికి, ఒంటరితనానికి చాలా తేడా ఉంది. ఏకాంతంలో ఒక్కరు ఉన్నపుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఒంటరితనంలో ఒక్కరే ఉంటే, మిమ్మల్ని చాలా బాధిస్తుంది. మీ ముందు జరిగేవి నచ్చనప్పుడు, మీ స్నేహితులు మిమ్మల్ని మోసం చేసినప్పుడు, మీ ఇంట్లో వాళ్లు తిట్టినప్పుడు మాట్లాడలేకపోవడం, జీవనశైలి మార్పులు, మనస్పర్థలు.. ఇలాంటి  కారణాల వల్ల ఒంటరిగా ఉన్నామనే ఫీల్ అవుతుంటారు. దీని కోసం మీరు సొంత ఆలోచనలతోనే ఈ నెగటివ్ ఫీలింగ్ నుంచి బయటపడవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.. 

ప్రతికూల ఆలోచనలు: మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీకు ప్రతికూల ఆలోచనలు మొదలవుతాయి. వాటిని గుర్తించి, ఏది నిజమో కనుగొని, ఈ ఆలోచనలకు బై చెప్పండి. ప్రతి సమస్య గురించి డీప్ గా ఆలోచించకండి. మన అంచనాలు వాస్తవికతకు చాలా దూరంగా లేవని కూడా నిర్ధారించుకోవాలి.

సెల్ఫ్ లవ్: మీ చుట్టూ వందల మంది వ్యక్తులు ఉన్నప్పటికీ, మీరు కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ సమయంలో, మరొకరి గురించి ఆలోచించడం మానేయండి. కొంత సమయం మీ కోసం కేటాయించండి. ఎవరో మిమ్మల్ని ప్రేమించడం లేదనే ఆలోచనను వదిలేయండి. ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడంపైన మాత్రమే దృష్టి పెట్టాలి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్లండి. 

కృతజ్ఞత: ఒక రోజులో మనం మంచి, చెడు చూస్తాం. కాలం ఎవరి కోసం ఆగదు. ప్రతిదీ సరైన స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రమే రోజు గడిచిపోతుంది. రోజులో ఒక్క సారైనా మీకు మీరు థాంక్స్ చెప్పుకోండి. ఇలా చేయడం వలన  మీరు మీ పట్ల మరింత కృతజ్ఞతతో ఉంటారు.

సన్నిహితంగా ఉండండి: మీరు ఇప్పటికే మాట్లాడిన వ్యక్తులతో మళ్లీ కనెక్ట్ అవ్వండి. ఇలా చేయడం వలన ఒంటరి ఆలోచనల నుంచి సులభంగా బయటపడతారు. కాబట్టి, దయచేసి వారితో మాట్లాడండి. వీలైతే, వాళ్లతో కలిసి బయటకు వెళ్లండి. ఇది మీకు మాత్రమే కాకుండా వారికి కూడా సహాయపడుతుంది. 

సామాజిక కార్యకలాపాలు: క్లబ్‌లు, కోర్సులు, సమూహాలలో చేరండి. మీరు మీ అభిరుచులు, ఆటల ప్రకారం ఎంచుకోవచ్చు. అప్పుడప్పుడైనా  కొత్త పనులను చేస్తూ ఉండాలి..దీని వలన  కొత్త సంబంధాలు పెరుగుతాయి. 

సపోర్ట్ : చాలా మంది స్నేహం కోసం ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్దపడతారు. సహాయం కోసం మీ స్నేహితులు మిమ్మల్ని అడిగినప్పుడు సాయం చేస్తూ ఉండండి. ఇలా చేయడం వలన ప్రశాంతత దొరుకుతుంది. ఇలా జనాలకి సపోర్ట్ చేస్తూ ఉన్నవారు ఒంటరిగా ఉన్నామని అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే  ఆన్‌లైన్ కమ్యూనిటీలు, హెల్ప్‌లైన్‌లు కూడా అద్భుతమైన సహాయాన్ని అందిస్తాయి.

ఇష్టమైన పనులు: మీకు నచ్చిన పనులు  చేయండి, ఎప్పుడు చేసిన పనులు చేయకండి. షాపింగ్, ఇష్టమైన ఆహారం తినడం, వండటం.. ఇలా మీకిష్టమైన పనిచేస్తే చాలావరకు బాధ తగ్గుతుంది.

Also Read : బరువు తగ్గాలనుకుంటే పాలు తాగండి.. కానీ ఇవి ఫాలో అవ్వండి

టాప్ హెడ్ లైన్స్

Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget