By: Haritha | Updated at : 19 Jul 2022 08:57 AM (IST)
(Image credit: Pixabay)
ఇల్లంటే భార్యాభర్తలు, పిల్లలతో కూడిన పొదరిల్లు. ఇంట్లో భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటే ఆ ఇల్లు అంత ప్రశాంతంగా, సౌభాగ్యంతో వెల్లివిరుస్తుంది. తల్లిదండ్రులు గొడవపడుతుంటే పిల్లలు కూడా మానసిక ఆందోళనకు గురవుతారు. కుటుంబ సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో వాస్తు పరంగా చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు. వాస్తు శాస్త్రపరంగా కుటుంబాన్ని సౌఖ్యంగా ఉంచేందుకు ఈ రెమెడిటీలు పనికొస్తాయి. ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవచ్చు. వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్ల కోసమే ఇది. భారతదేశంలో వాస్తు శాస్త్రాన్ని నమ్మే వాళ్లు అధికం.
చేయాల్సినవి ఇవే...
1. ఇంట్లో సంబంధ బాంధవ్యాలు బలహీనపడుతున్నట్టు అనిపించినా, నిత్యం గొడవలు అవుతున్నా తెల్ల చందనంతో చేసిన ఒక చెక్క విగ్రహాన్ని తెచ్చి పెట్టండి. ఇది చాలా శక్తివంతమైనది. గొడవలను తగ్గిస్తుంది. ప్రేమను పెంచుతుంది. కుటుంబసభ్యుల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
2. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ఇంట్లో ఉన్న అన్ని ప్రతికూలతలను తొలగిస్తుందని నమ్ముతారు. గదిలోని ఒక మూలలో రాళ్ల ఉప్పు లేదా కళ్లుప్పుని వేసి నెల రోజుల పాటూ వదిలేయండి. ఒక నెల తరువాత దాన్ని తీసి కొత్త ఉప్పును వేయండి. ఇలా తరచూ చేస్తుంటే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ కలహాలు తగ్గుతాయి.
3. భోజనం చేసేటప్పుడు కుటుంబ సభ్యులంతా ఒకేసారి తినేందుకు ప్రయత్నించండి. వీలైతే వంటగదిలో తినేందుకు ప్రయత్నించండి. వంటగది పెద్దగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఇల వంటగదిలో అందరూ కలిసి భోజనం చేయడం వల్ల రాహువు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి.
4. బుద్ధ భగవానుడు శాంతి, సామరస్యాన్ని సూచిస్తాడు. కాబట్టే ఎక్కువ మంది ఇళ్లల్లో ఇతని విగ్రహం కనిపిస్తుంది. ఈ గదిలో లేదా బాల్కనీలో బుద్ధుని విగ్రహం ఉంచితే చాలా మంచిది. ఇల్లు శాంతంగా ఉంటుంది.
5. కుటుంబంలో అధికంగా గొడవలు జరుగుతున్నప్పుడు ఎరుపు రంగు దుస్తులు వేసుకోవడం మానివేయాలి. ముఖ్యంగా కుటుంబంలో ఉన్న మహిళల మధ్య కలహాలు వచ్చినప్పుడు వారు ఎరుపు రంగు వస్త్రాలను ఒకే సమయంలో ధరించకూడదు.
6. కుటుంబంలోని మగవారి మధ్య విభేదాలు ఉంటే ఇంట్లో కదంబ చెట్టు కొమ్మను ఉంచాలి. ఇది ఇంట్లో శాంతిని నెలకొనేలా చేస్తుంది. విబేధాలు తగ్గిస్తుంది.
Also read: వాకింగ్ ఉదయానే చేయాలా? సాయంత్రం చేస్తే మంచి ఫలితాలు రావా?
Kidney Problems: ‘క్రియాటినిన్’ అంటే ఏమిటీ? మాంసాహారం తింటే కిడ్నీలు పాడవుతాయా? ఎవరికి ఎక్కువ ప్రమాదం?
Earplugs Side Effects : ఇయర్‌ఫ్లగ్స్ పెట్టుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు నరకం చూపిస్తాయి
World Aids Day: HIV కి వ్యాక్సిన్ ఎందుకు కనుక్కోలేకపోయారు? సైంటిస్ట్లకు ఎదురవుతున్న సవాళ్లేంటి?
Screen Effect on Children : మీ పిల్లలు టీవీ, ఫోన్లకు అలవాటు పడిపోతున్నారా? అది చాలా ప్రమాదం, ఇలా చేస్తే మేలు
World AIDS Day 2023 : పులిరాజా ఇప్పుడు సురక్షితమేనా? ఎయిడ్స్‌ను ఎలా గుర్తించాలి? నివారణ మార్గాలేమిటీ?
Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు - ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?
KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ భరోసా
Salaar - Ugramm: 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ - ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా?
Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!
/body>