By: ABP Desam | Updated at : 21 Mar 2022 12:25 PM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
పూర్వకాలంలో బొడ్డు చుట్టూ ఆయిల్ మసాజ్ చేసే అలవాటు ఉండేది. అలాగే బొడ్డులో ఓ చుక్క ఆయిల్ వేసుకునేవారు. దీని వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని వారి నమ్మకం. కాలక్రమేణా ఆ ఆచారం, అలవాటు పోయింది. నిజానికి ఆ బొడ్డుపై అప్పుడప్పుడు నూనెతో మసాజ్ చేసుకున్నా, ఓ చుక్క నూనె రోజూ వేసినా ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి.
పొట్ట నొప్పి తగ్గుతుంది
బొడ్డు చుట్టూ నూనె రాయడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలైన అజీర్ణం, విరేచనాలు, కడుపునొప్పి, ఉబ్బరం, వికారం వంటివి తగ్గుతాయి. ఎసెసెన్షియల్ నూనెలతో పాటూ అల్లంతో చేసిన నూనెను రోజూ పూయడం వల్ల చాలా మేలు కలుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది.
మురికిని తొలగిస్తుంది
గ్రేప్ సీడ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ లేదా జోజోబా నూనెలను నాభిలో ఓ చుక్క వేస్తే దాన్ని సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. శరీరంలో నాభి కీలక పాత్ర పోషిస్తుంది. ఆ భాగంలో నూనె వేయడం వల్ల, మసాజ్ చేయడం వల్ల మిగతా శరీరభాగాలు కాస్త చురుకుగా పనిచేస్తాయి.
సంతానోత్పత్తిని పెంచుతుంది
బొడ్డు తాడు ద్వారానే తల్లీ బిడ్డలు ఒకరికొకరు అనుసంధానమై ఉంటారు. అందుకే సంతానోత్పత్తిలో బొడ్డు చాలా ముఖ్యమైనది.బొడ్డుకు తరచూ కొబ్బరి నూనె రాయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇది సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు సహకరిస్తుంది. గర్భాశయం, అండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆర్గానిక్ ఆలివ్ నూనెతో నాభిపై మసాజ్ చేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు తరచూ బొడ్డులో ఒక చుక్క నూనె వేయడం, మసాజ్ చేసుకోవడం వంటివి చేయాలి.
ఇన్ఫెక్షన్ తగ్గుతుంది
నాభిలోపల తడిగా ఉండకూడదు, పొడిగా ఉండాలి. తడిగా ఉంటే అక్కడ రకరకాల బ్యాక్టిరియాలు, వైరస్‌లు చేరుతాయి. బొడ్డు పొడిగా ఉండి, బ్యాక్టిరియా చేరకూడదంటే తరచూ నూనె రాస్తూ ఉండాలి.కొబ్బరి నూనె, ఆవనూనెలో యాంటీ బాక్టిరియల్ లక్షణాలు ఎక్కువ. టీ ట్రీ ఆయిల్ కూడా సమర్థంగా పనిచేస్తుంది. ఈ నూనెలు అంటువ్యాధులను అడ్డుకుంటాయి. ఈ నూనెలను బొడ్డుకు రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఆ నొప్పిని తగ్గిస్తుంది
రుతుక్రమం సమయంలో చాలా మంది మహిళలను పొట్టనొప్పి వేధిస్తుంది. తరచూ బొడ్డు చుట్టూ ఆముదం నూనెను రాయడం, లేదా ఒక చుక్క వేయడం వల్ల ఆ నొప్పి తగ్గుతుంది. అంతేకాదు ఎండోమెట్రియోసిస్ లక్షణానలు కూడా తగ్గిస్తుంది.
కీళ్ల నొప్పులకు చెక్
కీళ్లు, కాళ్లపై నూనెతో మర్ధనా చేయడం వల్ల కీళ్లనొప్పులు, ఆస్టియోపోరొసిస్ వంటి వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఆముదం లేదా అల్లం నూనెను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కీళ్లలో లూబ్రికేషన్ బాగా జరిగి నొప్పి తగ్గుతుంది.
Also read: ప్రపంచంలో పరమ బోరింగ్ ఉద్యోగాలు ఇవే, పరిశోధనలో తేల్చిచెప్పిన సైకాలజిస్టులు
Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్
Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!
Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!
Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!
Regional Parties Income : అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు విరాళాల వెల్లువ - డీఎంకే, వైఎస్ఆర్సీపీకే సగం !
Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని
NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల
IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?