News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Almonds Vs Peanut: బాదం Vs వేరుశెనగ: ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఎంపిక

రోగాల దాడి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం మీద దృష్టి కాస్త ఎక్కువగానే చూపిస్తున్నారు. అందుకే ఆరోగ్యాన్ని ఇచ్చే నట్స్ ఎంచుకుంటున్నారు.

FOLLOW US: 
Share:

డ్రైఫ్రూట్స్ సమతుల్య ఆహారంలో అద్భుతమైన ఒక భాగం. పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు సమృద్ధిగా అందిస్తాయి. అనేక రాక గింజల్లో వేరుశెనగ, బాదం రెండూ మంచి ఎంపికలు. ఇవి రెండు రుచికరమైనవే. అయితే పోషకాల విషయానికి వస్తే మాత్రం ఏది శక్తివంతమైంది? ఏది ఆరోగ్యరకమైనది?

వేరుశెనగ

వేరుశెనగ సాంకేతికంగా చిక్కుళ్ళు. నిజమైన గింజలు కాదు. కానీ పోషకాల పరంగా వాటిని గింజల కింద పరిగణిస్తారు. వేరుశెనగలో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. శాఖాహారులకి అద్భుతమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలం. మానవ ఆరోగ్యానికి అవసరమైన మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలని కలిగి ఉంటాయి.

వేరుశెనగలో మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు ఉన్నాయి. ముఖ్యంగా ఒలేయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియని ప్రోత్సహిస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచుతుంది.

నియాసిన్(విటమిన్ బి30, ఫోలేట్( విటమిన్ బి9) విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి.

బాదం పప్పు

బాదం పప్పు పోషకాల పవర్ హౌస్ అనే విషయం అందరికీ తెలిసిందే. విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఆక్సీకరణ నష్టం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇందులోని మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. కాల్షియం అద్భుతమైన మూలం. ఎముకలు, దంతాలు బలంగా మారేందుకు ఉపయోగపడతాయి.

బాదంపప్పులో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి వివిధ ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలని కలిగి ఉన్నాయి.

ఫైనల్ గా..

వేరుశెనగ, బాదం రెండూ పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలని సమానంగా అందిస్తాయి. వీటిలో ఏది బెస్ట్ అంటే చెప్పడం కాస్త కష్టమే. బాదం పప్పులు విటమిన్ ఇ, కాల్షియం ఇవ్వడంలో మెరుగ్గా ఉంటే వేరుశెనగ ప్రోటీన్, గుండెకి ఆరోగ్యకరమైన కొవ్వులనని ఇస్తూ ప్రత్యేకంగా నిలుస్తుంది. అందుకే ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఎంపిక అంటే వాటి పోషక అవసరాలు, రుచిని బట్టి ప్రాధాన్యతగా ఎంచుకోవచ్చు. సమతుల్యమైన పోషక విలువలని ఇవ్వడంలో రెండూ రారాజుగా నిలుస్తాయి.

అందుకే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు వీటిని రోజూ కొద్దిగా తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. రోజుకొక పల్లీ ముక్క తింటే ఎముకలు గట్టి పడతాయి. అలాగే నాలుగు లేదా ఐదు బాదం పప్పులు నానబెట్టుకుని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: ఈ ఆహారపు అలవాట్లు ఉండే గుండె జబ్బుల వచ్చే అవకాశమే ఉండదు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 20 Jul 2023 08:04 AM (IST) Tags: Almonds Peanuts Benefits of almonds Peanut Benefits Almond Vs Peanut

ఇవి కూడా చూడండి

ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు, జాగ్రత్త

ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు, జాగ్రత్త

Green Banana: పచ్చి అరటి పండు తినడం వల్ల ఈ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చా?

Green Banana: పచ్చి అరటి పండు తినడం వల్ల ఈ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చా?

Brain: మీ మెదడు త్వరగా ముసలవ్వకూడదనుకుంటే ప్రతిరోజూ వీటిని తినండి

Brain: మీ మెదడు త్వరగా ముసలవ్వకూడదనుకుంటే ప్రతిరోజూ వీటిని తినండి

Mehendi: మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?

Mehendi: మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?

World Heart Day 2023: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!

World Heart Day 2023: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!

టాప్ స్టోరీస్

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!