Cardiovascular Disease: ఈ ఆహారపు అలవాట్లు ఉండే గుండె జబ్బుల వచ్చే అవకాశమే ఉండదు
ప్రస్తుత రోజుల్లో గుండె పోటు వల్ల ఎక్కువ మంది మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే గుండె ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద పెట్టాలి.
అనారోగ్యకరమైన ఆహారం ఎప్పుడూ సమస్యలే తీసుకొస్తుంది. ఇదే విషయాన్ని హామిల్టన్ హెల్త్ సైన్సెస్, మెక్ మాస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు, పాపులేషన్ రీసెర్చ్ హెల్త్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన తాజా అధ్యయనం మరోసారి స్పష్టం చేస్తుంది. ఆరు ముఖ్యమైన పోషకాలని తగినంతగా తీసుకొని వ్యక్తులు హృదయ సంబంధ వ్యాధులు(CVD) అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేల్చారు.
అధ్యయనం ఏం చెబుతోంది?
మొత్తం కొవ్వు పాల ఉత్పత్తులు, సీ ఫుడ్, చిక్కుళ్ళు, గింజలు, పండ్లు, కూరగాయలని తీసుకోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ లతో సహా కార్డియో వాస్కులర్ డీసీజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 2019 లో దాదాపూ 18 మిలియన్ల మంది ప్రజలు CVDతో మరణించారు. ఇది మొత్తం ప్రపంచ మరణాలలో 32 శాతం. వీరిలో 85 శాతం మరణాలు గుండెపోటు, పక్షవాతం కారణంగా సంభవించాయి. దాదాపు 80 దేశాలలోని 2,45,000 మంది వ్యక్తుల డేటాను పరిశోధకులు విశ్లేషించారు.
ఏం తినాలి, ఎంత మొత్తంలో తినాలి?
మితమైన మొత్తంలో చేపలు, కొవ్వు పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల CVD మరణాల ప్రమాదం నుంచి బయట పడొచ్చని అధ్యయనం వెళ్లడిస్తోంది. ధాన్యాలు, మాంసం మితంగా తీసుకున్నా కూడా ఇదే రకమైన ఆరోగ్య ఫలితాలు పొందుతారు. శుద్ది చేయని తృణధాన్యాలు, ప్రాసెస్ చేయని మాంసాలు తీసుకోవాలి. అలాగే రెండు లేదా మూడు సేర్విన్గ్స్ పండ్లు తినాలి. అలాగే రెండు నుంచి మూడు సేర్విన్గ్స్ కూరగాయలు, గింజలు, పాడి ఉత్పత్తులు తీసుకోవాలి. ఇవే కాకుండా మూడు నుంచి నాలుగు సేర్విన్గ్స్ పప్పు ధాన్యాలు, చేపలు తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
మనిషి ఆరోగ్యంగా ఉండటంలో గుండె కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే దాన్ని ఆరోగ్యంగా ఉంచగలిగితే చాలు మరికొన్ని సంవత్సరాలు అదనంగా ఆయుష్హుని పెంచుకోవచ్చు. గుండెకి హాని చేసే ఆహారాలు కాకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలు డైట్లో భాగంగా చేసుకోవాలి. అధిక నూనె ఉండే పదార్థాలు, జంక్ ఫుడ్, అతిగా మాంసం తినడం వంటివి గుండె ఆరోగ్యాన్ని బలహీనపరుస్తాయి. గుండె చుట్టు కొవ్వు పేరుకుపోయి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వల్ల హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటిలో కార్డియో వాస్కులర్ డీసీజ్ ఒకటి. ఈ డీసీజ్ లో శ్వాస ఆడకపోవడం, గుండె అంతా పట్టేసినట్టుగా అనిపించడం, వికారం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక కుటుంబంలో ఎవరికైనా హృదయ సంబంధ వ్యాధుల చరిత్ర కలిగి ఉంటే మిగతా వాళ్ళ ఆరోగ్యం కూడా ప్రమాదంలో ఉన్నట్టే. అందుకే గుండెని పదిలంగా చూసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఎయిర్ ఫ్రైయర్ లో వీటిని వండకూడదు, డేంజర్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial