అన్వేషించండి

Indias Silent Workforce Crisis : ఆఫ్​లు, సెలవల్లోనూ జాబ్​ టెన్షన్సే.. 88 శాతం మంది ఉద్యోగుల పరిస్థితి ఇదేనట

Employee Issues : ఉద్యోగులపై జరుగుతున్న అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. సెలవుల్లో ఉన్నా.. లీవ్ తీసుకున్నా జాబ్స్​కి సంబంధించిన పనుల్లోనే ఉద్యోగులు ఉంటున్నారంటూ తాజా అధ్యయనం తెలిపింది. 

Workforce Crisis : వీకెండ్ ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూసే రోజులు పోయాయి. సిక్​ లీవ్​ తీసుకుంటే ఏ టైమ్​లో ఏ కాల్ వచ్చి డిస్టర్బ్ చేస్తుందో తెలీదు. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా.. మెయిల్​కి రిప్లై ఇవ్వకపోయినా ప్రమోషన్ ఇవ్వరేమో.. లే ఆఫ్​లలో తీసేస్తారేమో.. ఇలాంటి టెన్షన్స్​తోనే ఉద్యోగులు సఫర్​ అవుతున్నారట. 88 శాతంమంది ఉద్యోగులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారంటూ తాజా అధ్యయనం తెలిపింది. అసలు కంపెనీలకు ఏమవుతుంది.. ఉద్యోగులను ఎందుకు ఇలా టార్చర్​ పెడుతుంది.. వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. 

బానిసలుగా మారుతున్నారు..

ఒకప్పుడు చదువు, ర్యాంకుల గురించి ఉండే ప్రెజర్ ఇప్పుడు జాబ్ ప్రెజర్​గా మారిపోతుంది. ఓ రకంగా చూస్తే స్టడీ వల్ల కలిగే బెటర్​ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యోగ చేసే రోజుల నుంచి.. ఉద్యోగానికి బానిసలుగా మారుతున్న రోజులు వచ్చేశాయి. ఒకప్పుడు కాస్త ఎక్కువ సమయంలో వర్క్ చేస్తే డెడికేషన్ అనేవారు. కానీ ఇప్పుడు అది శ్రమదోపిడిగా మారిపోయింది. టార్గెట్లు పెరిగిపోయాయి. ఎంప్లాయిస్ మనుషుల్లాగా కాకుండా రోబోలుగా పనిచేయాల్సిన పరిస్థితులు ఎక్కువైపోయాయి. 

పర్సనల్ లీవ్ సమయంలో

ఆఫీస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ సమస్య అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు సిక్​ లీవ్​లో ఉన్నా.. వారాంతపు ఆఫ్​లో ఉన్నా ఈ టార్చర్​ తప్పని స్థితులు ఏర్పడ్డాయి. మీరు పర్సనల్​ లీవ్​లో ఉన్నప్పుడు కూడా మీ వర్క్ గురించిన అప్​డేట్​ని మీ బాస్​ కాల్ చేసి అడగొచ్చు. ఈ నేపథ్యంలో చేసిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఇండియాలో దాదాపు 88 శాతం మంది వర్కింగ్ హవర్స్​ తర్వాత కూడా ఉద్యోగానికి సంబంధించిన పనులు చేస్తున్నారని తేలింది. 

ఆ భయం పెరిగిపోతుందట

ఉద్యోగులు సిక్​ లీవ్స్​లో ఉన్నప్పుడు కాల్స్ లేదా మెయిల్స్ చేయడం.. నేషనల్ హాలీడేస్ ఉన్నప్పుడు కూడా వర్క్ చేసేలా ప్రెజర్ చేయడం.. వారాంతపు సెలవుల్లో ఉన్నప్పుడు మీటింగ్​కి అటెండ్​ కావాలంటూ ఆదేశాలు ఇవ్వడం చేస్తున్నారట. ఆ సమయంలో ఉద్యోగి అలెర్ట్​గా లేకపోయినా.. కాల్స్ అటెంప్ట్ చేయకపోయినా ప్రమోషన్స్​ ఇవ్వరేమో అని.. శాలరీలు హైక్ చేయరేమోననే భయం ఉద్యోగుల్లో పెరిగిపోయేలా చేసిందని.. దీంతో వారు ఏమి చేయలేక పర్సనల్ సమయాన్ని కూడా జాబ్​ కోసం కేటాయిస్తున్నారని ఈ స్టడీలో తెలిపింది. 

జాబ్ టెన్షన్స్.. 

ఈ మధ్యకాలంలో లే ఆఫ్​లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఉద్యోగలపై పని ఒత్తిడి పెరిగిపోతుంది. అందుకే తమ పర్సనల్ స్పేస్​ కన్నా ఉద్యోగం అవసరం, భయంతో వారు అప్పుడు కూడా జాబ్​కి సంబంధించిన వర్క్స్ చేస్తున్నారు. ఈ జాబ్ టెన్షన్స్ లేకుండా దాదాపు ఏ ఉద్యోగి కూడా ఉండట్లేదని అధ్యయనంలో తేలింది. 

కంపెనీ చేయాల్సిన పని.. 

ఎవరైనా లీవ్​ లేదా ఆఫ్​లో ఉంటే వారి వ్యక్తిగత సమయాన్ని వారికి వదిలేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వారికి మెయిల్ లేదా మెసేజ్ చేయాలి. సిక్ లీవ్స్​ అనేవి మీటింగ్స్​కి కాదు.. రికవరీ అవ్వడానికి గుర్తించాలి. ఆ సమయంలో ఉద్యోగులు పూర్తిగా డిజిటల్ డీటాక్స్​లో ఉండాలి. 24 గంటలు అందుబాటులో ఉంటేనే ప్రమోషన్లు ఇస్తారనే ధోరణి మారాలి. 

లేదంటే వారి శారీరక, మానసిక పరిస్థితి పూర్తిగా దిగజారుతుంది. దీనివల్ల పొడెక్టివిటీ కూడా దెబ్బతింటుంది. వారికి పర్సనల్ స్పేస్ లేదా విశ్రాంతి సమయాన్ని కంపెనీలు ప్రొవైడ్ చేస్తే వారి నుంచి తక్కువ సమయంలో ఎక్కువ వర్క్​ని రాబట్టుకోవచ్చు. లేనిపక్షంలో వారిపై వర్క్ ప్రెజర్ పెరుగుతుంది కానీ.. పని విషయంలో ఎలాంటి ఇంప్రూవ్​మెంట్ ఉండకపోవచ్చని చెప్తున్నారు నిపుణులు. 

Also Read : ఉద్యోగుల్లో పెరుగుతున్న పని ఒత్తిడి.. తగ్గించుకునేందుకు ఆ విషయాలకు నో చెప్పండి.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Politics: మంచు కుటుంబ వివాదంలో రాజకీయ కోణం -  టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం ఉందా ?
మంచు కుటుంబ వివాదంలో రాజకీయ కోణం - టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం ఉందా ?
Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desamఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Politics: మంచు కుటుంబ వివాదంలో రాజకీయ కోణం -  టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం ఉందా ?
మంచు కుటుంబ వివాదంలో రాజకీయ కోణం - టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం ఉందా ?
Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Sobhita Dhulipala :  కాక్​టైల్​ పార్టీలో శోభిత ధూళిపాళ.. పెళ్లితర్వాత మోడ్రన్ లుక్​లో స్టన్ చేస్తోందిగా
కాక్​టైల్​ పార్టీలో శోభిత ధూళిపాళ.. పెళ్లితర్వాత మోడ్రన్ లుక్​లో స్టన్ చేస్తోందిగా
Syria Civil War: సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Sobhita Dhulipala : పెళ్లికూతురు నగలు ఎలా ఉండాలో తెలుసా? శోభిత ధూళిపాళను చూసి ఫాలో అయిపోండి
పెళ్లికూతురు నగలు ఎలా ఉండాలో తెలుసా? శోభిత ధూళిపాళను చూసి ఫాలో అయిపోండి
Embed widget