News
News
వీడియోలు ఆటలు
X

Summer Food For Pregnant: గర్భవతులు వేసవిలో ఇవి తింటే మంచిది

వేసవి ఎండ తీవ్రత వల్ల వేడీ, ఉక్కపోతలు చాలా ఇబ్బంది పెడతాయి. గర్భిణులకు మరింత కష్టంగా ఉంటుంది. తలనొప్పి, డీహైడ్రేషన్ వెంటాడుతుంటాయి. పొట్టలో సంకోచాలు కూడా వెంటాడుతుంటాయి.

FOLLOW US: 
Share:

ఈరోజుల్లో అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ అనేది ఒక ప్రాసెస్ అనే ఫీలింగ్. ఎండాకాలంలో ప్రెగ్నెన్సీ అంటే మరింత కష్టంగా అనిపిస్తుంది. నిజానికి వేసవిలోనే గర్భిణులకు అవసరమైయ్యే పండ్లు, కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి. ఇలా సీజన్ లో దొరకే పండ్లు, కూరగాయలు తప్పకుండా తినాలి.

వేసవి ఎండ తీవ్రత వల్ల వేడీ, ఉక్కపోతలు చాలా ఇబ్బంది పెడతాయి. గర్భిణులకు మరింత కష్టంగా ఉంటుంది. తలనొప్పి, డీహైడ్రేషన్ వెంటాడుతుంటాయి. పొట్టలో సంకోచాలు కూడా ఉంటాయి. బయటి వేడితో పాటు లోపల కూడా వేడి పెరిగిన భావన వల్ల చికాగుగా ఉంటుంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, కొద్దిపాటి ఆహార మార్పులతో ఈ కాలాన్ని సులభంగా గడపడం సాధ్యమే.

గర్భిణులకు అవసరమయ్యే పోషకాలు వేసవిలో దొరికే పండ్లు, కూరగాయల్లో పుష్కలంగా లభిస్తాయి. హైడ్రేటెడ్ గా, రిఫ్రెషింగ్ గా ఉండేందుకు పండ్లు ఎక్కవగా తీసుకోవాలి.  ఈ సమయంలో సమతుల ఆహారం తీసుకోవడం తల్లీ బిడ్డల ఆరోగ్యానికి చాలా మంచిది.

పుచ్చకాయ

వేసవిలో ఎక్కువగా దొరికే చల్లని పండు పుచ్చకాయ. దాదాపు 92 శాతం నీటితో ఈ పండు ఖనిజలవణాలతో నిండి ఉంటుంది. హైడ్రేట్ చేసే ఈ పండు ప్రతిరోజూ తీసుకోవచ్చు. విటమిన్ సి, పొటాషియం, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభించే ఈ పండు మంచి ఆరోగ్యదాయిని. సాయంత్రం స్నాక్ సమయంలో రోజూ ఈ పండు ముక్కలు తినడం మంచిది.

మామిడి పండు

పండ్ల రారాజు మామిడి. రుచిలో దీన్ని మించిన పండు మరోటి లేదని అందరూ ఒప్పుకోవాల్సిందే. విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలం ఇందులో. ఇవి గర్భస్థ శిశువు కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ పండు తింటే గర్భిణుల్లో సాధారణంగా ఉండే మలబద్దక సమస్యకు మంచి పరిష్కారం. అయితే మోతాదుకు మించి తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఓట్ మీల్, పెరుగు కు టాపింగ్ గా, స్మూదీల్లో కలుపుకొని కూడా తీసుకోవచ్చు.

టమాట

వేసవిలో గర్భిణులు మిస్ చెయ్యకూడని కూరగాయ టమాట. టమాట రుచి ఇష్టం లేని వారు చాలా తక్కువమంది ఉంటారు. వీటిలో విటమిన్ సి పుష్కలం. లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్ నిరోధకం. కాబోయే తల్లులు టమాట, మెంతికూర కలిపి కూరగా చేసుకుని తింటే చాలా మంచిది. సలాడ్ గానూ, శాండ్ విచ్లోనూ ఉపయోగించ వచ్చు. సూప్ గా కూడా తీసుకోవచ్చు.

పెరుగు

పెరుగు లేదా యోగర్ట్ లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శిశువులో దంతాలు, ఎముకల ఎదుగుదలకు దోహం చేసే మినరల్. పెరుగో ప్రోబయోటిక్స్ పుష్కలం. జీర్ణవ్యవస్థకు చాలా మంచి పోషకం ఇది. నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. గర్భిణులు మజ్జిగగా, లస్సీగా, పెరుగుగా ఏరూపంలో తీసుకున్నా మంచిదే.

ఆకుకూరలు

పాలకూర, మెంతికూర, తోటకూర వంటి మన ప్రదేశంలో పండే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఫోలెట్, ఐరన్, విటమిన్ కె వంటి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలు గర్భస్థ శిశువు ఎదుగుదలకు చాలా అవసరం. ఆకుకూరల్లో ఉండే ఫైబర్ వల్ల మలబద్దకాన్ని నివారించవచ్చు. ఆకుకూరలు వీలైనంత ఎక్కువ తీసుకోవాలి. కూరలుగా, సలాడ్లుగా, లేదా పరోటాలుగా ఏ రూపంలో తీసుకున్నా చాలా మేలు చేస్తాయి.

డైరెక్ట్ షుగర్స్, కాఫీ, టీలు, సోడా కలిగిన పానీయాలు, ప్రాసెస్ చేసిన పదార్థాలు, మద్యం అసలు తీసుకోవద్దు. పొగతాగే వారికి దూరంగా ఉండాలి.ొ

Also Read: డయాబెటిస్ బాధితులు మామిడి పండ్లు తినొచ్చట - కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. 

Published at : 16 Apr 2023 01:23 PM (IST) Tags: Pregnancy must eat pregnant should eat in summer

సంబంధిత కథనాలు

Fatty Liver Disease: ఆకలిగా ఉండటం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి ఇది ముందస్తు లక్షణం

Fatty Liver Disease: ఆకలిగా ఉండటం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి ఇది ముందస్తు లక్షణం

Demetia: డిమెన్షియా‌ను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి?

Demetia: డిమెన్షియా‌ను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి?

ఓ మై గాడ్, ఈ ఫుడ్‌లో ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారట!

ఓ మై గాడ్, ఈ ఫుడ్‌లో ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారట!

Workplace Burnout: ‘వర్క్ ప్లేస్ బర్న్ అవుట్’ అంటే ఏంటో తెలుసా? పెళ్లైన పురుషులకు ఈ బాధ తక్కువేనట!

Workplace Burnout: ‘వర్క్ ప్లేస్ బర్న్ అవుట్’ అంటే ఏంటో తెలుసా? పెళ్లైన పురుషులకు ఈ బాధ తక్కువేనట!

వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!

వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం