Stomach Cancer Risk : సాల్ట్‌తో క్యాన్సర్ ముప్పు 40 శాతం పెరుగుతుందట.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు.. రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలంటే?
Risk Factor of Stomach Cancer : ఉప్పు లేనిదే ఓ వంట కూడా రుచించదు. అయితే ఈ ఉప్పు వల్ల రుచి సంగతి ఏమో కానీ.. క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని అధ్యాపకులు తెలిపారు.
Cancer Risk with Salt : అన్ని వేసి చూడు.. నన్ను వేసి చూడు అని ఉప్పు అంటుందనే ఓ సామెత ఉంది. నిజమే మరి.. కర్రీని ఎంత బాగా వండినా.. కూరలో సరైన మోతాదులో ఉప్పు లేకపోతే దానికి రుచి రాదు. సరిగ్గా తినలేము కూడా. కానీ ఇప్పుడు ఉప్పుతోనే అసలు ముప్పు ఉందని తేల్చారు పరిశోధకులు. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు 40 శాతం పెరిగుతుందని తాజా అధ్యయనం తెలిపింది. ఇంతకీ ఉప్పు తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు నిజంగానే పెరుగుతుందా? పరిశోధకులు ఏమి చెప్తున్నారు? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కడుపులోని పొరను దెబ్బతీసి..
యూకేలో తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఉప్పు తక్కువగా వాడేవారితో పోలిస్తే.. ఎక్కువగా వాడే వ్యక్తుల్లో Stomach Cancer వచ్చే ప్రమాదం 41 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. వియన్నా విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ పబ్లిక్ హెల్త్ చేసిన ఇటీవలి అధ్యయనంలో భాగంగా ఉప్పు తక్కువగా తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికే చైనా, జపాన్, కొరియాలో చేసిన పరిశోధనలు కూడా Stomach Cancer ప్రమాదాన్ని పెంచుతున్నట్లు తెలిపాయి. అధిక ఉప్పు కడుపులోని రక్షిత పొరను బలహీన పరుస్తుందని మునపటి పరిశోధన తెలిపింది. దీనివల్ల కణజాలం పూర్తిగా దెబ్బతిని.. క్యాన్సర్ మార్పులు సంభవిస్తాయని తెలిపింది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలని పరిశోధకులు చెప్తున్నారు.
రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలంటే..
ఉప్పు, కడుపులో వచ్చే క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ తాజా పరిశోధన హైలైట్ చేస్తుంది. సిఫార్సు చేసిన దానికంటే రోజువారీ ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదని చెప్తోంది. ప్రతిరోజూ 2300 mg కంటే ఎక్కువ సోడియం తినకూడదని సూచిస్తున్నారు. అంటే ఇది దాదాపు ఒక టీస్పూన్ ఉప్పుకు సమానం. అయినప్పటికీ.. వివిధ ఫుడ్‌లలో ఉండే ఉప్పు వల్ల మోతాదు పెరుగుతుందని.. పరిశోధకులు గుర్తించారు. అమెరికాలో సగటున ఓ వ్యక్తి రోజుకు 3,400 మి.గ్రా ఉప్పు తీసుకుంటున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. రుచిని పెంచుకోవడం కోసం కొంచెం ఉప్పును వేసుకోవడం ఆరోగ్యానికి హాని చేయదు అనుకుంటారు కానీ.. ఇదే ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుందని పరిశోధకులు చెప్తున్నారు.
ఈ సంవత్సరంలో 26వేలకు పైగా కొత్తకేసులు..
ఈ పరిశోధనపై 11 సంవత్సరాల సమయం వెచ్చించారు. ఉప్పును ఎక్కువగా తీసుకునే వ్యక్తులు అరుదుగానే ఉన్నా.. వారిలో కడుపు క్యాన్సర్ అభివృద్ధి 41 శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఇదే కాకుండా.. వయసు, సామాజిక, ఆర్థిక స్థితి, ఆల్కహాల్, పొగాకు వినియోగం వంటివి కూడా దీని ప్రమాదాన్ని పెంచుతున్నాయని వారు తెలిపారు. 2024లో యూఎస్‌లో సుమారు 26వేలకు పైగా stomach cancer కేసులు నమోదయ్యాయని.. సుమారు 11 వేలమంది మరణిస్తున్నారని అంచనా వేశారు. ఈ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే.. చికిత్సతో తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. అయితే దీనిని గమనించకుండానే ఎక్కువ అభివృద్ధి చెందుతుందని అందుకే అలెర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. కడుపు ఉబ్బరం, నొప్పి, అజీర్ణం వంటి ప్రారంభ సంకేతాలుగా చెప్తున్నారు.
Also Read : ఆ సామర్థ్యం పెరగాలంటే.. మగవారు, ఆడవాళ్లు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.