అన్వేషించండి

A New Study on BP : రక్తపోటుతో ఇబ్బంది పడేవారికి గుడ్ న్యూస్.. ఈ వ్యాయామం రోజుకు రెండు నిమిషాలు చేస్తే చాలట

BP Controlling Exercise : మీరు రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారా? అయితే రోజులో రెండు నిమిషాలు ఈ వ్యాయామం చేస్తే చాలట. తాజాగా నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది.

Simple Exercises for BP Patients : రక్తపోటు సమస్యతో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే దీనివల్ల కలిగే ప్రధాన సమస్యల్లో గుండెపోటు ఒకటి. రక్తపోటు స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, గుండె పోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆహారం, వ్యాయామాలు, జీవనశైలిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నిర్వహించిన ఓ అధ్యయనం ఓ వ్యాయామ ఫలితాలు వెల్లడించింది. రోజులో రెండు నిమిషాలు ఈ వ్యాయామం చేస్తే రక్తపోటు అదుపులో ఉంటుందని తెలిపింది. 

ఈ అధ్యయనం గురించి బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసన్​లో ప్రచురించింది. రక్తపోటు ఉన్నవారు ఇతర వ్యాయామాల కంటే.. ఐసోమెట్రిక్ వ్యాయామాలు చేస్తే రక్తపోటు కంట్రోల్​లో ఉంటుందని గుర్తించారు. దీనిలో ముఖ్యంగా వాల్​ సిట్ మంచి ఫలితాలు ఇచ్చిందని వారు తెలిపారు. వాల్ సిట్ అంటే ఏమి లేదండి. గోడ కుర్చీ (Wall Sit). చిన్నప్పుడు టీచర్లు పనిష్మెంట్ ఇవ్వడం కోసం వాల్ సిట్ వేయించేవారు. ఇప్పుడు హెల్త్​ కోసం మనం అదే చేయాలి అనమాట. ఈ ఆసనం చేయడం చాలా సులభం. కానీ అందరికీ సులభమని చెప్పలేము. కానీ.. దీనిని తక్కువ సమయం చేసినా.. ఎక్కువ ఫలితాలు పొందవచ్చట. 

ముఖ్యంగా రక్తపోటు ఉన్నవారు గోడ కుర్చి వేస్తే.. ఆ సమస్య త్వరగా కంట్రోల్ అవుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా కండరాలు బిగుతుగా.. బలంతో.. ఓర్పును పెంపొందించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. రన్నింగ్, సైక్లింగ్ వంటి ఇతర రకాల కార్డియోల కంటే.. రక్తపోటును తగ్గించడంలో వాల్ సిట్​ ప్రభావవంతమైన ఫలితాలు ఇచ్చింది. సుమారు ఎనిమిది నిమిషాలు.. వారంలో మూడు సార్లు చేస్తే.. రక్తపోటులో ఆరోగ్యకరమైన తగ్గింపునకు దారి తీస్తుందని ఈ అధ్యయనం తెలిపింది.

గోడకు కుర్చీ వేసినట్లు శరీరాన్ని గోడకు ఆనించి.. కుర్చీ పోజీషన్​లో కుర్చోవాలి. ఈ ఆసనంలో మీ వీపు నేరుగా గోడకు ఆనించి.. మీ మోకాళ్లు 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోండి. ఈ స్థానంలో రెండు నిమిషాలు ఉండి.. మరో రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా నాలుగు సార్లు పునరావృతం చేయాలి. పరిశోధనల ప్రకారం ఇలా చేయడం వల్ల సిస్టోలిక్ రక్తపోటు 10 mmHg, డయాస్టోలిక్ ఒత్తిడిని 5 mmHg తగ్గించిందని పరిశోధన పేర్కొంది. అందుకే దీనిని రక్తపోటు ఉన్నవారి కోసం అత్యంత ప్రభావవంతమైన వ్యాయామంగా చెప్తున్నారు. 

సాధారణంగా ఐసోమెట్రిక్ వ్యాయామాలు రక్తపోటును అత్యంత సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఎందుకంటే కండరాలు సంకోచించడం.. ఆ స్థాన్ని పట్టుకోవడం వల్ల కండరానికి రక్తప్రవాహం తాత్కాలికంగా తగ్గుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని సడలించడానికి రక్తనాళాలను ప్రేరేపిస్తుంది. దీనివల్ల రక్తపోటు సమర్థవంతంగా తగ్గుతుందని పరిశోధకులు వివరించారు. ఈ వ్యాయామం మీకు బాగా అలవాటు అయితే.. మీరు వ్యాయామ సమయాన్ని పెంచుకోవచ్చు. 

Also Read : రోజంతా యాక్టివ్​గా ఉండేందుకు.. మీ రోటీన్​లో వీటిని చేర్చుకోండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
Bigg Boss 8 Telugu Prize Money: బిగ్ బాస్ ప్రైజ్ మనీ... నిఖిల్‌కు రూ. 55 లక్షలతో పాటు కారు కూడా - రోజుకు ఎంతో తెలుసా?
బిగ్ బాస్ ప్రైజ్ మనీ... నిఖిల్‌కు రూ. 55 లక్షలతో పాటు కారు కూడా - రోజుకు ఎంతో తెలుసా?
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Look Back 2024: ఇది మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ సంవత్సరం - ఇన్వెస్టర్ల ఇళ్లు డబ్బులమయం
ఇది మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ సంవత్సరం - ఇన్వెస్టర్ల ఇళ్లు డబ్బులమయం
Embed widget