Healthy Life : రోజూ ఉదయాన్నే బాదం, వాల్నట్ తింటున్నారా? అయితే ఇది మీకోసమే
Healthy Food : హెల్తీ లైఫ్ కోసం చాలామంది ఉదయాన్నే బాదం, వాల్నట్స్ తింటారు. ఈ రెండింటి కంటే ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే మరో డ్రై ఫ్రూట్ కూడా ఉంది అంటున్నారు నిపుణులు. అదేంటంటే..
Pistachios Benefits : ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా చాలా మంది బాదం, వాల్నట్స్ తినేందుకు ఎక్కువ ఇష్టపడతారు. వాటిని పరగడుపునే తినడం, స్మూతీ, జ్యూస్, సలాడ్స్‌లలో కలిపి తీసుకోవడం చేస్తారు. బలహీనంగా ఉంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించేందుకు వైద్యులు, పోషకాహార నిపుణులు వీటినే సూచిస్తారు. ఇవి కేవలం శరీర ప్రయోజనాలే కాదు ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును పొందడంలో బాగా హెల్ప్ చేస్తాయి.
బరువు తగ్గడంలో కూడా బాదం, వాల్నట్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే ఈ విషయంలో పిస్తా వెనుకబడినట్లు ఓ అధ్యయనం తెలిపింది.
మార్కెట్లో బాదం, వాల్నట్లకు ఉన్నంత గిరాకీ పిస్తాలకు ఉండదనే చెప్పాలి. అయితే ఈ రెండింటి కంటే పిస్తానే ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుందని తాజా అధ్యయనం తెలిపింది. పిస్తాలు తింటే ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా పొందవచ్చని స్టడీలో తేల్చి చెప్పారు. అసలు పిస్తా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో.. స్టడీ వీటి గురించి ఏమి చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గేందుకు..
U.S డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ డేటా ప్రకారం.. 28 గ్రాముల పిస్తాపప్పుల్లో కేవలం 159 కేలరీలు ఉంటాయి. కాబట్టి మీ డైట్లో పిస్తాలు కలిపి తీసుకున్నప్పుడు మీరు 25 కేలరీలు ఆదా చేయవచ్చు. పెద్ద తేడా ఏమి ఉంది అనుకుంటున్నారేమో.. మీరు బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తే 25 కేలరీలు కట్ చేయడం ఎంత కష్టమో తెలుస్తుంది అంటున్నారు నిపుణులు. వీటిలో జీర్ణమయ్యే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మీరు ఎక్కువ సమయంలో ఆకలి లేకుండా ఉండగలుగుతారు. ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి.
కండర బలం కోసం..
వ్యాయామాలు చేసే వారికి పిస్తాలు చాలా మంచి ఆప్షన్. ఇవి మీ కండరాలను బలోపేతం చేయడానికి హెల్ప్ చేస్తాయి. కండర పటిష్టత కోసం ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటుంటే మీరు దానిని పిస్తాలతో కలిపి తీసుకోవచ్చు. పిస్తాపప్పులు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. ఇతర డ్రై ఫ్రూట్స్‌తో పోలిస్తే పిస్తాల్లో అమైనో యాసిడ్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం తెలిపింది. కండర పోషణలో అమైనో ఆమ్లాలు కీలకపాత్ర పోషిస్తాయి. దీనివల్ల జీవక్రియ కూడా వేగంగా మారుతుంది. దీనివల్ల తర్వగా బరువు తగ్గవచ్చు.
జీర్ణాశయానికి..
పిస్తాపప్పులో అధికంగా ఉండే ఫైబర్ మీ జీర్ణాశయానికి చాలా మంచిది. దీనిలోని ఫైబర్ జీర్ణాశయం నుంచి జీర్ణక్రియకు అవసరమైన బ్యాక్టీరియాను విడుదల చేస్తుందని.. ఓ అధ్యయనంలో ప్రచురితమైంది. ఇది మీకు మెరుగైన గట్ నిర్వాహణకు హెల్ప్ అవుతుంది.
గుండె ఆరోగ్యానికి
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో పిస్తాపప్పులు చాలా ప్రభావవంతంగా హెల్ప్ చేస్తాయని స్టడీ తెలిపింది. ఇదే కాకుండా వీటిని తినడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని.. ఇది అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఓ వరమని తెలిపింది. రక్తపోటు కంట్రోల్లో ఉంటే గుండెపోటు, కార్డియాక్ సమస్యల ప్రమాదం తగ్గుతుందని పేర్కొంది.
రోగనిరోధక శక్తి..
ఏ కాలంలోనైనా రోగనిరోధక శక్తి చాలా అవసరం. అయితే మీరు ఇమ్యూనిటీ కోసం చూస్తుంటే మీకు పిస్తాలు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అన్ని నట్స్ కంటే పిస్తాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని ఓ అధ్యయనం తెలిపింది. ఇవి క్యాన్సర్ కణాల నష్టాన్ని నివారిస్తాయి. రోగనిరోధక శఖ్తిని పెంచుతాయి. కాబట్టి మీకు క్యాన్సర్, ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది.
Also Read : స్మోకింగ్ చేయనివారికంటే మానేసిన వారికే ఆయుష్షు ఎక్కువట.. కొత్త అధ్యయనం ఇదే చెప్తోంది