Salt Consuming: ఉప్పు ఎక్కువ తింటున్నారా... అయితే మీ మెదడు ప్రమాదంలో పడినట్టే
ఉప్పుకి, మెదడుకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఉప్పుడు మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది?
ఉప్పు తక్కువగా తీసుకున్నా అనర్థమే, ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే. శరీరానికి సరిపడా తీసుకుంటేనే ఆరోగ్యం బాగుండేది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది, గుండెజబ్బులకు కారణం కావచ్చని తెలిసిన విషయమే. అలాగే పక్షవాతం కూడా వచ్చే ప్రమాదముందని వింటూనే ఉంటాం. కానీ ఉప్పు అధిక వినియోగం మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని నిర్దారిస్తున్నాయి. మెదడుపై ఉప్పు ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేముందు, అసలు ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.
చాలా మంది కూరల్లో, బిర్యానీలో అధికంగా ఉప్పు వేసుకుని తింటుంటారు. రుచి కోసమే వారి తాపత్రయం. కానీ మీరు అధికంగా ఉప్పును వాడుతున్నప్పుడు, ఆ ఉప్పుని చిన్న పేగులు శోషణం చేసుకుంటాయి. దీంతో టీహెచ్ 17 అని పిలిచే తెల్లరక్తకణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల ఐఎస్17 అనబడే ప్రోటీన్ స్థాయులు ఒకేసారి పెరిగిపోతాయి. ఈ పరిణామం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ సరఫరా తగ్గిపోతుంది. దీంతో రక్తనాళాలు బిగుసుకుపోవడం మొదలవుతుంది. రక్తనాళాలు బిగుసుకుపోతే రక్తం సరఫరాకి ఆటంకం కలుగుతుంది. మెదడుకు కూడా రక్తం తక్కువగా అందడం ప్రారంభమవుతుంది. దీనివల్ల ఆలోచనా విధానంపై, జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతుంది. త్వరగా విషయాలు మర్చిపోవడం, సరిగ్గా ఆలోచించ లేకపోవడం, విషయాలను విశదీకరించలేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేక సతమతమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కేవలం మూడు నెలల పాటూ ఉప్పు అధికంగా తీసుకున్న వారిమీద పరిశోధనే చేస్తేనే ఈ విషయాలు బయటపడ్డాయి. మరి ఏళ్లకు ఏళ్లు ఉప్పును మోతాదుకు మించి వాడుతున్న వారిపై అధ్యయనం చేస్తే ఇంకెన్ని విషయాలు బయటపడేవో.
ప్రపంచంలో చాలా మంది డెమెన్షియా అనే మతిమరుపు వ్యాధి బారిన పడుతున్నారు. దాని వెనుక కూడా ఉప్పు కారణమయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు అధ్యయనకర్తలు. ఉప్పుని తగ్గిస్తే చాలా దీర్ఘకాల వ్యాధులను బయటపడొచ్చు. అధ్యయనాన్ని న్యూయార్క్ కు చెందిన ‘ఫీల్ ఫ్యామిలీ బ్రెయిన్ అండ్ రీసెర్చ్ ఇన్సిట్యూట్’ వారు నిర్వహించారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీ డైట్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: బరువు తగ్గాలనుకుంటున్నారా... ఈ డ్రింకులకు దూరంగా ఉండండి
Also read: జిజాంటిక్ జిలేబి... ఒక్కటే కిలో తూగుతుంది, చూస్తే నోరూరిపోవడం ఖాయం
Also read: నీలి రంగు డ్రెస్సులోనా... చందమామ నువ్వే కాదా