Apple COO: సిలికాన్ వ్యాలీలో మరో ఇండియన్ జెండా - యాపిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా సబీ ఖాన్
Sabih Khan: భారత సంతతికి చెందిన సబీ ఖాన్‌ను తమ కొత్త COOగా యాపిల్ నియమించింది. టెక్ దిగ్గజ పరిశ్రమల్లో అత్యున్నత స్థానాలకు చేరుకున్న వ్యక్తుల్లో ఒకరిగా సబీ ఖాన్ గుర్తింపు తెచ్చుకున్నారు.

Apple new chief operating officer: ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ చీఫ్ ఆఫరేటింగ్ ఆఫీసర్‌గా సబీ ఖాన్ నియమితులయ్యారు. ఆయన ఈ నెలాఖరులో ఈ పదవిని స్వీకరిస్తారు. జెఫ్ విలియమ్స్ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. సబీఖాన్ భారత సంతతి వ్యక్తి. సబీ ఖాన్ 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించారు. ఆయన ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఆయన కుటుంబం సింగపూర్‌కు వలస వెళ్లింది, ఆ తర్వాత వారు యునైటెడ్ స్టేట్స్‌లో స్థిరపడ్డారు
సబీఖాన్ టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో డ్యూయల్ బ్యాచిలర్ డిగ్రీలు పొందారు. ఆ తర్వాత రెన్సెలాయర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ (RPI) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు. 1995లో ఆపిల్‌లో చేరే ముందు, GE ప్లాస్టిక్స్ లో అప్లికేషన్స్ డెవలప్‌మెంట్ ఇంజనీర్, కీ అకౌంట్ టెక్నికల్ లీడర్‌గా పనిచేశారు. సబీ ఖాన్ 1995లో ఆపిల్‌లో ప్రొక్యూర్‌మెంట్ గ్రూప్‌లో చేరారు. 2019 జూన్ 27న ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్‌గా నియమితులయ్యారు, COO జెఫ్ విలియమ్స్‌కు రిపోర్ట్ చేస్తూ, ఆపిల్ ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్‌లో సభ్యుడయ్యారు. గత ఆరు సంవత్సరాలుగా ఆపిల్ గ్లోబల్ సప్లై చైన్‌ను నిర్వహిణను సబీ ఖాన్ చూస్తున్నారు. ప్లానింగ్, ప్రొక్యూర్‌మెంట్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, ప్రొడక్ట్ ఫుల్‌ఫిల్‌మెంట్ వంటి వాటిని పర్యవేక్షించారు.
🇺🇸🔄 Apple appoints Sabih Khan as new COO in a planned succession
— Depin Bhat (@DepinBhat) July 8, 2025
▪️ Khan, a 30-year veteran from Moradabad, leads Apple’s global operations and supply chain
▪️ Williams: COO since 2015 - will retire later this year, continuing design & health oversight until then
▪️… pic.twitter.com/A5Juju8b8N
సబీ ఖాన్ ఆపిల్ లో అధునాతన మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీలను ప్రవేశపెట్టారు, యునైటెడ్ స్టేట్స్‌లో ఆపిల్ మాన్యుఫాక్చరింగ్ ఫుట్‌ప్రింట్‌ను విస్తరించారు. ఆయన నాయకత్వంలో, ఆపిల్ తన కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను 60 శాతం కంటే ఎక్కువ తగ్గించింది. ఆపిల్ CEO టిమ్ సబీ కుక్ ఖాన్‌ను "బ్రిలియంట్ స్ట్రాటజిస్ట్"గా అభివర్ణించారు, ఆయన ఆపిల్ సప్లై చైన్ కీలక ఆర్కిటెక్ట్‌లలో ఒకరని పేర్కొన్నారు. ఆయన అసాధారణమైన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అవుతారని తనకు తెలుసని టిమ్ కుక్ అభినందించారు. సబీ ఖాన్ నియామకం భారతదేశం ఆపిల్ గ్లోబల్ స్ట్రాటజీలో పెరుగుతున్న ప్రాముఖ్యతను సూచిస్తుందని ఇండస్ట్రీ వర్గాలుచెబుతున్నాయి. భారతదేశం ఆపిల్‌కు కీలక మార్కెట్, మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారుతోంది.
సబీఖాన్ నియామకంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో తాను సబీ ఖాన్ తో సమావేశమయ్యానని గుర్తు చేసుకున్నారు.
Many congratulations to Sabih Khan on being elevated as the COO of Apple
— KTR (@KTRBRS) July 9, 2025
I had the pleasure of meeting and interacting with Sabih a few years ago when he was leading Global supply chain operations for Apple
Onwards and upwards my friend 👏 pic.twitter.com/TbsYffwLJv





















