అన్వేషించండి

IFS Main Exam: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్ 2023 షెడ్యూలు వెల్లడి, పరీక్ష విధానం ఇలా!

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) మెయిన్ పరీక్ష తేదీని యూపీఎస్సీ అక్టోబరు 7న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 26, 28, 29, 30 తేదీల్లో; డిసెంబరు 1-3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) మెయిన్ పరీక్ష తేదీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 7న వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్ష వివరాల కోసం యూపీఎస్సీ వెబ్‌సైట్ చూడవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 26, 28, 29, 30 తేదీల్లో; డిసెంబరు 1-3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ఐఎఫ్ఎస్ మెయిన్ 2023 పరీక్షలను వివిధ పట్టనాలు/నగరాల్లో నిర్వహించనున్నారు. దేశంలో భోపాల్, చెన్నై, ఢిల్లీ, డిస్‌పూర్(గువాహటి), హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, నాగ్‌పూర్, పోర్ట్ బ్లెయిర్, సిమ్లాలో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌లో విజయం సాధించాలంటే.. అకడమిక్, సమకాలీన అంశాల సమ్మేళనంగా ప్రిపరేషన్‌ సాగించాలి. అకడమిక్‌గా బ్యాచిలర్, పీజీ స్థాయిలో తాము చదివిన స్పెషలైజేషన్లపై పూర్తి పట్టు సాధించాలి. అదే విధంగా వాటిని సమకాలీన పరిస్థితులతో అన్వయం చేసుకునే నైపుణ్యం సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.

మెయిన్ పరీక్ష విధానం..
ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్‌తోపాటు రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లలో నాలుగు పేపర్లు మొత్తంగా ఆరు పేపర్లలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

➥ పేపర్‌–1: జనరల్‌ ఇంగ్లిష్‌ - 300 మార్కులు

➥ పేపర్‌–2: జనరల్‌ నాలెడ్జ్‌ - 300 మార్కులు

➥ పేపర్‌–3: ఆప్షనల్‌ సబ్జెక్ట్‌(1) పేపర్‌–1 - 200 మార్కులు

➥ పేపర్‌–4: ఆప్షనల్‌ సబ్జెక్ట్‌(1)పేపర్‌–2 - 200 మార్కులు

➥ పేపర్‌–5: ఆప్షనల్‌ సబ్జెక్ట్‌(2)పేపర్‌–3 - 200 మార్కులు

➥ పేపర్‌–6: ఆప్షనల్‌ సబ్జెక్ట్‌(2)పేపర్‌–4 - 200 మార్కులు

★ అభ్యర్థులు ఏవైనా రెండు సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకోవాలి. ఇలా ఎంపిక చేసుకున్న రెండు సబ్జెక్ట్‌ల నుంచి ఒక్కో దానిలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తారు. 

★ ఆప్షనల్స్‌ ఎంపికకు సంబంధించి నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్ట్‌లను పేర్కొన్నారు. అభ్యర్థులు ఆ జాబితాలోని సబ్జెక్ట్‌లనే ఆప్షనల్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది.

★ అంతేకాకుండా ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ల ఎంపిక విషయంలో కొన్ని సబ్జెక్ట్‌ కాంబినేషన్లను అనుమతించరు.

ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ల వివరాలు..

➥ అగ్రికల్చర్‌; అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌; యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌; బోటనీ; కెమిస్ట్రీ; కెమికల్‌ ఇంజనీరింగ్‌; సివిల్‌ ఇంజనీరింగ్‌; ఫారెస్ట్రీ; జియాలజీ; మ్యాథమెటిక్స్‌; మెకానికల్‌ ఇంజనీరింగ్‌; ఫిజిక్స్‌; స్టాటిస్టిక్స్‌; జువాలజీ.

➥ అగ్రికల్చర్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌; –అగ్రికల్చర్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌; –అగ్రికల్చర్‌ అండ్‌ ఫారెస్ట్రీ; –కెమిస్ట్రీ అండ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌; –మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌.

➥ ఇంజినీరింగ్‌ అభ్యర్థులు.. ఏదైనా ఒక ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌నే ఆప్షనల్‌గా ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. రెండో ఆప్షనల్‌గా.. వేరే విభాగాల్లోని సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి.

ప్రత్యేకంగా రెండు ఆప్షనల్స్‌.. 

➥ ఐఎఫ్‌ఎస్‌ అభ్యర్థులు పరీక్ష విధానంలో భాగంగా రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. వాటి నుంచి నాలుగు పేపర్లకు హాజరవ్వాల్సి ఉంటుంది. అంటే.. ఆప్షనల్‌ పేపర్లకు అధిక వెయిటేజీ ఉందనే విషయం స్పష్టం. కాబట్టి ఇప్పటి నుంచే ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లపై పట్టు సాధించే విధంగా నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలి.

➥ అభ్యర్థులు ఒక ఆప్షనల్‌ను తమ అకడమిక్‌ నేపథ్యంలోని సబ్జెక్ట్‌ల నుంచి ఎంపిక చేసుకుంటారు. మరో ఆప్షనల్‌ పూర్తిగా కొత్త సబ్జెక్ట్‌. ఎందుకంటే.. ఒకే స్వరూపం ఉండే సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా తీసుకోకూడదనే నిబంధన ఉంది. ఉదాహరణకు.. అగ్రికల్చర్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. రెండో ఆప్షనల్‌గా అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకునే వీలు లేదు. అదే విధంగా బీటెక్‌ అర్హతతో పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు రెండు ఆప్షనల్స్‌ను ఇంజనీరింగ్‌ నేపథ్యం సబ్జెక్ట్‌ల నుంచి ఎంపిక చేసుకునే అవకాశం లేదు. అభ్యర్థులు ముందుగా తమ అకడమిక్‌ నేపథ్యానికి సంబంధంలేని, కొత్తగా ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌తో మెయిన్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించాలి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget