అన్వేషించండి

UPSC Recruitment: సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌లో 322 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు, అర్హతలివే!

బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ త‌దిత‌ర ద‌ళాల‌లో అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ త‌దిత‌ర ద‌ళాల్లో అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టుల భ‌ర్తీకి "సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2023" నోటిఫికేష‌న్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుద‌ల చేసింది. దీనిద్వారా 322 పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఏప్రిల్ 26న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మే 16 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.

వివరాలు..

మొత్తం పోస్టులు: 322

పోస్టులు: బీఎస్‌ఎఫ్‌- 86, సీఆర్‌పీఎఫ్‌- 55, సీఐఎస్‌ఎఫ్‌- 91, ఐటీబీపీ- 60, ఎస్‌ఎస్‌బీ- 30

అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వ‌యోపరిమితి: 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.04.2023 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.05.2023.

➥ దరఖాస్తుల సవరణ: 17.05.2023 నుంచి 23.05.2023 వరకు.

Notification

Online Application

Also Read:

సీఆర్‌పీఎఫ్‌లో 212 సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు- అర్హతలివే!
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్- బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన  అర్హతలు గల అభ్యర్థులు మే 1 నుంచి 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎస్‌ఐ పోస్టులకు రూ.200, ఏఎస్‌ఐ పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎన్‌సీఈఆర్‌టీలో 347 ఉద్యోగాలు- వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీఈఆర్‌టీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 347 పోస్టులను భర్తీ చేయనున్నారు. సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్‌ మేనేజర్‌, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-I, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులను భర్తీచేస్తారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 19 ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Road Show: కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
Aavesham movie OTT: సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ 'ఆవేశం'- స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ 'ఆవేశం'- స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
KTR: రాహుల్ గారు భ్రమలో ఉన్నారా? డ్రామా ఆడుతున్నారా? కేటీఆర్ ఫైర్
రాహుల్ గారు భ్రమలో ఉన్నారా? డ్రామా ఆడుతున్నారా? కేటీఆర్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Padma Sri KS Rajanna | చేతులు, కాళ్లు సరిగ్గా లేకున్నా పద్మ శ్రీ వరించింది. ఇంతకు ఎవరీయనా..? | ABPProducer  A. M. Rathnam on Pawan Kalyan | OG , హరిహర వీరమల్లులో ఏది ముందు వస్తుంది..? | ABP DesamMP Navneet Kaur on Owaisi Brothers | ఒవైసీ బ్రదర్స్ ఆట కట్టించడానికి 15 సెకన్లు చాలంటున్ననవనీత్ కౌర్Kishan Reddy | Secunderabad MP Candidate | కాంగ్రెస్ గుర్తు గాడిద గుడ్డుగా మార్చబోతున్నారు| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Road Show: కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
Aavesham movie OTT: సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ 'ఆవేశం'- స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ 'ఆవేశం'- స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
KTR: రాహుల్ గారు భ్రమలో ఉన్నారా? డ్రామా ఆడుతున్నారా? కేటీఆర్ ఫైర్
రాహుల్ గారు భ్రమలో ఉన్నారా? డ్రామా ఆడుతున్నారా? కేటీఆర్ ఫైర్
Kishan Reddy: రేపే ఎల్బీ స్టేడియంలో బీజేపీ భారీ సభ, మోదీ ఎన్నికల సందేశం - కిషన్ రెడ్డి
రేపే ఎల్బీ స్టేడియంలో బీజేపీ భారీ సభ, మోదీ ఎన్నికల సందేశం - కిషన్ రెడ్డి
Special Trains: ఓటు వేయడానికి వెళ్తున్నారా? టికెట్లు దొరకట్లేదా? ఈ స్పెషల్ ట్రైన్‌లో ట్రై చేయండి!
ఓటు వేయడానికి వెళ్తున్నారా? టికెట్లు దొరకట్లేదా? ఈ స్పెషల్ ట్రైన్‌లో ట్రై చేయండి!
Chandrababu Biopic : యూట్యూబ్‌లో దూసుకుపోతున్న చంద్రబాబు బయోపిక్ 'తెలుగోడు'
యూట్యూబ్‌లో దూసుకుపోతున్న చంద్రబాబు బయోపిక్ 'తెలుగోడు'
CM Jagan: లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్ పిటిషన్ - అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్, తీర్పు వాయిదా
లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్ పిటిషన్ - అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్, తీర్పు వాయిదా
Embed widget