News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

UPSC Exam Calendar: యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్.. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు ఎప్పుడంటే?

UPSC Exam Calendar: 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఎగ్జామ్ క్యాలెండర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఇందులో 2021 ఏడాదికి సంబంధించిన సివిల్స్ మెయిన్ పరీక్ష తేదీలను వెల్లడించింది.

FOLLOW US: 
Share:

2021-22 సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు, రిక్రూట్‌మెంట్ల నోటిఫికేషన్ తేదీలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. ఎగ్జామ్ క్యాలెండర్ రూపంలో ముఖ్యమైన తేదీలను వెల్లడించింది. ఇందులో 2021లో ఇంకా విడుదల కావాల్సిన జాబ్ నోటిఫికేషన్లతో పాటు, 2022లో రావాల్సిన ఉద్యోగ భర్తీ వివరాలను అందించింది. ఇంజనీరింగ్ సర్వీస్ ఉద్యోగాలతో పాటు, కంబైన్డ్ జియో సైంటిస్ట్ పోస్టుల వివరాలు ఇందులో ఉన్నాయి. 

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్- 2021 మెయిన్ పరీక్షలు 2022 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 8 వరకు జరుగుతాయని తెలిపింది. వీటితో పాటు కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2021 పరీక్షలు అక్టోబర్ 21న జరుగుతాయి. ఎన్డీఏ, ఎన్ఏ ఎగ్జామినేషన్- 2021 పరీక్ష అక్టోబర్ 14న జరగనుంది. 

Also Read:  IDBI Recruitment 2021: ఐడీబీఐలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్..

సివిల్స్ మెయిన్స్ ఎప్పుడంటే?
ఇక 2021 ఏడాదికి సంబంధించిన సివిల్స్ మెయిన్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ పరీక్షను అక్టోబర్ 10న నిర్వహించగా.. మెయిన్ పరీక్ష పెండింగ్‌లో ఉంది. ఈ పరీక్షలను 2022 జనవరి  7, 8, 9, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు.  

2021లో రానున్న నోటిఫికేషన్లు.. 
ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమనరీ) ఎగ్జామినేషన్- 2022.. కంబైన్డ్ జియో సైంటిస్ట్ (ప్రిలిమనరీ) ఎగ్జామినేషన్- 2022 నోటిఫికేషన్లు సెప్టెంబర్ 22న విడుదల కానున్నాయి. ఈ రెండు పరీక్షలను 2022 ఫిబ్రవరి 20న నిర్వహిస్తారు. కంబైన్డ్ జియో సైంటిస్ట్ మెయిన్ పరీక్షలు ఫిబ్రవరి 24న జరుగుతాయి. 

Also Read:  UBI Recruitment 2021: యూనియన్ బ్యాంకులో 347 ఉద్యోగాలు.. నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు ఇవే

ఫిబ్రవరిలో సివిల్- 2022 నోటిఫికేషన్
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష- 2022 నోటిఫికేషన్ వచ్చే ఫిబ్రవరిలో వెలువడనుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 5వ తేదీన నిర్వహిస్తారు. సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్ 16న జరుగుతుంది. ఇక 2021 ఏడాదికి సంబంధించిన యూపీఎస్సీ ఐఈఎస్, ఐఎస్ఎస్ పరీక్ష జూన్ 24వ తేదీన నిర్వహిస్తారు. 

యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

  • upsc.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. 
  • ఇక్కడ ఎగ్జామినేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే.. క్యాలెండర్ ఆప్షన్ కనిపిస్తుంది. 
  • క్యాలెండర్ ఆప్షన్లో మనకు యాన్యువల్ క్యాలెండర్ 2022, రివైజ్డ్ యాన్యువల్ క్యాలెండర్ 2021, యాన్యువల్ క్యాలెండర్ 2021 అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. 
  • వాటిలో మనకు కావాల్సిన దానిని ఎంచుకుంటే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో పరీక్షలు, నోటిఫికేషన్ల వివరాలన్నీ కనిపిస్తాయి.

Also Read:  BSF Recruitment 2021: మీరు టెన్త్ పూర్తి చేసి ఉంటే రూ.69,100 జీతం వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయండిలా

Also Read: UPSC Recruitment 2021: యూపీఎస్సీలో 155 ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రాసెస్, పూర్తి వివరాలు ఇవే..

Published at : 14 Aug 2021 04:43 PM (IST) Tags: UPSC Exam Calendar UPSC Exam Calendar 2022 Civil Main Exam Date Civil Exam dates Exam notifications

ఇవి కూడా చూడండి

PJTSAU Jobs: జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ఉద్యోగాలు, వివరాలు ఇలా

PJTSAU Jobs: జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ఉద్యోగాలు, వివరాలు ఇలా

Software Training: సాఫ్ట్‌వేర్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ, ఈ అర్హతలుండాలి

Software Training: సాఫ్ట్‌వేర్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ, ఈ అర్హతలుండాలి

Teachers Transfer: ఉపాధ్యాయ బదిలీ వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం, నమోదుకు నేడే ఆఖరు

Teachers Transfer: ఉపాధ్యాయ బదిలీ వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం, నమోదుకు నేడే ఆఖరు

NIELIT: ఎన్‌ఐఈఎల్‌ఐటీలో ల్యాబ్ అసిస్టెంట్/ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులు- అర్హతలు, ఇతర వివరాలు ఇలా

NIELIT: ఎన్‌ఐఈఎల్‌ఐటీలో ల్యాబ్ అసిస్టెంట్/ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులు- అర్హతలు, ఇతర వివరాలు ఇలా

Railway Jobs: ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ ఉద్యోగాలు, వివరాలు ఇలా

Railway Jobs: ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ ఉద్యోగాలు, వివరాలు ఇలా

టాప్ స్టోరీస్

Chandrababu Naidu Arrest : చంద్రబాబు మాజీ పీఎస్‌ సస్పెండ్ - అమెరికాకు వెళ్లి తిరిగిరాలేదన్న ప్రభుత్వం !

Chandrababu Naidu Arrest :  చంద్రబాబు మాజీ పీఎస్‌ సస్పెండ్ - అమెరికాకు వెళ్లి తిరిగిరాలేదన్న ప్రభుత్వం !

మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్‌ఎస్‌- హింట్ ఇచ్చిన హరీష్

మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్‌ఎస్‌- హింట్ ఇచ్చిన హరీష్

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్

Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్