UPSC CAPF 2022 Registration: కేంద్ర బలగాలలో చేరాలని ఉందా, అయితే యువకులకు యూపీఎస్సీ శుభవార్త - ఇలా అప్లై చేసుకోండి
UPSC CAPF 2022 Recruitment: సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రారంభించింది. పూర్తి వివరాలు మీకోసం..
UPSC CAPF 2022 Registration: కేంద్ర సాయుధ బలగాలలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా.. అయితే మీకు శుభవార్త. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF 2022 Notification) ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. తుది గడువు మే 10వ తేదీతో ముగియనుందని యూపీఎస్సీ స్పష్టం చేసింది.
సీఏపీఎఫ్ 2022 (UPSC CAPF 2022 Recruitment: ) ఎగ్జామ్‌ను ఆగస్టు 7న నిర్వహించనున్నారు. పేపర్ 1, పేపర్ 2గా రెండు పేపర్లుగా సీఏపీఎఫ్ ఎగ్జామ్‌ను యూపీఎస్సీ నిర్వహించనుంది. జులై రెండో వారంలో లేదా మూడో వారంలో హాల్ టికెట్లను రిలీజ్ చేస్తారు. మొత్తం 253 పోస్టులుండగా.. అందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force)లో 66 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF Jobs), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కలిపి 29 పోస్టులు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP)లో 14 పోస్టులు, సశస్త్ర సీమా బల్ (88) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల సంఖ్య..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ - 66 పోస్టులు
సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ - 29 పోస్టులు
ఐటీబీపీ - 14 పోస్టులు
సశస్త్ర సీమా బల్ - 88 పోస్టులు
యూపీఎస్‌సీ సీఏపీఎఫ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ (UPSC CAPF 2022 Registration):
మొదట యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in సందర్శించాలి
హోం పేజీలో కనిపించే UPSC CAPF Exam 2022 link మీద క్లిక్ చేయాలి
ఓపెన్ అయిన కొత్త పేజీలో పార్ట్ 1 రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి
మీ వివరాలతో అప్లికేషన్ ఫారమ్ నింపాలి. అందులో భాగంగా అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
మీ ఫారమ్ సబ్మిట్ చేయడంతో పాటు దీన్ని ప్రింటౌట్ తీసుకోవం బెటర్.
యూపీఎస్సీ సీఏపీఎఫ్ 2022 ఏజ్ లిమిట్ (UPSC CAPF 2022 age limit):
ఆగస్టు 1, 2022 నాటికి అభ్యర్థులు 20 నుంచి 25 ఏళ్ల వయసు వారై ఉండాలి. అభ్యర్థులు ఆగస్టు 2, 1997 నుంచి ఆగస్టు 1, 2002 మధ్య జన్మించి ఉంటే అర్హులవుతారు.
ఎలిజిబిలిటీ..
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.