అన్వేషించండి

UPSC Nursing Officers: 1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ESIC) కేంద్రాల్లో పని చేసేందుకు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.

UPSC ESIC Nursing Officers: దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ESIC) కేంద్రాల్లో పని చేసేందుకు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1930 నర్సింగ్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా (జనరల్ నర్సింగ్ మిడ్-వైఫరీ) అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 7న ప్రారంభంకాగా.. మార్చి 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు ప్రొబేషన్ ఉంటుంది. వీరు దేశంలో ఎక్కడైనా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.

వివరాలు...

* నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు

ఖాళీల సంఖ్య: 1930.

పోస్టుల కేటాయింపు: జనరల్(యూఆర్)-892, ఈడబ్ల్యూఎస్-193, ఓబీసీ-446, ఎస్సీ-235, ఎస్టీ-164. వీటిలో 168 పోస్టులు దివ్యాంగులకు కేటాయించారు.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్‌(ఆనర్స్). బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. డిప్లొమా (జనరల్ నర్సింగ్ మిడ్-వైఫరీ). స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సు లేదా నర్సు, మిడ్‌వైఫ్‌గా సభ్యత్వం కలిగి ఉండాలి. ఏదైనా 50 పడకల ఆసుపత్రిలో కనీసం ఏడాది కాలం పనిచేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 27.03.2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు 33 సంవత్సరాలు; ఎస్సీ/ ఎస్టీలకు 35 సంవత్సరాలు; దివ్యాంగులకు 40 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.25. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా జులై 7న పెన్ను, పేపర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్ పరీక్ష. ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. రెండు గంటల పాటు ఉండే ఈ పరీక్షలో అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు ఉంటాయి. ఒక్కో తప్పు సమాధానానికి 1/3 మైనస్ మార్కులు ఉంటాయి.

జీతం: లెవెల్-7 పే మ్యాట్రిక్స్ కింద చెల్లిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.03.2024. (18:00 HRS)

➥ దరఖాస్తుల సవరణ: 07.03.2024 నుంచి 03.04.2024 వరకు.

➥ పరీక్ష తేది: 07.07.2024.

Notification

Online Application

Website

ALSO READ:

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో 4,660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్ల పరిధిలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శ్రీకారంచుట్టింది. దీనిద్వారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్‌)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) విభాగాల్లో మొత్తం 4,660 ఖాళీలను భర్తీచేయనున్నారు. వీటిలో సబ్-‌ఇన్‌స్పెక్టర్(RPF SI) - 452 పోస్టులు, కానిస్టేబుల్ (RPF Constable) - 4208 పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన సంక్షిప్త ప్రకటనను రైల్వేశాఖ(RRB) విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్‌ 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు మే 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు (ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్-PMT, ఫిజికల్ స్డాండర్ట్ టెస్ట్-PET), వైద్య పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Vande Bharat Trains:నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
Bank Holiday: నేడు బ్యాంకు తెరిచి ఉంటుందా లేదా హాలిడేనా? వెళ్లే ముందు సెలవుల జాబితా చూడండి
నేడు బ్యాంకు తెరిచి ఉంటుందా లేదా హాలిడేనా? వెళ్లే ముందు సెలవుల జాబితా చూడండి
Car Safety Tips: కారు 1.20 లక్షల కిలోమీటర్లు నడిస్తే ఏయే విడిభాగాలను మార్చడం చాలా అవసరం?
కారు 1.20 లక్షల కిలోమీటర్లు నడిస్తే ఏయే విడిభాగాలను మార్చడం చాలా అవసరం?
Advertisement

వీడియోలు

Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి
పీఎం మోదీని కలిసినప్పుడు అలా ఎందుకు చేసానంటే..!
అల్లటప్పా ఆటగాడనుకున్నారా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Vande Bharat Trains:నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
Bank Holiday: నేడు బ్యాంకు తెరిచి ఉంటుందా లేదా హాలిడేనా? వెళ్లే ముందు సెలవుల జాబితా చూడండి
నేడు బ్యాంకు తెరిచి ఉంటుందా లేదా హాలిడేనా? వెళ్లే ముందు సెలవుల జాబితా చూడండి
Car Safety Tips: కారు 1.20 లక్షల కిలోమీటర్లు నడిస్తే ఏయే విడిభాగాలను మార్చడం చాలా అవసరం?
కారు 1.20 లక్షల కిలోమీటర్లు నడిస్తే ఏయే విడిభాగాలను మార్చడం చాలా అవసరం?
Telangana Srirangam: తమిళనాడు ఆలయానికి ప్రతిరూపం తెలంగాణ శ్రీరంగం దర్శించుకున్నారా? వివాహాలకు ప్రసిద్ధి ఈ ఆలయం!
తమిళనాడు ఆలయానికి ప్రతిరూపం తెలంగాణ శ్రీరంగం దర్శించుకున్నారా? వివాహాలకు ప్రసిద్ధి ఈ ఆలయం!
Sree Vishnu : హీరో శ్రీవిష్ణు కూతురిని చూశారా? - ఎంత క్యూట్‌గా ఉందో
హీరో శ్రీవిష్ణు కూతురిని చూశారా? - ఎంత క్యూట్‌గా ఉందో
హ్యాకర్ల ప్రపంచం: తెలుపు, నలుపు, బూడిద టోపీల రహస్య కథ! సైబర్ నేరగాళ్ల గురించి తెలుసుకోండి
సైబర్ ప్రపంచంలో హ్యాకర్లకు రంగుల టోపీల కేటాయింపు - ఎందుకో, ఏంటో తెలుసా?
Predator Badlands Review In Telugu - 'ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్' రివ్యూ: ఇన్నాళ్లకు దారిలో పడ్డ ఫ్రాంచైజీ... సినిమా ఎలా ఉందంటే?
'ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్' రివ్యూ: ఇన్నాళ్లకు దారిలో పడ్డ ఫ్రాంచైజీ... సినిమా ఎలా ఉందంటే?
Embed widget