UPSC ESE Results: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ మెయిన్ ఫలితాలు విడుదల, ఇంటర్వ్యూకు 630 మంది ఎంపిక
ESE Results: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024 మెయిన్స్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.
UPSC Engineering Services (Main) Examination, 2024 Results: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మెయిన్ 2024 పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జులై 30న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూడవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో బ్రాంచ్‌లవారీగా ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ/పర్సనాలిటిటీ టెస్ట్ నిర్వహించనున్నారు. యూపీఎస్సీ జూన్ 23న ఇంజినీరింగ్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రధాన పరీక్షకు సంబంధించి మొత్తం 630 మంది అభ్యర్థులు తర్వాతి దశకు అర్హత సాధించారు. ఇందులో సివిల్ ఇంజినీరింగ్-284, మెకానికల్ ఇంజినీరింగ్-57, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-75, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్-214 మంది అర్హత సాధించారు.
బ్రాంచ్‌లవారీగా టాపర్లు వీరే..
➥ సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో సుమిత్ కుమార్ టాపర్‌గా నిలిచాడు. రెండు, మూడు ర్యాంకుల్లో సాహిల్ రాతూరి, దేవ్‌రాజ్ సింగ్ మార్కో నిలిచారు.
మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో పటేల్ నితీశ్ రాజేంద్రప్రసాద్ టాపర్‌గా నిలిచాడు. రెండు, మూడు ర్యాంకుల్లో మానస్ మారల్ మిశ్రా, దీపాన్షు గుప్తా నిలిచారు.
➥ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో పటేల్ నితీశ్ రాజేంద్రప్రసాద్ టాపర్‌గా నిలిచాడు. రెండు, మూడు ర్యాంకుల్లో మానస్ మారల్ మిశ్రా, దీపాన్షు గుప్తా నిలిచారు.
➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో ఆయుశ్ శర్మ టాపర్‌గా నిలిచాడు. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో సత్యం చంద్రకాంత్ ఖైర్నర్, దుంప అచ్యుత సాయిరామ్ రెడ్డి నిలిచారు.
➥ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో అమిత్ కుమార్ జైశ్వాల్ టాపర్‌గా నిలిచాడు. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఖేతని గున్నిది గోవింద్, బగాడే గిరిశ్ రవీంద్ర నిలిచారు.
దేశవ్యాప్తంగా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 6న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 167 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 6 నుంచి 26 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫిబ్రవరి 18న ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. స్టేజ్-1(ప్రిలిమినరీ) ఎగ్జామ్, స్టేజ్-2(మెయిన్) ఎగ్జామ్, స్టేజ్-3(పర్సనాలిటీ టెస్ట్), మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు..
* ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024
పోస్టుల సంఖ్య: 167 (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్).
సంస్థలు: ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా, బోర్డర్ రోడ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్, ఎంఈఎస్ సర్వేయర్ క్యాడర్, నావెల్ అర్మామెంట్ సర్వీసెస్, జూనియర్ టెలికమ్ ఆఫీసర్ (టెలికమ్ సర్వీసెస్).
విద్యార్హతలు: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ డిగ్రీ/ రేడియో రెగ్యులేటరీ సర్వీసెస్‌లో పోస్టులకు ఫిజిక్స్ లేదా రేడియో ఫిజిక్స్/ వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.