అన్వేషించండి

UGC NET 2022 నోటిఫికేషన్ విడుదల, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం - ఇలా ఈజీగా అప్లై చేసుకోండి

UGC NET 2022 Application Process Begins: జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కోసం నిర్వహించే యూజీసీ నెట్ 2022 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

UGC NET 2022 Notification Released: పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (Junior Research Fellowship), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (Assistant Professor)గా వర్క్ చేయడానికి నిర్వహించే క్వాలిఫికేషన్ ఎంట్రన్స్ యూజీసీ నెట్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ జాతీయ అర్హత పరీక్ష (UGC NET 2022) ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇందులో క్వాలిఫై అయ్యే అభ్యర్థులు మొత్తం 82 సబ్జెక్టులలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేసేందుకు అర్హత సాధిస్తారు. 

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జేఆర్‌ఎఫ్‌కు ప్రతి ఏడాది రెండు సార్లు  ఈ యూజీసీ నెట్‌ నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఇటీవల ఒకట్రెండు పర్యాయాలు ఆలస్యంగా నిర్వహించారు. తద్వారా డిసెంబర్ 2021, జూన్ 2022 ఎంట్రన్స్‌ను కలిపి ఒకేసారి నిర్వహించనున్నారు.  ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ (UGC NET 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12  గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. యూజీసీ నెట్ 2022కు అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

యూజీసీ అధికారిక వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి

పరీక్ష ఫీజు వివరాలు..
జనరల్ అభ్యర్థులకు ఫీజు రూ.1,100
జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్తులు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ రూ. 550
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, థర్డ్ జెండర్ అభ్యర్థులకు ఫీజు రూ.275

ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ప్రారంభం - ఏప్రిల్ 30, 2022
అప్లికేషన్ చివరి తేదీ - మే 20, 2022 సాయంత్రం 5 గంటల వరకు
ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ - మే 20, 2022 రాత్రి 11:50 గంటలు
అప్లికేషన్ ఫారమ్‌లో కరెక్షన్ తేదీలు - మే 21, 2022 నుంచి మే 23, 2022
హాల్ టికెట్ల విడుదల, ఎగ్జామ్ డేట్స్‌పై త్వరలోనే వివరాలు అందించనుంది ఎన్‌టీఏ.

యూజీసీ నెట్ 2022 అప్లికేషన్ ప్రాసెస్ ఇదే (UGC NET 2022 Application Process)

  • మొదట  యూజీసీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి
  • హోం పేజీలో కనిపించే యూజీసీ నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 (UGC NET December 2021 & June 2022) లింక్ మీద క్లిక్ చేయండి
  • అభ్యర్థులు న్యూ రిజిస్ట్రేషన్ (New Registration) మీద క్లిక్ చేసి మొదటగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
  • రిజిస్టర్ అయిన తరువాత అభ్యర్థులు Application Number, Password ఎంటర్ చేసి, కింద కనిపించే సెక్యూరిటీ పిన్ నమోదు చేసి సైన్ ఇన్ అవ్వాలి. 
  • మీ వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫారమ్ నింపాలి. ఆపై అభ్యర్థులు క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఏదైనా విధానంలో ఫీజు చెల్లించాలి

హాల్ టికెట్ వివరాలపైగానీ, పరీక్ష తేదీలపైగానీ యూజీసీ ఎలాంట్ అప్‌డేట్ ఇవ్వలేదు.

Also Read: HPCL Recruitment 2022 : హెచ్‌పీసీఎల్‌ విశాఖ రిఫైనరీలో 186 ఉద్యోగాలు, ఇలా అప్లై చేసేయండి.

Also Read : TS Police Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, తెలంగాణ పోలీస్ శాఖలో మరో రెండు నోటిఫికేషన్లు జారీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget