అన్వేషించండి

TS Police Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, తెలంగాణ పోలీస్ శాఖలో మరో రెండు నోటిఫికేషన్లు జారీ

TS Police Notifications: తెలంగాణ పోలీస్ శాఖలో మరో రెండు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. పోలీస్ రవాణా, ఎక్సైజ్ శాఖలో 677 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

TS Police Notifications: తెలంగాణలో ప్రభుత్వం ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. తాజాగా మరో రెండు కేటగిరీల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయింది. పోలీసు ఎక్సైజ్, రవాణా విభాగంలో 677 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంట్లో ఎక్సైజ్‌ శాఖలో 614 పోస్టులు, పోలీసు రవాణా విభాగంలో 63 కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్లైన్లో మే 2 నుంచి 20 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే పోలీసుశాఖతో కానిస్టేబుల్, ఎస్సైలకు సంబంధించి 16,614 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటితో కలిపి పోలీస్ శాఖలో నాలుగు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు www.tslprb.in వెబ్‌సైట్‌ ద్వారా మే 2 నుంచి 20వ వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. పోలీస్ ఉద్యోగాలకు మూడేళ్ల గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం సడలించింది. 

ఎస్సై పోస్టులకు అర్హతలు 

జులై 1వ తేదీ 2022 నాటికి 21 ఏళ్లు నిండి, 25 ఏళ్లు దాటకూడదు. అంటే 1997 జులై 2 కన్నా ముందు, 2001 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు. ఎస్సై పోస్టులకు గరిష్ఠ వయో పరిమితిలో 3 ఏళ్ల సడలించారు. గుర్తింపు పొందిన  యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సైతోపాటు స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, డిప్యూటీ జైలర్‌ ఉద్యోగాలకు ఓసీ, బీసీ స్థానిక అభ్యర్థులు రూ. వెయ్యి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. స్థానిక ఎస్సీ, ఎస్టీలు రూ.500, స్థానికేతరులు దరఖాస్తు రుసుం రూ.1000 చెల్లించాలి. 

కానిస్టేబుల్‌ పోస్టులకు అర్హతలు 

2022 జులై 1వ తేదీకి 18 ఏళ్లు పూర్తయి 22 ఏళ్లు దాటకూడదు. అలాగే 2000 జులై 2 కన్నా ముందు 2004 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు. హోంగార్డులు అయితే కనీసం 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి. గరిష్ఠంగా 40 ఏళ్లు దాటకూడదు. మహిళా కానిస్టేబుల్‌ (Civil, AR), మహిళా వార్డర్లకు మినహాయింపులు ఉన్నాయి. వితంతువులు, భర్త నుంచి విడాకులు పొంది, మళ్లీ వివాహం చేసుకోని వారిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 18 ఏళ్లు నిండి, గరిష్ఠంగా 40 ఏళ్లు మించకూడదు. ఇతర అన్ని కులాల్లో 18-35 మధ్య వయసు గలవారు అర్హులు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్‌ విద్యార్హత.  ఓసీ, బీసీ కులాలకు చెందిన స్థానిక అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీలు రూ.400, స్థానికేతరులు రూ.800 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

తెలంగాణ ప్రభుత్వం కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లికేషన్లు ఆహ్వానించింది. అభ్యర్థులు మే నెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • పోలీస్ కానిస్టేబుల్(సివిల్) -   పే స్కేల్ రూ. 24280- రూ.72850   - ఖాళీలు 4965 
  • పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) - రూ.24280-రూ.72850                       - ఖాళీలు 4423 
  • పోలీస్ కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్)(పురుషులు) - రూ.24280-72850    - ఖాళీలు 100 
  • పోలీస్ కానిస్టేబుల్ (టీఎస్ఎస్పీ)(పురుషులు) - రూ.24280-72850 - ఖాళీలు 5010 
  • పోలీస్ కానిస్టేబుల్ (తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) - రూ.24280-72850 - ఖాళీలు 390 
  • స్టేట్ డిజాస్టర్ రెస్ఫాన్స్ & ఫైర్ సర్వీస్ లో  ఫైర్ మెన్ - రూ.24280-72850 - ఖాళీలు 610 
  • జైలు, ఇతర సర్వీసుల్లో (వార్డర్) (పురుషులు)- రూ.24280-72850 -ఖాళీలు 136 
  • జైలు, ఇతర సర్వీసుల్లో (వార్డర్) (స్త్రీలు)- రూ.24280-72850 - ఖాళీలు 10 
     
    ఫీజు వివరాలు 

స్థానిక ఓసీ, బీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 800 
స్థానిక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు -రూ.400 
ఇతర అభ్యర్థులు - రూ. 800 
ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ 

587 ఎస్సై ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సై నోటిఫికేషన్ లో  414 సివిల్‌ ఎస్‌ఐలు, 66 ఏఆర్‌ఎస్‌ఐ, 5 రిజర్వ్‌ ఎస్‌ఐ, 23 టీఎస్‌ఎస్‌పీ ఎస్‌ఐ, 12 ఎస్‌పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. విపత్తు, అగ్నిమాపక శాఖలోనూ 26 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు, 8 డిప్యూటీ జైలర్‌ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 

ఫీజు వివరాలు 

స్థానిక ఓసీ, బీసీ అభ్యర్థుల దరఖాస్తు ఫీజు - రూ. 1000 
స్థానిక ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు - రూ. 500 
ఇతరులు - రూ. 1000  

 

టాప్ హెడ్ లైన్స్

TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
Embed widget