TS RTC: ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్, 813 మందికి ఉద్యోగాలు
Jobs In TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పదేళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.813 కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Telangana RTC Compassionate Appointments: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో పదేళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీలో కండక్టర్ల కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్టర్లుగా తీసుకోనుంది. ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులు ఇవ్వాలని మంత్రి పొన్నం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆర్టీసీలోని 11 రీజియన్ల నుంచి మొత్తం 813 కండక్టర్ పోస్టులను కారుణ్య నియామకాల కింద ప్రభుత్వం భర్తీ చేయనున్నది. పెండింగ్‌లో ఉన్న నియామకాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఈ నిర్ణయంతో న్యాయం జరగనుందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి వివరించారు.
బ్రెడ్ విన్నర్ (కారుణ్య నియామకాలు), మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ స్కీమ్ కింద ఉద్యోగుల జీవిత భాగస్వామి లేదా వారి పిల్లలకు ప్రత్యామ్నాయ ఉపాధిని అందించడానికి వారి విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో విధి నిర్వహణలో ఉండగా మరణించిన సిబ్బంది కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది.
ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద హైదరాబాద్ రీజియన్ పరిధిలో 66, సికింద్రాబాద్ 126, రంగారెడ్డి 52, నల్గొండ 56, మహబూబ్ నగర్ 83, మెదక్ 93, వరంగల్ 99, ఖమ్మం 53, అదిలాబాద్ 71, నిజామాబాద్ 69, కరీంనగర్ రీజియన్‌లో 45.. మొత్తం 813 కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే.. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కండక్టర్ నియామకాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.
ALSO READ:
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాల ఆమోదం - ఉద్యోగ నోటిఫికేషన్లకు లైన్ క్లియర్
టీఎస్‌పీఎస్సీ (TSPSC) చైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలను(Resignations) గవర్నర్ తమిళి(Governor Tamilisai)సై బుధవారం ఆమోదించారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదిస్తే.. కొత్త బోర్డును ఏర్పాటు చేసి.. ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటోంది. ఈ క్రమంలో చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యులు డిసెంబర్ లో రాజీనామాలు సమర్పించిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అడిగిన గవర్నర్.. దీంతో పాటు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. గత చైర్మన్ , బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని గవర్నర్ సూచించారు.పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం వారి రాజీనామాలను ఆమోదించినట్లు పేర్కొన్నారు. కొత్త ఛైర్మన్, సభ్యుల నియామకానికి గవర్నర్ అనుమతించారు. నిన్న (మంగళవారం) సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరి రాజీనామాలను ఆమోదించడానికి తమకు అభ్యంతరం లేదని లేఖ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..