అన్వేషించండి

TSPSC Group 2 Notification: 'గ్రూప్-2' నోటిఫికేషన్ వచ్చేస్తోంది! ఆ వెంటనే 'గ్రూప్-3' ప్రకటన? పోస్టుల వివరాలు ఇలా!

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ మరో వారంలో వెలువడే అవకాశం ఉంది. తర్వాత వారం నుంచి రెండు వారాల వ్యవధిలో గ్రూప్ -3 నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ మరో వారంలో వెలువడే అవకాశం ఉంది. తర్వాత వారం నుంచి రెండు వారాల వ్యవధిలో గ్రూప్ -3 నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. గ్రూప్ -2లో భాగంగా 726 ఉద్యోగాలు, గ్రూప్ -3లో 1,373 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. గతంలో గ్రూప్-2లో 663 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వగా.. తాజా చేర్పుల అనంతరం ఆ సంఖ్య 726కు చేరింది. ప్రభుత్వం గ్రూప్-2లో మరో 6 రకాల పోస్టులు రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఎఎస్‌ఒ, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులును చేర్చింది.

అలాగే గ్రూప్ -3లో గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్, హెచ్‌ఒడిల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను చేర్చింది. గతంలో ప్రభుత్వం ప్రభుత్వం అనుమతించిన పోస్టులకు అదనంగా తాజాగా అనుమతించిన పోస్టులను కలిపి కమిషన్ ప్రకటనలు జారీ చేయనున్నది. కొత్తగా అనుమతించిన పోస్టులకు సంబంధించి ప్రభుత్వ విభాగాల నుంచి కమిషన్‌కు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి. అదనంగా చేర్చినవాటితో కలిపి త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టిఎస్‌పిఎస్‌సి కసరత్తు చేస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మేరకు.. వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేస్తుండడంతో నియామక సంస్థలు సైతం ఆ మేరకు వేగాన్ని అందిపుచ్చుకుంటూ ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2 కేటగిరీ ఉద్యోగాల భర్తీకి వారం రోజుల్లోనే ప్రకటన విడుదల చేయనుంది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసింది. 

పోస్టుల స్థాయి మార్పుతోనే ఆలస్యం..
ఎస్సీ అభివృద్ధి శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని సహాయ సెక్షన్‌ అధికారి పోస్టులు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జువైనల్‌ సరీ్వసు జిల్లా ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లోని అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు గ్రూప్‌–2 కేటగిరీలోకి చేరాయి. ప్రస్తుతం ఈ కేటగిరీల్లోని పోస్టులు 120కి పైగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన పోస్టులకు స్థాయి మార్పుతో జత అయిన పోస్టులన్నీ కలిపి ఒకేసారి ప్రకటన జారీ చేసే క్రమంలో నోటిఫికేషన్‌ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. 

మే లోగా 'గ్రూప్‌–1' మెయిన్స్‌..
గ్రూప్‌–1 ఉద్యోగ నియామకాల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటివరకు గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి ఫలితాలను వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ అతి త్వరలో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. గ్రూప్‌–1 కేటగిరీలో 503 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. అదే నెల చివరి వారంలో పరీక్ష కీ విడుదల చేసిన కమిషన్‌.. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు వేగవంతం చేసింది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌ పరీక్షలకు ఎంపిక చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. మల్టీజోన్లు, రిజర్వేషన్‌ కేటగిరీల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండడంతో ఈ ప్రక్రియలొ కొంత జాప్యం జరిగినట్లు కనిపిస్తోంది. మొత్తానికి వారం లేదా పది రోజుల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసి వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని కమిషన్‌ వర్గాలు యోచిస్తున్నాయి.

ఇప్పటికే గ్రూప్ 4, జేఎల్ పోస్టులకు నోటిఫికేషన్లు..
రాష్ట్రంలో ఇప్పటికే 9,168 గ్రూప్- 4 పోస్టులు, 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ 4 ఉద్యోగాలకు డిసెంబరు 23 నుంచి జనవరి 12 వరకు, జేఎల్ పోస్టులకు డిసెంబరు 20 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. అలాగే రాష్ట్రంలో 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు, 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, భూగర్భ జలవనరుల శాఖలో 57 పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది. వీటి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

Also Read:

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల తుది జాబితా విడుదల, ఇక్కడ చెక్ చేసుకోండి!

డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget