News
News
X

CAS Selection List: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల తుది జాబితా విడుదల, ఇక్కడ చెక్ చేసుకోండి!

మొత్తం 4,800 దరఖాస్తులు రాగా వాటిలో రెండో విడతలో 1,860 మంది అర్హులను ఎంపిక చేశారు. వీరిలో దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ విడుదల చేసింది. 

FOLLOW US: 
Share:

ప్రజారోగ్య సంచాలకులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగాల్లో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఎంపిక జాబితాను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఎంపిక జాబితాను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ చూసుకోవచ్చు.

మొత్తం 4,800 దరఖాస్తులు రాగా వాటిలో రెండో విడతలో 1,860 మంది అర్హులను ఎంపిక చేశారు. వీరిలో దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది అర్హులను గుర్తించారు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను డిసెంబరు 19న వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) విడుదల చేసింది. 

ఎంపిక జాబితా కోసం క్లిక్ చేయండి..

వైద్యుల జాబితా విడుదల అనంతరం ప్రజారోగ్య సంచాలకుల ఆధ్వర్యంలో వచ్చే వారం రోజుల్లో కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు. కొత్తగా 969 మంది వైద్యుల రాకతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. 

సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియ పూర్తికానుండడంతో ఇక 1,147 సహాయ ఆచార్యుల భర్తీపై దృష్టి పెట్టనున్నట్లు ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వర్గాలు తెలిపాయి. ఈ పోస్టులకు డిసెంబరు 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ భర్తీ ప్రక్రియ ఒక దశకు చేరుకున్నాక నర్సుల పోస్టుల భర్తీపై ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Also Read:

పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్  విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజుమాత్రం చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబర్ 8న నోటిఫికేషన్ (నెం.21/2022) వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిసెంబర్ 16న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. బీఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సైన్స్/ఫార్మా-డి (లేదా) గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి మెడిసిన్ (క్లినికల్ ఫార్మకాలజి/మైక్రోబయాలజి) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 19 Dec 2022 07:32 PM (IST) Tags: Civil Assistant Surgeon Selection List CAS Recruitment 2022 CAS Final Selection List Civil Assistant Surgeon Result TS MHSRB CAS Result

సంబంధిత కథనాలు

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

AP JOBS: ఏపీ శ్రీకాకుళంలో 60 ఉద్యోగాలు, అర్హతలివే!

AP JOBS: ఏపీ శ్రీకాకుళంలో 60 ఉద్యోగాలు, అర్హతలివే!

IITTM Jobs: ఐఐటీటీఎం-  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు, అర్హతలివే!

IITTM Jobs: ఐఐటీటీఎం-  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు, అర్హతలివే!

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?

Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?