అన్వేషించండి

TGPSC Group-1 Prelims: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, ప్రిలిమ్స్ హాల్‌టిక్కెట్లు వచ్చేస్తున్నాయ్! పరీక్ష ఎప్పుడంటే?

TGPSC: తెలంగాణలో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.

TGPSC Group1 Prelims Exam: తెలంగాణలో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ (TGPSC) ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు జూన్ 1 నుంచి పరీక్ష తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ మే 23న ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థుల సౌకర్యం కోసం పరీక్షకు సంబంధించిన నియమ నిబంధనలు, OMR షీట్ నమూనాపత్రాలను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్‌ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న సంగతి తెలిసిందే. 

TGPSC Group-1 Prelims: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, ప్రిలిమ్స్ హాల్‌టిక్కెట్లు వచ్చేస్తున్నాయ్! పరీక్ష ఎప్పుడంటే?

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), 900 మార్కులకు మెయిన్ (6 పేపర్లు) పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. ఇక మెయిన్ పరీక్షలో 150 మార్కులకు జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష నిర్వహిస్తారు. 

TSPSC Group 1 Notification: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల - పోస్టులు, అర్హతలు, పరీక్ష వివరాలు ఇలా

ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: ఆసిఫాబాద్-కొమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి-యాదాద్రి, జనగాం, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్.

మెయిన్ పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ.

గ్రూప్-1 అభ్యర్థులకు సూచనలు.. (Instructions to Group1 candidates)

➥ అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ కార్డు/పాన్ కార్డు లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపుకార్డులు తీసుకురావాలి. 

➥ పరీక్ష సమయానికి అరగంట ముందుగానే అభ్యర్థులు తమకు కేటాయించిన సెంటర్లకు చేరుకోవాలి. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులకు లోపలికి అనుమతిస్తారు. ఉదయం 10 గంటలకు గేట్లను మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమితించరు. ఉదయం 9.30 గంటల నుంచే అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తారు.

➥ హాల్‌టికెట్ మీద ఫొటో సరిగాలేనివారు తప్పనిసరిగా మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

➥ పరీక్ష కేంద్రంలోకి వాచీలు, బ్లూటూత్ డివైజ్‌లు, కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, రైటింగ్ పాడ్, నోట్స్, చార్టులు, ఆభరణాలు, హ్యాండ్ బ్యాగ్‌లు, పర్సులు అనుమతించబోరు. 

➥ అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి. షూ ధరించకూడదు. 

➥ బ్లాక్ లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలి. 

➥ జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్ గుర్తించదు. 

➥ ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో సక్రమంగా బబ్లింగ్ చేయాలి. 

➥ సరైన వివరాలు బబ్లింగ్ చేయని, పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్ ఉపయోగించిన, డబుల్ బబ్లింగ్ చేసిన, వైట్నర్, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్ చేసే పత్రాలు చెల్లుబాటు కావు. 

➥ ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేస్తే, దానికి బదులుగా కొత్తది ఇవ్వరు.

➥ ఎవరైనా అభ్యర్థులు అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తారని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. 

TGPSC Group-1 Prelims: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, ప్రిలిమ్స్ హాల్‌టిక్కెట్లు వచ్చేస్తున్నాయ్! పరీక్ష ఎప్పుడంటే?TGPSC Group-1 Prelims: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, ప్రిలిమ్స్ హాల్‌టిక్కెట్లు వచ్చేస్తున్నాయ్! పరీక్ష ఎప్పుడంటే?

OMR జవాబు పత్రం నమూనా..

TGPSC Group-1 Prelims: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, ప్రిలిమ్స్ హాల్‌టిక్కెట్లు వచ్చేస్తున్నాయ్! పరీక్ష ఎప్పుడంటే?TGPSC Group-1 Prelims: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, ప్రిలిమ్స్ హాల్‌టిక్కెట్లు వచ్చేస్తున్నాయ్! పరీక్ష ఎప్పుడంటే?

గ్రూప్-1 పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Mithun Reddy in AP Liquor Scam: లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
ఏపీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
Smita Sabharwal: నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
Janhvi Kapoor: 'అబ్బాయిలకు అలా జరిగితే అణుయుద్ధమే' - పీరియడ్ పెయిన్‌పై నటి జాన్వీ కపూర్ కామెంట్స్
'అబ్బాయిలకు అలా జరిగితే అణుయుద్ధమే' - పీరియడ్ పెయిన్‌పై నటి జాన్వీ కపూర్ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB Loss in Chinna Swamy Stadium | ఆర్సీబీకి విజయాలను అందించలేకపోతున్న చిన్నస్వామి స్టేడియంPBKS Great Victories in IPL 2025 | ఊహించని రీతిలో విజయాలు సాధిస్తున్న పంజాబ్ కింగ్స్Trolls on RCB for Crossing 49 Runs | జర్రుంటే సచ్చిపోయేవాళ్లు..ఓ రేంజ్ లో RCB కి ట్రోల్స్Tim David 50* vs PBKS IPL 2025 | పీకల్లోతు కష్టాల్లో నుంచి RCB ని బయటపడేసిన టిమ్ డేవిడ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Mithun Reddy in AP Liquor Scam: లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
ఏపీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
Smita Sabharwal: నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
Janhvi Kapoor: 'అబ్బాయిలకు అలా జరిగితే అణుయుద్ధమే' - పీరియడ్ పెయిన్‌పై నటి జాన్వీ కపూర్ కామెంట్స్
'అబ్బాయిలకు అలా జరిగితే అణుయుద్ధమే' - పీరియడ్ పెయిన్‌పై నటి జాన్వీ కపూర్ కామెంట్స్
GVMC Mayor Voting: విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
Hydra : టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
Viral News: కమలానికి ఓటు వేయకపోతే కుక్కలు, పిల్లులుగా పుడతారు- బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
కమలానికి ఓటు వేయకపోతే కుక్కలు, పిల్లులుగా పుడతారు- బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
TG Inter Results 2025: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్ - రిజల్ట్స్ ఎప్పుడంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్ - రిజల్ట్స్ ఎప్పుడంటే?
Embed widget