అన్వేషించండి

TSPSC Group 4 Application: గుడ్ న్యూస్, 'గ్రూప్‌-4' దరఖాస్తులు షురూ, అప్లికేషన్ లింక్ ఇదే! ఈ తేదీలోగా అప్లయ్ చేసుకోవాలి!

గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 30న రాత్రి 11.45 గంటలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు జనవరి 19 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు

రాష్ట్రంలోని మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చేఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 30న రాత్రి 11.45 గంటలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వాస్తవానికి డిసెంబరు 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల వారంపాటు వాయిదావేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు జనవరి 19 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. 

గ్రూప్-4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి. వీటిలో కేటగిరీ-1లో జూనియర్ అకౌంటెంట్-429 పోస్టులు, కేటగిరీ-2లో జూనియర్ అసిస్టెంట్-6,859 పోస్టులు, కేటగిరీ-3లో జూనియర్ ఆడిటర్-18 పోస్టులు, వార్డు ఆఫీసర్-1,862 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూశాఖ పరిధిలో 2,077 పోస్టులు ఉండగా.. వీటిలో సీసీఎల్ఏ పరిధిలో 1,294 ఉన్నాయి. సాధారణ, సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులున్నాయి. 

Online Application 

పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం..
గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. కనీసం 6-7 లక్షల మధ్యలో రావొచ్చని అంచనా వేస్తోంది. 2018లో రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్ఓ ఉద్యోగాలకు దాదాపు 10 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. పరీక్షకు 76 శాతం మంది హాజరయ్యారు. గ్రూప్-4 కేటగిరీలో 2 వేల లోపు పోస్టులతో ప్రకటన వెలువడినప్పుడు 4.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రస్తుతం ఏకంగా 9,168 పోస్టులు ఉండటంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి.

పోస్టుల వివరాలు... 

మొత్తం ఖాళీల సంఖ్య: 9168

1) జూనియర్ అకౌంటెంట్: 429 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు: ఆర్థికశాఖ - 191, మున్సిపల్ శాఖ - 238

2) జూనియర్ అసిస్టెంట్: 6,859 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు:

వ్యవసాయశాఖ-44 బీసీ సంక్షేమశాఖ-307 పౌరసరఫరాల శాఖ-72 అటవీశాఖ-23
వైద్యారోగ్యశాఖ-338 ఉన్నత విద్యాశాఖ-742 హోంశాఖ-133 నీటిపారుదల శాఖ-51
మైనార్టీ సంక్షేమశాఖ-191 పురపాలక శాఖ-601 పంచాయతీరాజ్-1,245 రెవెన్యూశాఖ-2,077
సెకండరీ విద్యాశాఖ-97 రవాణాశాఖ-20 గిరిజన సంక్షేమ శాఖ-221 మహిళా, శిశు సంక్షేమం-18
ఆర్థికశాఖ-46 కార్మికశాఖ-128 ఎస్సీ అభివృద్ధి శాఖ-474 యువజన సర్వీసులు-13

3) జూనియర్ ఆడిటర్: 18 పోస్టులు

విభాగం: డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్.

4) వార్డ్ ఆఫీసర్: 1862 పోస్టులు

విభాగం: కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.

Also Read:

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో ఖాళీల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ&బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
పోస్టుల వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ వచ్చేసింది, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 30న గ్రూప్-3 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభంకానుంది. పోస్టుల అర్హతలు, ఇతర వివరాలను జనవరి 24 నుంచే పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల పూర్తి వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా శుభవార్త తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Driver Operator Jobs: ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC Job Notifications: ఏపీలో కొలువుల జాతర.. 892 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
ఏపీలో కొలువుల జాతర.. 892 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Driver Operator Jobs: ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
Melbourne Accident: ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
KCR 2004 election affidavit: కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
KCR Erravalli Farmhouse: ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
KTR counter to Revanth Reddy: కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
West Bengal: అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
Disha Salian death case 2026: సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
Embed widget