అన్వేషించండి

VAS Results: తెలంగాణలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఫలితాలు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

Telangana Jobs: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాత పరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

TSPSC VAS Results: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (Veterinary Assistant Surgeon) పోస్టుల రాత పరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్‌-ఎ, క్లాస్-బి) పరీక్షకు హాజరైన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను అందుబాటులో ఉంచారు. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలన (Certificate Verification) చేపట్టనున్నారు. ఫలితాలకు సంబంధించి క్లాస్-ఎ విభాగంలో 786 మంది అభ్యర్థులు, క్లాస్-బి విభాగంలో 101 మంది అభ్యర్థుల మార్కుల జాబితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.  

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ) జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బి) జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో ఖాళీల భర్తీకీ 2022, డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ&బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో క్లాస్-ఎ విభాగంలో 170 పోస్టులు, క్లాస్-బి విభాగంలో 15 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 – రూ.1,33,630  జీతంగా ఇస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 13, 14 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించారు. జులై 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్షలు జరిగాయి.

పరీక్ష విధానం: 
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (వెటర్నరీ సైన్స్-డిగ్రీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నలకు 2 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.

ALSO READ:

TSPSC 'గ్రూప్-1' దరఖాస్తుల సవరణ ప్రారంభం - ఎప్పటివరకు అవకాశమంటే?
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు వివరాల్లో తప్పుల సవరణ ప్రక్రియ మార్చి 23న ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక లింక్‌ను టీఎస్‌పీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు మార్చి 27న సాయంత్రం 5 గంటల్లోగా వివరాలు మార్చుకోవచ్చు. వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ వివరాలు ఎడిట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిల్‌ లేదా నేరుగా వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోరు. సవరించిన అంశాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పీడీఎఫ్‌ ఫార్మట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఒక్కసారి వివరాలు సవరించుకున్న తర్వాత అభ్యర్థులు క్షుణ్నంగా పరిశీలించుకోవాలి. సమర్పించిన తర్వాత మరోసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు. అభ్యర్థులు తమ పేరు, పుట్టినతేదీ, జెండర్, విద్యార్హతలు, ఫోటో, సంతకం తదితర వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చు. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 
వివరాల్లో మార్పు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
TG TET 2026 Results: తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget