అన్వేషించండి

TSPSC Group 1 2022: గ్రూప్ 1 అభ్యర్థులకు ఇక నో ఛాన్స్, మీ తప్పులు దిద్దుకోలేరు

గ్రూప్ 1 అభ్యర్థులు తమ అప్లికేషన్లు ఎడిట్ చేసుకుందుకు టీఎస్పీఎస్సీ ఇటీవల ఒక అవకాశం ఇచ్చింది. ఈ గడువు ఇవాళ్టితో ముగిసింది.

Telangana Group-I : తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 అభ్యర్థులకు ఇచ్చిన చివరి అవకాశం ముగిసింది. దరఖాస్తులలో తప్పిదాలు సవరించుకునేందుకు, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) వివరాలు అప్ డేట్ చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఇచ్చిన చివరి అవకాశం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ 503 గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానించింది. ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. తొలిసారి ఈ గడువు జూన్ తొలి వారంలోనే ముగిసింది.

తుది అవకాశం ముగిసింది 

గ్రూప్ 1 అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులు సరి చేసుకునేందుకు మరో ఛాన్స్ ఇవ్వాలని, ఓటీఆర్ అప్ డేట్ కోసం సైతం మరోసారి అవకాశం ఇవ్వాలని కోరడంతో టీఎస్‌పీఎస్సీ అందుకు అంగీకరించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. గ్రూప్-1 అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా అప్లికేషన్లను ఎడిట్‌ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. జూలై 19 ఉదయం 8 గంటల నుంచి అప్లికేషన్ ఎడిట్, ఓటీఆర్ అప్ డేట్ ప్రారంభం కాగా, జూలై 21 సాయంత్రం 5 గంటలతో అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన చివరి గడువు ముగిసింది. కొందరు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 

అక్టోబర్ 16న ప్రిలిమ్స్ 

తెలంగాణలో నిర్వహించనున్న తొలి గ్రూప్‌-1 పోస్టుల ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ఖరారు చేసింది. అక్టోబరు 16వ తేదీన టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సాధారణంగా గ్రూప్ -1 జాబ్ అంటే జిల్లాలోని పలు విభాగాలలో అత్యున్నత స్థాయి పోస్టులు ఉంటాయి కనుక కాంపిటీషన్ అధికంగా ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ పోస్టులు సాధిస్తే భవిష్యత్తులో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడతారు. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సైతం గ్రూప్ 1 ఉద్యోగాలకు భారీగా దరఖాస్తు చేసుకుంటారు. 

మొత్తం 503 గ్రూప్ 1 పోస్టులు 

తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్ లో మొత్తం 503 పోస్టులు ఉన్నాయి. ఇందులో 225 మహిళలకు రిజర్వ్ చేశారు. జూన్‌ 4 నాటికి మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఒక్కోపోస్టుకు సరాసరి 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశముందని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. ఈసారి గ్రూప్ -1 పోస్టులుకు 51,553 మంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

SSC Results 2026: పదతరగతి ఫెయిల్ అయినా పిలిచి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు! పూర్తి వివరాలు ఇవే!
పదతరగతి ఫెయిల్ అయినా పిలిచి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు! పూర్తి వివరాలు ఇవే!
Oracle layoffs: ఇప్పుడు ఒరాకిల్ వంతు - 20వేల మంది సీనియర్లకు ఊస్టింగ్ - ఏఐ మింగేస్తోంది!
ఇప్పుడు ఒరాకిల్ వంతు - 20వేల మంది సీనియర్లకు ఊస్టింగ్ - ఏఐ మింగేస్తోంది!
8th Pay Commission: కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?
కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?
Infosys Jobs: ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. 20000 మందిని రిక్రూట్ చేస్తామని ప్రకటన
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. 20000 మందిని రిక్రూట్ చేస్తామని ప్రకటన

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GST collections: ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
CM alcohol test: సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
First Barrier-Free Toll System in Inida: హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
Peddi Release Date : పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
Jetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
Nara Rohith : నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
Affordable Mileage Bikes: మంచి మైలేజీ ఇస్తూ బడ్జెట్‌లో వచ్చే బైక్‌లు ఇవే! ధర, ఫీచర్స్‌ గురించి తెలుసుకోండి!
మంచి మైలేజీ ఇస్తూ బడ్జెట్‌లో వచ్చే బైక్‌లు ఇవే! ధర, ఫీచర్స్‌ గురించి తెలుసుకోండి!
Patriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?
మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?
Embed widget