అన్వేషించండి

TSPSC: ఈవో పోస్టుల దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం, ఈ తేదీల్లో చేసుకోండి!

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకోవడానికి టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులు నవంబరు 10 నుంచి 12 వరకు దరఖాస్తు వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు. 

తెలంగాణ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆగస్టు 27న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకోవడానికి టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులు నవంబరు 10 నుంచి 12 వరకు దరఖాస్తు వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు. 

ఒకేసారి అవకాశం..

⏩దరఖాస్తుల సవరణకు ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పిస్తారు. అందుకే తమ వివరాలను సవరించుకోవాలనుకునే అభ్యర్థులు జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది.

⏩ అభ్యర్థులు తమ బయోడేటా వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలి. తప్పుగా నమోదుచేసిన వివరాలను గుర్తించాలి.

⏩ వివరాలను సరిచేసుకున్నాక, దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

⏩ దరఖాస్తు వివరాల్లో 'అన్-ఎంప్లాయ్' నుంచి 'ఎంప్లాయ్' గా మార్పుచేసుకునేవారు పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు.

⏩ బయోడేటా వివరాలను మార్చుకునే అభ్యర్థులు పేరు, జెండర్, పుట్టినతేది వివరాలకు సంబంధించిన సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

⏩ అభ్యర్థులు నవంబరు 10న ఉదయం 10 గంటల నుంచి నవంబరు 12న సాయంత్ర 5 గంటల వరకు తమ వివరాలను మార్చుకోవచ్చు.

 

పోస్టుల వివరాలు..

* ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టులు

పోస్టుల సంఖ్య: 181 

జోన్లవారీగా ఖాళీలు: కాళేశ్వరం-26, బాసర-27, రాజన్న సిరిసిల్ల-29, భద్రాద్రి-26, యాదాద్రి-21, చార్మినార్-21, జోగుళాంబ-31.

విభాగం: ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (హోంసైన్స్/సోషల్ వర్క్/సోషియాలజీ/ఫుడ్ సైన్స్ & న్యూట్రీషన్/ ఫుడ్ & న్యూట్రీషన్/బోటనీ/జువాలజీ & కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ/అప్లైడ్ న్యూట్రీషన్ & పబ్లిక్ హెల్త్/ క్లినికల్ న్యూట్రీషన్ & డైటేటిక్స్/ ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్/బయోలాజికల్ కెమిస్ట్రీ/ఫుడ్ సైన్సెస్ & మేనేజ్‌మెంట్/ఫుడ్ టెక్నాలజీ & న్యూట్రీషన్/ఫుడ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్). మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.07.1978 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, NCC అభ్యర్థులు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ-బీసీ-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.280. ఇందులో రూ.200 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా, రూ.80 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. నిరుద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు...

నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

:: Also Read ::

ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వెల్లడి, 710 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రారంభం!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XII) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండుదశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 1 నుంచి నవంబరు 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

పోస్టాఫీసుల్లో 98 వేల ఉద్యోగాలు, ఖాళీల వివరాలివే!
దేశంలో భారీగా ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్టు తెరలెపింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 98,083 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రీజియన్ల వారీగా నోటిఫికేషన్లు విడుదల విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్లనున్నట్లు ప్రకటించింది. పోస్టాఫీసుల్లో పోస్ట్‌మ్యాన్, మెయిన్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.  
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
PV Sindhu Marriage Latest Photos: పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
Embed widget