అన్వేషించండి

TS DSC: టీఎస్‌ డీఎస్సీ దరఖాస్తుల్లో తప్పులున్నాయా? ఈ తేదీల్లో మార్చుకోవచ్చు

తెలంగాణలో డీఎస్సీ(టీఆర్‌టీ)-2023కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు వారు సమర్పించిన వివరాల్లో తప్పులుంటే సవరించుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.

TS DSC 2023 Application News:

తెలంగాణలో డీఎస్సీ(టీఆర్‌టీ)-2023కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు వారు సమర్పించిన వివరాల్లో తప్పులుంటే సవరించుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు నవంబర్‌ 1 నుంచి 5వ తేదీ వరకు ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుందని శాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తెలిపారు. 

మొత్తం 1,76,527 దరఖాస్తులు 
టీఆర్‌టీకి మొత్తం 1,76,527 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు గడువు అక్టోబర్‌ 28వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్‌జీటీ), పీఈటీ,  భాషా పండితులు, పలు మాధ్యమాల్లో మొత్తం 43 విభాగాల్లో 5,089 కొలువుల భర్తీకి విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించింది. అత్యధికంగా ఎస్‌జీటీ తెలుగు మాధ్యమం కోసం 60,190 దరఖాస్తులు అందాయి. వచ్చే ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది.

2 లక్షలు దాటని దరఖాస్తులు..
డీఎస్సీ దరఖాస్తులు ఈసారి కనీసం రెండు లక్షలు కూడా దాటకపోవడం గమనార్హం. అదే గతంలోనైతే డీఎస్సీ అంటే భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చేవి. కానీ ఈసారి 5,089 పోస్టులు మాత్రమే ఉండడంతోపాటు ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులకు అర్హత లేకపోవడం లాంటి కారణాలతో ఈసారి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య చాలా తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 7న నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఎస్‌జీటీ - 2,575 పోస్టులు; స్కూల్‌ అసిస్టెంట్‌ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 611 పోస్టులు, పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్​ జిల్లాలో 358, నిజామాబాద్​ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 

పోస్టులవారీగా అందిన దరఖాస్తుల వివరాలు..

➥ ఎస్‌జీటీ తెలుగు మీడియం - 60,190

➥ ఎస్‌జీటీ ఇంగ్లిష్ మీడియం - 2,735

➥ ఎస్‌జీటీ ఉర్దూ - 3,004

➥ స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్ తెలుగు మీడియం) - 27,872

➥ స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్ ఇంగ్లిష్ మీడియం) - 1,401

➥ స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్స్ తెలుగు మీడియం) - 22,531

➥ స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్స్ ఇంగ్లిష్ మీడియం) - 1,769

➥ స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం) - 12,610

➥ స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్ ఇంగ్లిష్ మీడియం) - 1,927

➥ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్సెస్ తెలుగు మీడియం) - 3,141

➥ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం) - 1,619

➥ స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) - 11,144

➥ స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) - 3,282

➥ స్కూల్ అసిస్టెంట్ (హిందీ) - 1,868

➥ లాంగ్వే్జ్ పండిట్ (తెలుగు)  -9,620

➥ లాంగ్వే్జ్ పండిట్ (హిందీ)  - 2,300

➥ లాంగ్వే్జ్ పండిట్ (ఉర్దూ)  - 328

➥ పీఈటీ (తెలుగు మీడియం) - 6,253

➥ ఇతర పోస్టులకు అందిన దరఖాస్తులు - 2933.

పరీక్ష స్వరూపం ఇలా..

➥ పరీక్షల తేదీలతోపాటు, పరీక్ష స్వరూపాన్ని కూడా విద్యాశాఖ వెల్లడించింది.  ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌, పీఈటీ పరీక్షలకు సంబంధించిన డిటైయిల్డ్‌ ఎగ్జామ్‌ ప్యాటర్న్‌ను విడుదల చేసింది. ఏయే సబ్జెక్టుల నుంచి ఎన్ని మార్కులు ఉంటాయనే వివరాలను తెలిపింది.

➥ ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 80 మార్కులు, 160 ప్రశ్నలకు గానూ పరీక్ష నిర్వహిస్తారు. మిగతా 20 మార్కులు టెట్‌లో వచ్చిన స్కోర్‌ను వెయిటేజీగా పరిగణిస్తారు. 

➥ పీఈటీ, పీఈడీ అభ్యర్థులకు మాత్రం 100 మార్కులు, 200 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉండనుంది. 

Notification

TS DSC 2023 Details

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget