By: ABP Desam | Updated at : 07 Apr 2023 12:56 AM (IST)
Edited By: omeprakash
గురుకుల లెక్చరర్ పోస్టులు
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 17 నుంచే ఉద్యోగాల పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉండనుంది.
వివరాలు..
* మొత్తం ఖాళీల సంఖ్య: 868
➥ డిగ్రీ లెక్చరర్స్: 785 పోస్టులు
సబ్జెక్టుల వారీగా ఖాళీలు: తెలుగు-55, ఇంగ్లిష్-69, మ్యాథమెటిక్స్-62, స్టాటిస్టిక్స్-58, ఫిజిక్స్-46, కెమిస్ట్రీ-69, బోటనీ-38, జువాలజీ-58, కంప్యూటర్ సైన్స్-99, జియోలజీ-06, బయోకెమిస్ట్రీ-03, బయోటెక్నాలజీ-02, హిస్టరీ-28, ఎకనామిక్స్-25, పొలిటికల్ సైన్స్-27, కామర్స్-93, జర్నలిజం-03, సైకాలజీ-06, మైక్రోబయాలజీ-17, పబ్లిక్ అడ్మిన్‌స్ట్రేషన్-07, సోషియాలజీ-07, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-14.
➥ ఫిజికల్ డైరెక్టర్: 39 పోస్టులు
➥ లైబ్రేరియన్: 36 పోస్టులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
పేస్కేలు: రూ.58,850 - రూ.1,37,050.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.04.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.05.2023.
Also Read:
తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు, వివరాలు ఇలా!
తెలంగాణ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 1276 పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 343 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 147 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 786 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో తెలుగు-183, హిందీ-168, ఇంగ్లిష్-189, మ్యాథమెటిక్స్-231, ఫిజికల్ సైన్స్-142, బయోలాజిక్ సైన్స్-161, సోషల్ స్టడీస్-202 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 24 నుంచే పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉండనుంది. సంబంధిత విభాగాల్లో పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...
తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు, వివరాలు ఇలా!
తెలంగాణ గురుకులాల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 4020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 728 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 218 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 2379 పోస్టులు, మైనార్టీ గురుకులాల్లో 594, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 87, స్త్రీ-శిశుసంక్షేమ అభివృద్ధి పాఠశాలలు 14 పోస్టులు ఉన్నాయి. ఇక సబ్జెక్టులవారీగా చూస్తే.. తెలుగు-488, సంస్కృతం-25, ఉర్దూ-120, హిందీ-516, ఇంగ్లిష్-681, మ్యాథమెటిక్స్-741, ఫిజికల్ సైన్స్-431, బయోలాజిక్ సైన్స్-327, జనరల్ స్టడీస్-98, సోషల్ స్టడీస్-579 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...
APPSC Group1 Mains: జూన్ 3 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు! హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారా?
IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
APKGBV Notification: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!
IGCAR: కల్పక్కం ఐజీసీఏఆర్లో 100 జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !