IAS Vacancies: అఖిల భారత సర్వీసుల్లో 3,137 పోస్టులు ఖాళీ, కేంద్రం వెల్లడి!
దేశంలో మంజూరైన ఐఏఎస్ పోస్టులు 6,789, ఐపీఎస్ పోస్టులు 4,984, ఐఎఫ్‌ఎస్ పోస్టులు 3,191 ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్రసింగ్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు.
![IAS Vacancies: అఖిల భారత సర్వీసుల్లో 3,137 పోస్టులు ఖాళీ, కేంద్రం వెల్లడి! total 3137 vacancies in all india services, Central government announced in Parliament IAS Vacancies: అఖిల భారత సర్వీసుల్లో 3,137 పోస్టులు ఖాళీ, కేంద్రం వెల్లడి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/3f08bfa044c3821e191358b0bf6e61cd1658375509_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశవ్యాప్తంగా 3,137 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రకటించింది. 2022 జనవరి 1 నాటికి దేశంలో మంజూరైన ఐఏఎస్ పోస్టులు 6,789, ఐపీఎస్ పోస్టులు 4,984, ఐఎఫ్‌ఎస్ పోస్టులు 3,191 ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్రసింగ్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు ఆయన బదులిచ్చారు.
మొత్తం 14,964 పోస్టులకు ప్రస్తుతం 11,571 మంది మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 5,317 ఐఏఎస్ అధికారులు, 4,120 ఐపీఎస్ అధికారులు, 2,134 ఐఎఫ్‌ఎస్ అధికారులు పనిచేస్తున్నారని వెల్లడించారు. వీటిలో 1,472 ఐఏఎస్, 864 ఐపీఎస్, 1,057 ఐఎఫ్‌ఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రభుత్వ విభాగాల్లో 9.79 లక్షల ఖాళీలు కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి ఏకంగా 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జితేంద్ర సింగ్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. వీటి భర్తీకి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో 69 వేల ఉపాధ్యాయ పోస్టులు..
తెలుగు రాష్ట్రాల్లో 69,265 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. 2021-22లో ఏపీలో 50,677, తెలంగాణలో 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. డిసెంబర్ 14న రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 50,677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గత మూడేళ్లలో 30,001 నుంచి 30,023కి చేరుకుందని వెల్లడించారు. అదే సమయంలో వాటిలో చేరిన విద్యార్థుల సంఖ్య 28,37,635 నుంచి 33,03,699 (16.42%)కి పెరిగిందని వెల్లడించారు. ప్రైవేటు స్కూళ్లలో చేరినవారి సంఖ్య 39,84,609 నుంచి 35,14,338కి (11.80%) తగ్గిందని పేర్కొన్నారు.
దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో 3,753 బ్యాక్‌లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అడిగిన మరో ప్రశుకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ సమాధానం ఇచ్చారు.
Also Read:
గుడ్ న్యూస్ - ఆర్ఆర్‌బీ 'గ్రూప్-డి' ఫలితాలు వచ్చేస్తున్నాయి, ఎప్పుడంటే?
ఇండియన్ రైల్వేలో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (సీబీటీ) ఫలితాలు త్వరలోనే వెలువనున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ డిసెంబరు 13న ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం డిసెంబరు 24 లేదా అంతకన్నా ముందుగానే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఫలితాలతోపాటు ఫైనల్ కీ, కటాఫ్ మార్కుల వివరాలను కూడా రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ విడుదల చేయనుంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!
ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి (APSLPRB) నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని పోలీసు స్టేషన్ల పరిధిలో 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదోతరగతి పాసై, ఇంటర్ చదువుతూ ఉండాలి. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నవంబరు 30న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 28న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)