అన్వేషించండి
Advertisement
TSPSC: పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల, ర్యాంకింగ్ జాబితా ఇలా
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను TSPSC ప్రకటించింది. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
TS Polytechnics Lecturers GRL: తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటించింది. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కొద్దిరోజుల్లో వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టులకు, సాంకేతిక, ఇంటర్ విద్యలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ విధానంలో గతేడాది సెప్టెంబరు 4, 6, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం సాధ్యమైనన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత (సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు కూడా సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు నిర్వహించింది. ఆ పరీక్షల ఫలితాలను తాజాగా విడుదల చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.
సబ్జెక్టులవారీగా అభ్యర్థుల ర్యాంకుల జాబితాలు ఇలా...
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జనవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 4 నుంచి 8 వరకు సబ్జెక్టులవారీగా పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1(జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 (అభ్యర్థుల సబ్జెక్టు) పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణ కోసం హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, హనుమకొండ, నిజామాబాద్‌లలోని కేంద్రాల్లో నిర్వహించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి లెవల్ 9ఎ- రూ.56,100- 1,77,500, లెవల్-10- రూ.57,700-1,82,400 మధ్య జీతాలు చెల్లిస్తారు.
పరీక్షవిధానం:
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో; పేపర్-2 ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో; పేపర్-2 ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion