TSGENCO: తెలంగాణ జెన్‌కోలో డైరెక్టర్ పోస్టులు - ఎంపికైతే నెలకు రూ.1.5 లక్షల జీతం
TSGENCO Jobs: తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
TSGENCO Directors: తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSGENCO) వివిధ విభాగాల్లో డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా హైడల్, థర్మల్ & ప్రాజెక్ట్స్, హెచ్ఆర్ & ఐఆర్, కోల్ & లాజిస్టిక్స్, ఫైనాన్స్ & కమర్షియల్ విభాగాల్లో డైరెక్టర్ పోస్టులను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అదేవిధంగా కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. అదేవిధంగా కేంద్ర లేదా రాష్ట్రప్రభుత్వ 25 సంవత్సరాల ప్రొఫెషనల్ అనుభవం కలిగి ఉండాలి. ఇందులో కనీసం 3 సంవత్సరాలు చీఫ్ ఇంజినీర్, సూపరింటెండింగ్ హోదాలో, 3 సంవత్సరాలు చీఫ్ జనరల్ మేనేజర్ లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో పనిచేసి ఉండాలి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 30 నుంచి మార్చి 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 62 సంవత్సరాలలోపు ఉండాలి. రెండేళ్ల కాలానికిగాను ఈ నియామకాలు చేపట్టనున్నారు. అభ్యర్థుల పనితీరు ఆధారంగా 1 నుంచి 2 సంవత్సరాలపాటు సర్వీసును పొడిగించే అవకాశం ఉంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు జీతంగా నెలకు రూ.1,50,000తోపాటు ఏడాదికి రూ.30,000 అదనపు భత్యాలుగా ఇస్తారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. ఈమెయిల్ ద్వారా కూడా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌ల మార్పులు లేదా నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం టీఎస్‌జెన్‌కోకు ఉంది.
వివరాలు..
* డైరెక్టర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 05
విభాగాలవారీగా ఖాళీలు: హైడల్-01, థర్మల్ & ప్రాజెక్ట్స్-01, హెచ్ఆర్ & ఐఆర్-01, కోల్ & లాజిస్టిక్స్-01, ఫైనాన్స్ & కమర్షియల్-01.
పోస్టుల వ్యవధి: రెండేళ్ల కాలానికిగాను ఈ నియామకాలు చేపట్టనున్నారు. అభ్యర్థుల పనితీరు ఆధారంగా 1 నుంచి 2 సంవత్సరాలపాటు సర్వీసును పొడిగిస్తారు.
అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగాల్లో కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. అదేవిధంగా కేంద్ర లేదా రాష్ట్రప్రభుత్వ 25 సంవత్సరాల ప్రొఫెషనల్ అనుభవం కలిగి ఉండాలి. ఇందులో కనీసం 3 సంవత్సరాలు చీఫ్ ఇంజినీర్, సూపరింటెండింగ్ హోదాలో, 3 సంవత్సరాలు చీఫ్ జనరల్ మేనేజర్ లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో పనిచేసి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 62 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్నవారు సంబంధిత అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారి పరిశీలన అనంతరం దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు గడచిన 5 సంవత్సరాల ఏసీఆర్ (Annual Confidential Report), ఇంటిగ్రేడెట్ సర్టిఫికేట్, విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: సెలక్షన్ కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేపడతారు.
జీతం: ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు జీతంగా నెలకు రూ.1,50,000తోపాటు ఏడాదికి రూ.30,000 వరకు అదనపు భత్యాలు ఉంటాయి.
దరఖాస్తు సమయంలో అవసరమయ్యే సర్టిఫికేట్లు..
➥ వయసు, విద్యార్హత, జాతీయత, కుల ధ్రువీకరణకు సంబంధించిన అటెస్టెడ్ కాపీలు
➥ గత 5 సంవత్సరాల ఏసీఆర్ రిపోర్ట్
➥ పనిచేస్తున్న సంస్థ నుంచి నిరభ్యంతర పత్రం (NOC)
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Chairman & Managing Director,
A-Block, 2nd Floor, TSGENCO, Vidyut Soudha,
Hyderabad -500082.
ఈమెయిల్: cmd@tsgenco.co.in
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.01.2024.
➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 01.03.2024.