అన్వేషించండి

TS DSC 2024: రేపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్, పోస్టులు ఎన్నంటే?

TS Mega DSC 2024: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి రేపు(ఫిబ్రవరి 29న) లేదా మార్చి 1న 'మెగా డీఎస్సీ' నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.

TS Mega DSC 2024: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి రేపు(ఫిబ్రవరి 29న) 'మెగా డీఎస్సీ' నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ రేపు నోటిఫికేషన్ విడుదలకాని పక్షంలో ఎల్లుండి(మార్చి 1వతేదీన) విడుదల చేస్తారు.  మెగా డీఎస్సీ ద్వారా దాదాపు 11,060 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం.  ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డీఎస్సీకి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపిన సంగతి తెలిసిందే. మే మూడోవారంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. 

ఇప్పటికే డీఎస్సీ నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. మెగా డీఎస్సీ (TS Mega DSC) ద్వారా టీచరు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులపై దృష్టిసారించాలని సీఎం సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు లేరనే సాకుతో మూసేసిన బడులను మళ్లీ తెరిపించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నా.. బడి నడవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో బడి ఉండాల్సిందేనని అన్నారు. బడి లేని కారణంగా విద్యార్థులు చదువులకు దూరం కావొద్దని, చదువుల కోసం వేరు గ్రామాలు, పట్టణాలకు పోయే పరిస్థితులు ఉండొద్దని పేర్కొన్నారు. ఇందుకోసం మెగా డీఎస్సీ వేయాలని, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

గత ప్రభుత్వం 5059 పోస్టులలో డీఎస్సీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ 1739, పండిట్‌ పోస్టులు 611, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 164, ఎస్జీటీ పోస్టులు 2,575 పోస్టులున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పిన ప్రకారం 13 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అయినా ప్రభుత్వం వారి ఆవేదనను పట్టించుకోకుండా నోటిఫికేషన్‌ విడుదల చేసి పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. అయితే ఎన్నికల కారణంగా అది వాయిదా పడింది. అయితే ఆ సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు గత నోటిఫికేషన్‌ ను రద్దు చేసి, 11 వేల టీచర్‌ పోస్టులతో నాలుగైదు రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ నోటిఫికేషన్‌లోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం స్పెషల్‌ టీచర్లను రిక్రూట్‌ చేయనున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. తుది ఫలితాలు వెల్లడికి అడ్డంకిగా మారిన కోర్టు కేసులు, ఇతర కారణాలను న్యాయనిపుణులతో చర్చించి పరిష్కరించింది. పోలీస్‌, గురుకుల, స్టాఫ్‌ నర్స్‌ వంటి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించింది. గ్రూప్‌-1 కూడా హైకోర్టు తీర్పును అనుసరించి గత నోటిఫికేషన్‌ను రద్దు చేసి, ఎలాంటి కోర్టు కేసులు రాకుండా జాగ్రత్తలతో, పెంచిన పోస్టులతో కొత్త నోటిషికేషన్‌ జారీ చేసింది. కొత్త నోటిఫికేషన్‌ వివాదరహితంగా ఉన్నదని పోటీ పరీక్షల నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైనా కోర్టు కేసులతో మళ్లీ ప్రక్రియ ఆగుతుందనే ప్రచారాన్ని విశ్వసించవద్దని, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget